‘యాత్ర’ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్/ఒంగోలు: దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి కోరారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన ‘నాటా’ మహా సంబరాల్లో ఆయన మాట్లాడారు.
నాటా సంబరాల్లో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, అనిల్‌కుమార్ యాదవ్, గౌరు చరితారెడ్డి, కోన రఘుపతి, కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నేతలు లక్ష్మీపార్వతి, శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమవుతున్న సినిమా ‘యాత్ర’ టీజర్‌ను ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment