
ఫిలడెల్పియా : జర్నలిజంలో చేసిన సేవలకుగానూ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఎక్స్‌లెన్స్ అవార్డును సాక్షి టీవీ అవుట్‌పుట్ ఎడిటర్ శ్రీనాథ్ గొల్లపల్లికి ప్రదానం చేశారు. శ్రీనాథ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం, మాస్ కమ్యునికేషన్స్‌లో మాస్టర్స్ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో లా చదివారు. టీవీ మాధ్యమం ద్వారా వార్తలను సమర్పించడంలో ప్రత్యేకీకరణ సాధించిన శ్రీనాథ్ గొల్లపల్లి 1999లో జర్నలిజంలో కేరీర్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ రాజకీయాలు, క్రీడలు, సంస్కృతి, జీవనశైలి విభాగాల్లో కార్యక్రమాలను రూపొందించడంలో శ్రీనాథ్ నిష్ణాతులు. చేనేత కార్మికులపై శ్రీనాథ్ రూపొందించిన డాక్యుమెంటరీకి నాటా పురస్కారం లభించింది.
ఈ కార్యక్రమంలో నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్ గంగసాని రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ డా. రాఘవ రెడ్డి గోసాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. శ్రీధర్ కొర్సపాటి, నేషనల్ కోఆర్డినేటర్ ప్రదీప్ సమల, కన్వెన్షన్ డైరెక్టర్ హరినాథ్ వెల్కురు, కల్చరల్ ఛైర్ అళ్ల రామిరెడ్డిలు పాల్గొన్నారు. మూడు రోజులపాటూ జరిగే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వేడుకల కోసం వేలాది మంది తెలుగు ప్రజలు ఫిలడెల్ఫియా చేరుకున్నారు. దీంతో ఫిలడెల్పియా వీధులన్నీ తెలుగువారితో కళకళలాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment