North american telugu Association
-
నాటా కొత్త కార్యవర్గం
అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ నాటా తన మెగా కన్వెన్షన్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కీలకమైన నాటా కొత్త కార్యవర్గం లాస్ వేగాస్‌లో నామినేట్ అయినట్టు నాటా మీడియా అండ్ పీఆర్ డీవీ కోటిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో నాటా కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ గోసల రాఘవ రెడ్డి నుంచి శ్రీధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశంలో నాటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ ఎమిరేటర్స్ డా. ప్రేమ్‌రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఆది శేషారెడ్డి, డా. మోహన్ మల్లం, డా.సంజీవ రెడ్డి, డా. ప్రసాద్ జీరెడ్డి, డా.చంద్రశేఖర్ నారాల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతీ రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాటా మెగా కన్వెన్షన్ కరోనా కారణంగా 2020లో జరగలేదు. ఈ సారి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు.. పాండమిక్ కాస్తా ఎండమిక్‌గా మారిపోవడంతో మళ్లీ నాటా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. జులై 2023లో డల్లాస్ వేదికగా మెగా కన్వెన్షన్ నిర్వహించనున్నట్టు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. ప్రవాసాంధ్రులను ఒక్కతాటిపైకి తేవడంతో పాటు వారికి సంబంధించిన అన్ని అంశాలు చర్చిస్తామని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంధ, సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అమెరికాలో నివసించే తెలుగు ప్రజలందరికి నాటా ఎప్పుడు అండగా ఉంటుందని, తమ సంస్థ ద్వారా విస్తృతంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు కొర్సపాటి శ్రీధర్ రెడ్డి. న్యూజెర్సీలో నాటా కార్యాలయానికి త్వరలోనే శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు. 2022 - 2023కు గాను నామినేట్ అయిన నాటా కొత్త కార్యవర్గం ► డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(అధ్యక్షులు) ► హరి వేల్కూర్(కాబోయే అధ్యక్షులు) ► ఆళ్ళ రామి రెడ్డి (కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు) ► గండ్ర నారాయణ రెడ్డి(ప్రధాన కార్యదర్శి) ► సోమవరపు శ్రీనివాసులు రెడ్డి(కోశాధికారి) ► మందపాటి శరత్ రెడ్డి(సంయుక్త కోశాధికారి) ► సతీష్ నరాల(సంయుక్త కార్యదర్శి ) ► డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు) ► అంజిరెడ్డి సాగంరెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) ► శ్రీనివాసులు రెడ్డి కోట్లూరే (నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్) ► నగేష్ ముక్కమల్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► దర్గా నాగిరెడ్డి (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► లక్ష్మీ నరసింహారెడ్డి కొండా (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► శ్రీధర్ రెడ్డి తిక్కవరపు (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► సురేన్ బత్తినపట్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) ► సురేష్ రెడ్డి కోతింటి (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) . డల్లాస్ కన్వెన్షన్ కమిటీ: ► గిరీష్ రామిరెడ్డి, కన్వీనర్ ► డా.రామిరెడ్డి బూచిపూడి, కోఆర్డినేటర్ ► కృష్ణ కోడూరు, కో కన్వీనర్ ► భాస్కర్ గండికోట, కో-ఆర్డినేటర్ ► రమణారెడ్డి క్రిష్టపతి డిప్యూటీ కన్వీనర్ ► మల్లిక్ అవుల, డిప్యూటీ కోఆర్డినేటర్ -
NATA: ఏపీకి 500 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ విరాళం
న్యూజెర్సీ: కోవిడ్ సెకండ్ వేవ్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రెండు తెలగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు నాటా(నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) ముందుకు వచ్చింది. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వైరస్ విజృంభిస్తుండటంతో ఆస్పత్రులన్ని కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్ బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ఉంటే.. కొందరు ఇంటి వద్దనే క్వారంటైన్లో ఉండి కోలుకోవచు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, పల్స్ ఆక్సిమీటర్లు, ఇతర వైద్య పరికరాలు అందించేందుకు ముందుకు వచ్చింది’’ అని రాఘవ రెడ్డి తన ప్రకటనలో తెలిపారు. నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ ఎమెరిటస్, ప్రైమ్ హెల్త్ కేర్ అధినేత డాక్టర్ ప్రేమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు 500 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, అవసరమైన ఇతర వైద్య సామాగ్రిని విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రేమ్‌రెడ్డి ప్రైమ్ హాస్పిటల్‌కు దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 44 ఆస్పత్రులు , 300 ఔట్ పేషెంట్ల విభాగాలతో దేశంలో ఐదవ అతిపెద్ద లాభాపేక్షలేని ఆసుపత్రి వ్యవస్థగా నిలించింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో సహా వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా నాటా 250 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు విరాళంగా ఇచ్చింది. మే 31, 2021 న 85 రెసిజన్ కాన్సట్రేటర్స్, 1400 పల్స్ ఆక్సిమీటర్లను వివిధ జిల్లాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తమకు సాయం చేసిన డాక్టర్ అరుమల్లా శ్రీధర్ రెడ్డికి, ఏపీ స్టేట్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి కాకుండా నాటా 165 ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్స్, అదనంగా వెయ్యి పల్స్ ఆక్సిమీటర్లు, ఇతర వైద్య సామాగ్రిని సేకరించి అవసరమున్న కోవిడ్ బాధితులకు అందజేసింది. ఇవే కాక మృతదేహాల దహన సంస్కారాలు, కోవిడ్ ప్రభావంతో ఉన్న కుటుంబాలకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో సహాయపడే వివిధ అనాథాశ్రమాలు , సంస్థలకు సహాయం చేయడానికి నాటా ప్రయత్నిస్తోంది. చదవండి: ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఔదార్యం.. -
తెలంగాణ ప్రభుత్వానికి ‘నాటా ’ అంబులెన్స్ బహూకరణ
లక్సెట్టిపేట్: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ గుండ అమర్నాథ్ దాతృత్వంతో అధ్యక్షుడు డాక్టర్ గోసుల రాఘవరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి అంబులెన్స్ బహూకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు. నాటా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది మందికి చేయూత అందిస్తోంది. ‘సాంస్కృతిక వికాసమే నాటా మాట.. సమాజ సేవయే నాటా బాట’ అనే లక్ష్యంతో అమెరికాలో పలు కార్యక్రమానలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతిని కాపాడుతోంది. అదేవిధంగా పలు హెల్త్ క్యాంప్స్, బస్సు షెల్టర్లు, వీధి దీపాలు, అనాధాశ్రయాలు, వృధాశ్రమాలకు సహాయం చేస్తూ గత పదేళ్లుగా ఎంతో సమాజ సేవ చేస్తూ అమెరికాలో ముందు వరసలో ఉంటోంది. ఈ అంబులెన్సు బహూకరణ కు సహకరించిన దాతలను, అందరినీ సమన్వయం చేసిన గుండ అమర్నాథ్ను నాటా అధ్యక్షులు డాక్టర్ గోసల రాఘవరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: కొత్తూర్‌లో డా.వైఎస్సార్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్ -
వింజనంపాడులో నాట్స్ ఉచిత దంత వైద్య శిబిరం
గుంటూరు: అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చిన అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఇటు ఇండియాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా వింజనంపాడు గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా దంత సమస్యలను ఉచితంగా పరీక్షించడంతో పాటు ఇక్కడకు వచ్చిన గ్రామస్థులకు ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించారు. నాట్స్ అధ్యక్షడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ కలిసి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామస్తులకు పరీక్షలు ఇక్కడ విచ్చేసిన గ్రామస్థులకు వివిధ రకాల నోటి పరీక్షలు చేశారు.ఇంట్రా ఓరల్ కెమెరాలతో దంత సమస్యలు గుర్తించారు. అత్యాధునిక ఇంట్రా ఓరల్ డిజిటల్ పరీక్షలతో పాటు ఎక్స్ రే సెన్సార్, రేడియో గ్రాఫులతో కొన్ని వాధ్యులు గుర్తించారు. వీటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దాదాపు 200 మంది గ్రామస్థులు ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేశారు. తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలు: అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమొచ్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ హెల్ప్ లైన్ కు కాల్ వస్తుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. నాట్స్ అమెరికాలో తెలుగువారికి అండగా నిలబడుతుందని ఆపదలో ఉన్నవారికి ఆదుకుంటుందన్నారు. నాట్స్ తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఇటు తెలుగు నాట కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందన్నారు. తుఫానులు, వరదల సమయంలో కూడా నాట్స్ మానవత్వంతో ముందుకొచ్చి బాధితులకు తన వంతు సాయం అందించిందని శ్రీనివాస్ మంచికలపూడి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని నాట్స్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ తెలిపారు. ప్రభుత్వ బడులను దత్తత తీసుకుని మౌళిక వసతులు కల్పించడం.. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంతో పాటు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో నాట్స్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షితమైన తాగునీరుని అందిస్తుందని మోహనకృష్ణ మన్నవ వివరించారు. భవిష్యత్తులో కూడా తెలుగువారి మద్దతుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వింజనంపాడు పంచాయతీ కార్యదర్శి పూర్ణాశేకర్, డాక్టర్.అనిల్ గారు అండ్ టీం, సీతారాం తాళ్లo మొదలైన వారు పాల్గొన్నారు. -
బాధిత విద్యార్థులకు ‘నాటా’ న్యాయసహాయం
న్యూజెర్సీ : ఫర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు విద్యార్థులకు సాయం చేసేందుకు నార్త్ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (నాటా) ముందుకొచ్చింది. ఫర్మింగ్టన్ యూనివర్సిటీ ఫేక్ అని తెలియక చాలా మంది విద్యార్థులు మోసపోయారని నాటా ప్రెసిడెంట్ డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, కార్యదర్శి ఆళ్ళ రామిరెడ్డి అన్నారు. బాధితుల్లో ఎక్కువమంది తెలుగు విద్యార్థులే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (130 మంది విద్యార్థుల అరెస్టు) అరెస్టయిన వారిలో చాలామంది తమ వర్క్ పర్మిట్ పొందడానికి ఈ యూనివర్సిటీలో చేరానని వెల్లడించారు. బాధిత విద్యార్థులు నాటాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత న్యాయసహాయం అందిస్తామని నాటా నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇమ్మిగ్రేషన్ లాయర్లు విజయ్ ఎల్లారెడ్డిగారి, సంతోష్‌రెడ్డి సోమిరెడ్డి, యాయా తిబిట్ బాధిత విద్యార్థులతో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, వలసదారుల హక్కులేమిటో తెలిపారని, మళ్లీ ఇలాంటి ఘటనల్లో బాధితులు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారని తెలిపారు. తల్లిదండ్రులు భయపడొద్దు.. అరెస్టయిన విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని నాటా నాయకులు తెలిపారు. విచారరణ పూర్తయిన అనంతరం విద్యార్థుల భారత్‌కు పంపుతారని వెల్లడించారు. హోమ్ ల్యాండ్ సెక్యురిటీ శాఖ నిర్బంధంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని భరోసానిచ్చారు. వివరాలు తెలుసుకోవాలంటే.. అరెస్టయిన వారి వివరాలు తెలుసుకోవాలంటే https://locator.ice.gov వెబ్సైట్లో లేదా ఇండియన్ ఎంబసీ వారికి {(202) 322-1190, (202) 340-2590} ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. వివరాలకోసం.. cons3.washington@mea.gov.in కి ఈమెయిల్ చేయవచ్చని తెలిపారు. కష్టపడి చదివిన విద్యార్థులా ఫేక్ యూనివర్సిటీల ఉచ్చులో పడకుండా.. అన్ని రూల్స్ పాటించి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి OPT/CPT పొందడం కోసం కృషి చేయాలని సలహా ఇచ్చారు. ఎటువంటి కోర్లులు లేకుండా ఏ యూనివర్సిటీ అయినా CPT అందించినట్టయితే అలాంటి వర్సిటీలను నమొద్దని హెచ్చరించారు. 129 మంది భారతీయులే.. అమెరికాలో విద్యార్థి వీసాలపై అక్రమంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులను పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) అధికారులు పార్మింగ్టన్ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ వలలో చిక్కిన 8 మంది మధ్యవర్తులు (అందరూ తెలుగు వారే) ఇప్పటికే అరెస్టవ్వగా, తాజాగా 130 మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. 8 మందిపై వీసా సంబంధిత నేరపూరిత కుట్ర, లాభం కోసం అన్యులకు ఆశ్రయమివ్వడం తదితర అభియోగాలను నమోదు చేసిన అధికారులు, విద్యార్థులపై మాత్రం కేవలం పౌర వలస నిబంధనల ఉల్లంఘన అభియోగంతో సరిపెట్టారు. అరెస్టైన 130 మంది విద్యార్థుల్లో 129 మంది భారతీయులేనని ఐసీఈ అధికార ప్రతినిధి ఖాలిద్ వాల్స్ చెప్పారు. వారిని భారత్‌కు తిరిగి పంపించేయనున్నామన్నారు. -
నాటా వేడుకల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
ఫిలడెల్ఫియా : అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా ఉత్సవాల్లో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలను ఎన్నారైలు అభినందించారు. ఫిలడెల్ఫియాలోని నాటా కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్నారైలు వైఎస్సార్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని, అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేస్తారని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు పడుతున్నారని, అలాగే లక్షలాది మందిని కలుస్తున్నారని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ రాజన్న రాజ్యం తెస్తారన్నారు. ఏపీలో ఏ ఊరికి వెళ్లినా చొక్కా గుండీలు విప్పి ఆపరేషన్ అయిన గుండెలు చూపిస్తూ వైఎస్సార్‌ని గుర్తు చేసుకుంటారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో మందికి వైద్యానికి అయ్యే మొత్తం సాయం చేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గుర్తు చేశారు. వైఎస్సార్ అంటేనే ఒక నమ్మకమని, ఆయనున్నారనే భరోసా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉండేదని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అన్నారు. వైఎస్సార్ ప్రజల మనిషని, ప్రజలకోసమే పుట్టి ప్రజల కోసమే బతికిన నాయకుడని అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటూ దివంగత నాయకుడిని స్మరించుకుంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. 2020 నాటా కన్వెన్షన్‌కు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో రావాలని కోరుకుంటున్నామని నాటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాఘవ రెడ్డి అన్నారు. జగన్ సీఎం అయ్యే వరకు ప్రతి వైఎస్సార్ అభిమాని కృషి చేయాలన్నారు. పోలవరం కోసం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు ఓ మహిళ 3 గంటల పాటు ముగ్గురు ఆడపిల్లలతో వేచి చూసిందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. ఎందుకమ్మా అంతసేపటి నుంచి వేచి చూస్తున్నావని అడిగితే, ' నా భర్త మృతి చెందాడు. ముగ్గురు పిల్లలు చెవిటి వాళ్లుగా ఉండేవారు. అయితే ముగ్గురికి వైఎస్సార్ ఆపరేషన్ చేయించారు. రూ.18 లక్షలతో కంకిలియర్ ప్లాంటేషన్ చేయించారు' అని ఆ మహిళ తనతో చెప్పారని అనికుమార్ యాదవ్ పేర్కొన్నారు. నాటా వేడుకల్లో వైఎస్సార్ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ గంగసాని అన్నారు. వీటి కోసం కన్వెన్షన్ తేదీలను మార్చుకున్నామని తెలిపారు. అమెరికాలో ప్రతి ఏటా వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 2019 లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా అని నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ఎన్నో కష్టాల మధ్య పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రతి ఎన్నారై ఓటు వేసేందుకు ఏపీ వెళ్ళాలని సూచించారు. వాళ్ల అందరికి విమానం టిక్కెట్ తాను ఇప్పిస్తానన్నారు. జగన్ కోసం అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కు భారత రత్న ఇవ్వాలని, దాని కోసం కోటి సంతకాల సేకరణ చేపడతామని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో వైఎస్సార్‌ను అనుకరిస్తూ రమేష్ చేసిన మిమిక్రీ అందరిని ఆకట్టుకుంది. ప్రముఖ దాత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) జీవితకాల పురస్కారం అందుకున్న సందర్భంగా నెల్లూరు ఎన్నారై బత్తినపట్ల సురేందర్ రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. -
శ్రీనాథ్ గొల్లపల్లికి నాటా ఎక్స్‌లెన్స్ అవార్డు
ఫిలడెల్పియా : జర్నలిజంలో చేసిన సేవలకుగానూ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఎక్స్‌లెన్స్ అవార్డును సాక్షి టీవీ అవుట్‌పుట్ ఎడిటర్ శ్రీనాథ్ గొల్లపల్లికి ప్రదానం చేశారు. శ్రీనాథ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం, మాస్ కమ్యునికేషన్స్‌లో మాస్టర్స్ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో లా చదివారు. టీవీ మాధ్యమం ద్వారా వార్తలను సమర్పించడంలో ప్రత్యేకీకరణ సాధించిన శ్రీనాథ్ గొల్లపల్లి 1999లో జర్నలిజంలో కేరీర్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ రాజకీయాలు, క్రీడలు, సంస్కృతి, జీవనశైలి విభాగాల్లో కార్యక్రమాలను రూపొందించడంలో శ్రీనాథ్ నిష్ణాతులు. చేనేత కార్మికులపై శ్రీనాథ్ రూపొందించిన డాక్యుమెంటరీకి నాటా పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో నాటా ప్రెసిడెంట్ రాజేశ్వర్ గంగసాని రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ డా. రాఘవ రెడ్డి గోసాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. శ్రీధర్ కొర్సపాటి, నేషనల్ కోఆర్డినేటర్ ప్రదీప్ సమల, కన్వెన్షన్ డైరెక్టర్ హరినాథ్ వెల్కురు, కల్చరల్ ఛైర్ అళ్ల రామిరెడ్డిలు పాల్గొన్నారు. మూడు రోజులపాటూ జరిగే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వేడుకల కోసం వేలాది మంది తెలుగు ప్రజలు ఫిలడెల్ఫియా చేరుకున్నారు. దీంతో ఫిలడెల్పియా వీధులన్నీ తెలుగువారితో కళకళలాడుతున్నాయి. -
నేటి నుంచి నాటా వేడుకలు
అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : నేటి నుంచి (జులై 6) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వేడుకల కోసం వేలాది మంది తెలుగు ప్రజలు ఫిలడెల్ఫియా చేరుకున్నారు. దీంతో ఫిలడెల్పియా వీధులన్నీ తెలుగువారితో కళకళలాడుతున్నాయి. వేడుకల కోసం డౌన్ టౌన్లో నడిబొడ్డున ఉన్న ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌ను అంగరంగ వైభంగా ముస్తాబు చేశారు. దీని పక్కనే ఉన్న హోటల్ మారియట్, కోర్ట్ యార్డ్, లోవిస్తో పాటు స్థానికంగా ఉండే తెలుగు వారింట అతిథులు బస చేశారు. ఈ వేడుకల కోసం వైఎస్సాసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు కృష్ణసాగర్, మధుయాష్కీ ప్రదీప్ కుమార్, జంగా రాఘవరెడ్డిలు ఇప్పటికే ఫిలడెల్ఫియా చేరుకున్నారు. వేడుకల్లో భాగంగా తొలి రోజు బాంకెట్ డిన్నర్‌తో వేడుకలు ప్రారంభమౌతాయి. వేర్వేరు రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులను ఈ వేడుకల్లో సత్కరించనున్నారు. అనంతరం తెలుగు సినీరంగ గాయనీ గాయకుల సారథ్యంలో సంగీత విభావరి జరగనుంది. తర్వాత జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డికి నివాళులు అర్పిస్తారు. తదనంతరం భారత జాతీయ గీతంతో పాటు అమెరికా జాతీయ గీతాలను ఆలపిస్తారు. తరువాత నాటా సావనీర్‌ను ఆవిష్కరిస్తారు. వీటితో పాటు నాటా మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ వేడుకలకు న్యూజెర్సీలో ఉన్న అమెరికా సెనెటర్ థాంసన్ ఆత్మీయ అతిథిగా పాల్గొంటారు. వీరితో పాటు అమెరికా బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటిస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొల్గొంటారు. -
సెయింట్ లూయిస్‌లో ఘనంగా మెగా నాటా డే వేడుకలు
సెయింట్ లూయిస్ : ఫిలడెల్ఫియాలో జులైలో జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి ముందు సెయింట్ లూయిస్‌లో మెగా నాటా డే వేడుకలను నిర్వహించారు. సెయింట్ లూయిస్‌లోని మహాత్మాగాంధీ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి 700 మందికిపైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో 160 మంది కళాకారులు ఆటా, పాటలతో అతిథులను అలరించారు. చెస్, మాథ్స్ పోటీల్లో120 మంది చిన్నారులు హుషారుగా పాల్గొన్నారు. ఈ కల్చరల్ ఈవెంట్లో పాల్గొన్న కళాకారులందరికి నిర్వాహుకలు ట్రోపీలను అందజేశారు. స్థానిక గాయకులు మాధురి గాజుల, సుమ ఆరెపల్లి, సాహితి ముంగండిలు కెనడా నుంచి వచ్చిన ధీరజ్ బాల్ర, న్యూజెర్సీ నుంచి వచ్చిన దీప్తి నాగ్‌లతో కలిసి తమ గాత్రంతో అభిమానులను హోరెత్తించారు. ఫిలడెల్ఫియాలో జులై 6 నుంచి 8 వరకు జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి వచ్చి విజయవంతం చేయాలని సెయింట్ లూయిస్ తెలుగు కమ్యునిటీవారిని నాటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి కోరారు. మెగా నాటా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు తమ బృందంవారికి కృతజ్ఞతలు తెలిపారు. డీజే రవి జూలకంటి, ఈవెంట్ మేనేజ్మెంట్ స్టేజ్ డిజైనర్ కుమార్ రెడ్డి, ఎంసీ నిక్కి భూమా, హన్సితా తెలుగుంట్ల, నర్సిరెడ్డి ఉప్పునూరిలతో పాటూ వాలంటీర్లు ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగడానికి తమవంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో డల్లాస్‌కు చెందిన తిరుమల రెడ్డి కుంభం(ఫైనాన్సియల్ సర్వీస్ మానియా), అట్లాంటాకు చెందిన డా. ధనుంజయ రెడ్డి గడ్డం(షెపర్డ్ యానిమల్ హాస్పిటల్)లు ఉన్నారు. -
వైవీ సుబ్బారెడ్డికి నాటా ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 2018 జూలైలో జరగనున్న నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) సభలకు అతిథిగా హాజరుకావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు నాటా అధ్యక్షుడు జి.రాజేశ్వర్‌రెడ్డి, జి.రాఘవరెడ్డి (ఎలక్ట్) నేతృత్వం లోని ప్రతినిధి బృందం మంగళవారం ఇక్కడ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుంది. వచ్చే ఏడాది జూలై 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు ఈ సభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఐదు నీటిశుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చును వైవీ సుబ్బారెడ్డి, నాటా ట్రస్టు సంయుక్తంగా భరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నాటా ఉపాధ్యక్షుడు శ్రీధర్ కొర్సపాటి, ఆళ్ల రామిరెడ్డి, ద్వారాక్ వారణాసి, ప్రతాప్, ప్రసాద్, ఎస్.నారాయణరెడ్డి, మనోహర్ పాల్గొన్నారు. -
ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన నాటా కమిటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఉత్సవాలకు హాజరు కావాలసిందిగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం అందింది. 2018 జూలై 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నాటా ఉత్సహాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నాటా కమిటీ మంగళవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కలుసుకుంది. నాటా ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా నాటా బృందం విజ్ఞప్తి చేసింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఉత్సవాలకు ఆహ్వానించిన వారిలో నాటా అధ్యక్షులు జి.రాజేశ్వర్‌రెడ్డి, జి. రాఘవరెడ్డి (ఎలక్ట్), శ్రీదర్ కొర్రపాటి, ఆళ్ల రామిరెడ్డి, ద్వారక్ వారణాసి, ప్రతాప్, ప్రసాద్, ఎస్. నారాయణరెడ్డి, మనోహర్ తదితరులు ఉన్నారు. -
ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన నాటా కమిటీ
-
నాటా ఆధ్వర్యంలో వరంగల్‌లో భారీ సభ
డిసెంబరు 23న వరంగల్ జిల్లాలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాటా అధ్యక్షుడు గంగాసాని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. వరంగల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవ్ ఏ గర్ల్ చైల్డ్‌తో పాటు పలు సామాజిక సదస్సులు నిరుపేద మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతులు అందివ్వనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రలలో నిర్వహిస్తున్నామని అన్నారు. వరంగల్‌లో జరిగే కార్యక్రమాలలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలియజేశారు. -
4,34,000 డాలర్ల వసూళ్లతో నాటా రికార్డు
అమెరికా:అమెరికాలో తెలుగు జాతి ఐక్యత, తెలుగు భాష, సంస్కృతి కోసం కృషి చేస్తున్న నార్త్ అమెరికా ఆఫ్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఒకే రోజులో 4,34,000 డాలర్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాటా ప్రతీ ఏటా నిర్వహించే వేడుకలు శనివారం అంగర వైభవంగా అట్లాంటాలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ తెలుగు సినీ తార లయ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సభలో నాటా కన్వీనర్ బాలా ఇందుర్తి మాట్లాడుతూ.. ఒకే రోజులో 4,34,000 డారల్ల పెద్ద మొత్తాన్ని వసూలు చేయడం ముప్పై ఏళ్ల చరిత్రలో ఇదే ప్రధమం అన్నారు. అమెరికాలోని తెలుగువారి అభివృద్ధికి స్థానికంగా ఉండి సేవలదింస్తున్న తామా, గాటా అసోసియేషన్ లు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ భారీ వసూళ్లలో వారు కూడా పాలుపంచుకుని సహకారం అందించారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి కృషి చేసిన జాతీయ, స్థానిక సంస్థల సభ్యులకు ఇందుర్తి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తానాతో పాటు నాట్స్, టీసీఐ, అమృతి వర్షిణి, వైభవ మైత్రి, ఇషా యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా, సాయి టెంపుల్ ఆఫ్ అట్లాంటా లు భాగస్వామ్యం అయ్యాయన్నారు. డా.సంజీవ్ రెడ్డి అధ్యక్షతన నాటా అట్లాంటా టీం ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. అట్లాంటా లో సాఫ్ట్ వేర్ రంగంలో సేవలందిస్తున్న పారామౌంట్ సాఫ్ట్ వేర్ 50,000 డాలర్లు విరాళంగా అందించిందన్నారు. ఈ భారీ వసూళ్లకు సహకారం అందించిన కంపెనీ సీఈవో ప్రమోద్ సజ్జకు ప్రత్యేక కృతజ్ఞతులు తెలిపారు. 25,000 డాలర్లు పైగా విరాళాలు అందించిన వారిలో .శ్రీని వంగిమళ్ల (సెరినిటీ ఇన్ఫోటెక్), శ్రీనివాస్ నిమ్మగడ్డ(వెన్ సాయ్ టెక్నాలజీస్), ప్రశాంత్ కొల్లిపార(బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్స్) ఉన్నారు. -
అట్లాంటాలో నాటా డే
-
సమాజ సేవే నాటా బాట: సంజీవ టీ రెడ్డి
నాటా అధ్యక్షుడు సంజీవ టీ రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ మూడేళ్ల కిందట 50 మందితో మొదలు ఇప్పుడు 8వేల మంది సభ్యులతో సమాజ సేవ సొంత రాష్ట్రంలో విరివిగా సేవా కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్.. క్లుప్తంగా ‘నాటా’.. ప్రవాసాంధ్రులందరికీ ఈ పేరు సుపరిచితం. విదేశాల్లో తెలుగువారికి అండదండగా నిలిచేందుకు మూడేళ్ల క్రితం పురుడు పోసుకున్న ‘నాటా’ ఇప్పుడు తన సేవలను విసృ్తతం చేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటోంది. గత నెల రాష్ట్రంలోని పది జిల్లాల్లో ‘నాటా సేవా డేస్’ పేరుతో పలు సేవా కార్యక్రమాలు అమలు చేసింది. 2011లో కేవలం యాభై మంది సభ్యులతో ప్రారంభమైన నాటా ప్రస్తుతం 8 వేల మంది సభ్యులతో వికసిస్తోంది. సాంస్కృతిక వికాసమే నాటా మాట.. సమాజ సేవే నాటా బాట అని ముందుకు వెళ్తున్న నాటా అధ్యక్షుడు సంజీవ టీ రెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. మీరు స్వదేశంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలేంటి? గత నెల 16 నుంచి 29 వరకు నాటా సేవా డేస్ నిర్వహించాం. మేం పర్యటించిన ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేవని గుర్తించాం. అందుకే 2015లో మళ్లీ సేవా డేస్ నిర్వహించినప్పుడు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కూర్చోవడానికి బల్లలు, విద్యార్థినుల కోసం మరుగుదొడ్లు నిర్మించాలని తలపెట్టాం. అంతేకాదు విసృ్తతంగా వైద్య శిబిరాలు కూడా నిర్వహించాలని యోచిస్తున్నాం. పలుచోట్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా నిర్మించే యోచనలో ఉన్నాం. సమాజ సేవకు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? గతనెల 15 రోజుల పాటు నిర్వహించిన నాటా సేవా డేస్ పది జిల్లాల్లో అమలు చేశాం. మొత్తం రూ.4 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో నెల్లూరులో పదిచోట్ల వాటర్ ప్లాంట్లు, ఐదు శ్మశాన వాటికల్లో ‘క్లీన్ అండ్ గ్రీన్’ చేపట్టాం. ఈ ఒక్క జిల్లాలోనే రూ.రెండు కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రెండు చోట్ల వాటర్ ప్లాంట్లు పెట్టించాం. సుంకిశాల పక్కనే ఉన్న గ్రామంలో సోలార్ లైట్లు ఏర్పాటుచేశాం. నాటా సేవా డేస్‌లో ఎక్కువగా విద్య, వైద్యంపై దృష్టిసారించాం. గత నెల 17న వైఎస్సార్ జిల్లా పుల్లంపేటలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి 700మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాం. అలాగే అనంతయ్యగారిపల్లెలో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశాం. కడపలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించి 34 మంది విద్యార్థులకు సర్జరీలు నిర్వహించేందుకు సిఫార్సు చేశాం. అనంతపురం, నెల్లూరు, గుంటూరు, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో కూడా నేత్ర, వైద్య శిబిరాలు నిర్వహించి సుమారు పదివేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. -
అట్లాంటాలో నాటా 2014 మహాసభలకు సన్నాహాలు
అట్లాంటా: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) 2014 జూలై 4 నుంచి 6 వరకు అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ మహాసభలను నిర్వహించేందుకు సన్నహాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8న జరిగిన `టేస్ట్ ఆఫ్ ఇండియా' రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ లో జరిగిన సమావేశంలో పలువురు ప్రముఖులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ బాలా ఇందుర్తి మాట్లాడుతూ.. 2014 మహాసభల కోసం 45 కమిటీలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. కో కన్వీనర్ తంగిరాల సత్యనారాయణ రెడ్డి ఈ నెల 16నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలో నాటా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం చివరిలో క్రికెటర్ భారత రత్న సచిన్ టెండూల్కర్ ను గౌరవిస్తూ కేక్ కట్ చేశారు. -
2014 సమావేశాలకు ‘నాటా’ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 2014 సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. 2014 జూలై 4 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ‘నాటా 2014 కాన్వకేషన్’ ప్రచారంలో భాగంగా అక్టోబర్ 18, 19 తేదీల్లో ‘మీట్ అండ్ గ్రీట్’ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 600 మంది తెలుగు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2014 కాన్వకేషన్ కోసం విరాళాలను సేకరించగా ఒక్క రోజులోనే 7 లక్షల అమెరికన్ డాలర్ల విరాళాలు అందినట్లు నాటా సలహా మండలి అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి వెల్లడించారు. మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న ప్రముఖ ఫిలాంత్రోపిస్ట్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి చెరో లక్ష డాలర్ల విరాళాలు అంద జేశారన్నారు. అట్లాంటాలో జరిగే 2014 నాటా కాన్వకేషన్‌లో 10 వేల మంది తెలుగువారు పాల్గొననున్నారని పేర్కొన్నారు. -
తెలుగు వారి దరిచేరిన ‘నాటా నగారా’
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు జాతి ఐక్యత, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారందరినీ చేరుకునేందుకు ‘నాటా నగారా’ పేరిట కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈశాన్య అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో నగారా బృందం పర్యటించింది. హంట్స్‌విల్లే, నాష్విల్లే, మెంఫిస్, అట్లాంటా, చార్లెటే, బర్మింగ్‌హామ్ ప్రధాన నగరాల్లో పర్యటించి సాహిత్య, సంగీత కార్యక్రమాలతో తెలుగు వారిని ఆకర్షించింది. ‘నగారా’లో చేపట్టిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించిందని ‘నాటా’ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. 2014 జూలై 4 నుంచి 6 వరకు అమెరికాలోని అట్లాంటా నగరంలో నిర్వహించనున్న ‘నాటా 2014 కన్వెన్షన్’ తమ ప్రస్థానంలోనే అతిపెద్ద కార్యక్రమంగా నిలవనుందని అన్నారు. దీనికి ప్రచారం కల్పించి తెలుగువారందరినీ చేరుకునేందుకు ఈ నగారా నిర్వహించినట్లు తెలిపారు. ‘నాటా 2014 కన్వెన్షన్’లో దాదాపు 10వేల మంది తెలుగువారు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలకు గాయకుడు మురళీకృష్ణ గానంతో నగారాలో తెలుగు సంస్కృతి వైభవాన్ని మనోరంజకంగా చాటిచెప్పామన్నారు. రచయిత చంద్రబోస్ ‘నాటా’ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని నాటా 2014 కన్వెన్షన్ కన్వీనర్ బాల ఇందుర్తి తెలిపారు. గాయకుడు మురళీకృష్ణకు ‘నవ యువ బాలసుబ్రమణ్యం’, చంద్రబోస్‌కు ‘స్వభావకవి’ బిరుదులిచ్చి సత్కరించినట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.