4,34,000 డాలర్ల వసూళ్లతో నాటా రికార్డు
అమెరికా:అమెరికాలో తెలుగు జాతి ఐక్యత, తెలుగు భాష, సంస్కృతి కోసం కృషి చేస్తున్న నార్త్ అమెరికా ఆఫ్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఒకే రోజులో 4,34,000 డాలర్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాటా ప్రతీ ఏటా నిర్వహించే వేడుకలు శనివారం అంగర వైభవంగా అట్లాంటాలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ తెలుగు సినీ తార లయ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సభలో నాటా కన్వీనర్ బాలా ఇందుర్తి మాట్లాడుతూ.. ఒకే రోజులో 4,34,000 డారల్ల పెద్ద మొత్తాన్ని వసూలు చేయడం ముప్పై ఏళ్ల చరిత్రలో ఇదే ప్రధమం అన్నారు.
అమెరికాలోని తెలుగువారి అభివృద్ధికి స్థానికంగా ఉండి సేవలదింస్తున్న తామా, గాటా అసోసియేషన్ లు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ భారీ వసూళ్లలో వారు కూడా పాలుపంచుకుని సహకారం అందించారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి కృషి చేసిన జాతీయ, స్థానిక సంస్థల సభ్యులకు ఇందుర్తి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తానాతో పాటు నాట్స్, టీసీఐ, అమృతి వర్షిణి, వైభవ మైత్రి, ఇషా యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా, సాయి టెంపుల్ ఆఫ్ అట్లాంటా లు భాగస్వామ్యం అయ్యాయన్నారు. డా.సంజీవ్ రెడ్డి అధ్యక్షతన నాటా అట్లాంటా టీం ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు.
అట్లాంటా లో సాఫ్ట్ వేర్ రంగంలో సేవలందిస్తున్న పారామౌంట్ సాఫ్ట్ వేర్ 50,000 డాలర్లు విరాళంగా అందించిందన్నారు. ఈ భారీ వసూళ్లకు సహకారం అందించిన కంపెనీ సీఈవో ప్రమోద్ సజ్జకు ప్రత్యేక కృతజ్ఞతులు తెలిపారు. 25,000 డాలర్లు పైగా విరాళాలు అందించిన వారిలో .శ్రీని వంగిమళ్ల (సెరినిటీ ఇన్ఫోటెక్), శ్రీనివాస్ నిమ్మగడ్డ(వెన్ సాయ్ టెక్నాలజీస్), ప్రశాంత్ కొల్లిపార(బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్స్) ఉన్నారు.