సాక్షి, హైదరాబాద్: సమాజంలో అట్టడుగు స్థాయి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా, సంస్కరణలలో కూడిన పాలన సాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్న దారే సరైనదని ‘నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)’తెలుగు మహాసభల్లో వక్తలు తేల్చి చెప్పారు.. వైఎస్సార్ సీపీ అమలు చేస్తున్న పథకాలు, విధానాలను ఏపీలో ప్రతిపక్షాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించడం ఇందుకు సాక్ష్యమని స్పష్టం చేశారు.
అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహాసభలు–2023లో భాగంగా రాజకీయ ప్యానెల్ చర్చలు జరిగాయి. ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటర్ వర్ధెల్లి మురళి, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు.
అవాస్తవ ప్రచారాలతో మభ్యపెడుతూ..
ఇటీవల చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారని.. ఏదైనా వైఎస్ జగన్ చేసిన దానికి ఐదు రెట్లు చేస్తామని ప్రకటించారని కొమ్మినేని చెప్పారు. ఇన్నాళ్లూ జగన్ సంక్షేమ పథకాలను తప్పుపట్టిన రెండు పత్రికలు.. చంద్రబాబు హామీలను ఎంతో పొగిడాయని గుర్తు చేశారు. అంటే వైఎస్ జగన్ చేస్తున్నదే సరైనదని, చంద్రబాబు దాన్ని అనుసరించాల్సిందేనని వారే ఒప్పుకొంటున్నారని స్పష్టం చేశారు.
దేశంలో ఎన్నికల మేనిఫెస్టోకు ఒక విలువ, ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని.. చెప్పింది చెప్పినట్టుగా 98.5 శాతం హామీలను జగన్ నెరవేర్చారని చెప్పారు. దీనితో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేక.. కావాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ అవాస్తవ ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు.
సుస్థిర అభివృద్ధి దిశగా పాలన
‘‘స్వాతంత్య్రం నాటికి విపరీతమైన అసమానతలు, భిన్నత్వం, కుల వ్యవస్థ, పాలన తీరు వంటివి ఉన్నా.. రాజ్యాంగం దేశాన్ని ఒక్కటిగా, ప్రజాస్వామ్య మార్గంలోకి తీసుకెళ్లింది. రాజ్యాంగ పీఠిక ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమన్యాయం కలి్పస్తామని హామీ ఇచి్చంది. ఈ సైద్ధాంతిక పునాది, స్ఫూర్తితోనే పేదలు ఏయే రంగాల్లో వెనుకబడి ఉన్నారో అన్నింటిలోనూ వారిని ముందుకు తీసుకువచ్చేందుకు వీలుగా.. సుస్థిర అభివృద్ధికి వీలుగా విధానాలను, పథకాలను అమలు చేస్తున్న ఒకే ఒక ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమే..’’అని ‘సాక్షి’మీడియా గ్రూపు ఎడిటర్ వర్ధెల్లి మురళి తెలిపారు. ఇటీవలి ‘టైమ్స్ నౌ–నవభారత్ సర్వే’ప్రజల్లో వైఎస్ జగన్‌కు ఉన్న ఆదరణను పట్టి చూపిందని, 24–25 ఎంపీ సీట్లు వైఎస్సార్ సీపీకే వస్తాయని తేలి్చందని వివరించారు.
నాడు–నేడు ఎంతో మార్పు
విద్య, వైద్యంతోపాటు సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో ‘నాడు–నేడు’ఎంతో మార్పు వచి్చందని.. మౌలిక సదుపాయాల కల్పన నుంచి ఆర్థిక సాయం దాకా అన్ని అంశాల్లో పేదలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు పథకాలను అమలు చేస్తుంటే దోచిపెడుతోందంటూ ప్రతిపక్షం అవాస్తవ ప్రచారాలకు పాల్పడుతోందని.. పేదలకు మంచి విద్య, సరైన వైద్యం అందిస్తే దోచిపెట్టినట్టా? అని ప్రశ్నించారు. మాటలే కాదు.. చేతల్లో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని చెప్పారు.
పూర్తి వీడియో
Comments
Please login to add a commentAdd a comment