Welfare and development schemes
-
NATA Political debate: సీఎం వైఎస్ జగన్ సర్కారు మార్గమే సరైనది
సాక్షి, హైదరాబాద్: సమాజంలో అట్టడుగు స్థాయి వరకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా, సంస్కరణలలో కూడిన పాలన సాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్న దారే సరైనదని ‘నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)’తెలుగు మహాసభల్లో వక్తలు తేల్చి చెప్పారు.. వైఎస్సార్ సీపీ అమలు చేస్తున్న పథకాలు, విధానాలను ఏపీలో ప్రతిపక్షాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించడం ఇందుకు సాక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహాసభలు–2023లో భాగంగా రాజకీయ ప్యానెల్ చర్చలు జరిగాయి. ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటర్ వర్ధెల్లి మురళి, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. అవాస్తవ ప్రచారాలతో మభ్యపెడుతూ.. ఇటీవల చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారని.. ఏదైనా వైఎస్ జగన్ చేసిన దానికి ఐదు రెట్లు చేస్తామని ప్రకటించారని కొమ్మినేని చెప్పారు. ఇన్నాళ్లూ జగన్ సంక్షేమ పథకాలను తప్పుపట్టిన రెండు పత్రికలు.. చంద్రబాబు హామీలను ఎంతో పొగిడాయని గుర్తు చేశారు. అంటే వైఎస్ జగన్ చేస్తున్నదే సరైనదని, చంద్రబాబు దాన్ని అనుసరించాల్సిందేనని వారే ఒప్పుకొంటున్నారని స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికల మేనిఫెస్టోకు ఒక విలువ, ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని.. చెప్పింది చెప్పినట్టుగా 98.5 శాతం హామీలను జగన్ నెరవేర్చారని చెప్పారు. దీనితో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేక.. కావాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ అవాస్తవ ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. సుస్థిర అభివృద్ధి దిశగా పాలన ‘‘స్వాతంత్య్రం నాటికి విపరీతమైన అసమానతలు, భిన్నత్వం, కుల వ్యవస్థ, పాలన తీరు వంటివి ఉన్నా.. రాజ్యాంగం దేశాన్ని ఒక్కటిగా, ప్రజాస్వామ్య మార్గంలోకి తీసుకెళ్లింది. రాజ్యాంగ పీఠిక ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమన్యాయం కలి్పస్తామని హామీ ఇచి్చంది. ఈ సైద్ధాంతిక పునాది, స్ఫూర్తితోనే పేదలు ఏయే రంగాల్లో వెనుకబడి ఉన్నారో అన్నింటిలోనూ వారిని ముందుకు తీసుకువచ్చేందుకు వీలుగా.. సుస్థిర అభివృద్ధికి వీలుగా విధానాలను, పథకాలను అమలు చేస్తున్న ఒకే ఒక ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమే..’’అని ‘సాక్షి’మీడియా గ్రూపు ఎడిటర్ వర్ధెల్లి మురళి తెలిపారు. ఇటీవలి ‘టైమ్స్ నౌ–నవభారత్ సర్వే’ప్రజల్లో వైఎస్ జగన్‌కు ఉన్న ఆదరణను పట్టి చూపిందని, 24–25 ఎంపీ సీట్లు వైఎస్సార్ సీపీకే వస్తాయని తేలి్చందని వివరించారు. నాడు–నేడు ఎంతో మార్పు విద్య, వైద్యంతోపాటు సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో ‘నాడు–నేడు’ఎంతో మార్పు వచి్చందని.. మౌలిక సదుపాయాల కల్పన నుంచి ఆర్థిక సాయం దాకా అన్ని అంశాల్లో పేదలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు పథకాలను అమలు చేస్తుంటే దోచిపెడుతోందంటూ ప్రతిపక్షం అవాస్తవ ప్రచారాలకు పాల్పడుతోందని.. పేదలకు మంచి విద్య, సరైన వైద్యం అందిస్తే దోచిపెట్టినట్టా? అని ప్రశ్నించారు. మాటలే కాదు.. చేతల్లో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని చెప్పారు. పూర్తి వీడియో -
సీఎం వైఎస్ జగన్.. మూడేళ్ళ సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో
-
Rewind 2021: పడిలేచిన కెరటంలా..
కాలచక్రం గిర్రున తిరిగింది. పాత స్మృతులను చెరిపేసింది. నేటితో క్యాలెండర్లో ఈ ఏడాది మాయమైపోనుంది. ఇప్పటికీ కంటికి కనిపించని మహమ్మారి భయం వెంటాడుతూనే ఉంది. 2020తో పోలిస్తే 2021లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. అనేక వర్గాలు ఇప్పటికీ క్షామంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం క్షీణించింది. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. కోవిడ్ కట్టడికి చర్యలు చేపడుతూనే.. మరోవైపు విశాఖ ప్రగతికి బాటలు వేసింది. విశాఖను పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దేందుకు సంకల్పించి 2021లో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పనకు అనేక ప్రణాళికలు రూపొందించింది. గడిచిన ఏడాది కాలంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు సుస్థిర, ప్రశాంత విశాఖ కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితానిచ్చాయి. ఈ ఏడాది జిల్లాలో జరిగిన సంక్షేమం.. అభివృద్ధి.. వివిధ సంఘటనలు ఓసారి పరికిస్తే.. – దొండపర్తి(విశాఖ దక్షిణ) జగనన్న అమ్మ ఒడి చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి, ఎంపీ ఎంవీవీ జనవరి ►11వ తేదీన అమ్మ ఒడి పథకం ద్వారా జిల్లాలో 4.1 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున నగదును జమ చేసిన ప్రభుత్వం. ►16వ తేదీన జిల్లాలో ప్రారంభమైన కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ►20వ తేదీన విశాఖ–భోగాపురం ఆరులైన్ల రహదారి నిర్మాణంలో భాగంగా గోస్తనీ సంగమం వద్ద వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►21వ తేదీన ఇంటి ముంగిటకే రేషన్ సరకులు అందించేందుకు జిల్లాలో 828 మినీ ట్రక్కులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ►22వ తేదీన స్వచ్ఛ సర్వేక్షణ్–2021లో భాగంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ అంశంలో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకిన విశాఖ ►28వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు కింద పర్యావరణహితంగా, ప్రజా ప్రయోజనకరంగా బీచ్‌ను తీర్చిదిద్దేందుకు తొలి విడతలో రూ.45.09 కోట్ల నిధులు మంజూరుకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కార్యాలయం నుంచి కూర్మన్నపాలెం వరకు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఫిబ్రవరి ►4వ తేదీన మధురవాడలో అదానికి 130 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ►12వ తేదీన హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతున్న తరుణంలో అనంతగిరి ఘాట్ రోడ్డు లోయలో ప్రమాదవశాత్తూ టూరిస్టు బస్సు పడిన ఘటనలో నలుగురు మృతి. ►17వ తేదీన శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విమానాశ్రయంలో స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘ నాయకులతో సుదీర్ఘ భేటీ. ►20వ తేదీన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కార్యాలయం నుంచి కూర్మన్నపాలెం వరకు 25 కిలోమీటర్ల మేర వెల్లువలా తరలివచ్చిన ప్రజానీకంతో కలిసి ఉక్కు పరిశ్రమ పోరాట యాత్ర చేసిన ఎంపీ వి.విజయసాయిరెడ్డి కర్నూలు– విశాఖ విమాన సర్వీస్ ప్రారంభం మార్చి ►14వ తేదీన జీవీఎంసీ ఎన్నికల్లో 58 స్థానాల్లో గెలుపొంది మేయర్ పీఠాన్ని దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ►18వ తేదీన నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గొలగాని హరివెంకటకుమారి ►20వ తేదీన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.సృజన ►28వ తేదీన కర్నూలు–విశాఖ విమాన సర్వీసులు ప్రారంభం. ►29వ తేదీన దళిత గిరిజనులకు తిరమలేశుని దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ ఎంవీవీ, ఎమ్మెల్యేలు ఏప్రిల్ ►3వ తేదీన ప్రత్యేక అధికారుల పాలనకు ముగింపు పలుకుతూ గ్రామాల వారీగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నిరాడంబరంగా పదవీ బాధ్యతల స్వీకరణ ►8వ తేదీన ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ►9వ తేదీన తొమ్మిదేళ్ల తర్వాత ఏర్పాటైన జీవీఎంసీ పాలకవర్గం. తొలి సమావేశంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కౌన్సిల్. ►15వ తేదీన మిథిలాపురి వుడా కాలనీలో ఆదిత్య ఫార్చ్యూన్ అపార్టుమెంట్లో అగ్ని ప్రమాదంలో ఎన్ఆర్ఐ కుటుంబంలో భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమారులు అనుమానాస్పద మృతి. ►15వ తేదీన పెందుర్తి మండలం వి.జుత్తాడలో పాత కక్షలతో ఒకే కుటుంబంలోని ఆరుగురిని అత్యంత పాశవికంగా నరికి చంపిన మానవమృగం అప్పలరాజు ►19వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా జిల్లాలో 93,189 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.56.46 కోట్లు తొలి త్రైమాసిక ఫీజు కింద జమ చేసిన ప్రభుత్వం ►20వ తేదీన వీఎంఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు అథారిటీని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ►20వ తేదీన వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద జిల్లాలో 31,187 మంది రైతుల ఖాతాల్లోకి రూ.4.86 కోట్లు వడ్డీ రాయితీ నిధులను జమ చేసిన ప్రభుత్వం ►23వ తేదీన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద జిల్లాలో 72,577 డ్వాక్రా సంఘాల ఖాతాల్లో రూ.66.42 కోట్లు జమ చేసిన ప్రభుత్వం ►28వ తేదీన జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా జిల్లాలో 90,488 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.85.07 కోట్లు జమ చేసిన ప్రభుత్వం హెచ్పీసీఎల్లో జరిగిన ప్రమాదంలో ఎగిసిపడుతున్న మంటలు మే ►13న వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 3.86 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.289.88 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►14వ తేదీన కోవిడ్ బాధితుల కోసం ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షీలానగర్ ప్రాంతంలో వికాస్ కళాశాలలో ఏర్పాటు చేసిన 300 ఆక్సిజన్ బెడ్ల కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ►18వ తేదీన వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకంలో భాగంగా జిల్లాలో 22,366 మంది మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున జమ చేసిన ప్రభుత్వం. ►20వ తేదీన విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం. ►25వ తేదీన మల్కాపురంలోని హెచ్పీసీఎల్లో సీడీ–3 ప్లాంట్‌లో అగ్ని ప్రమాదంతో ఎగసిన మంటలను 8 ఫైర్ ఇంజిన్లతో గంటలో అదుపులోకి తీసుకువచ్చిన యంత్రాంగం. ►25వ తేదీన సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృతి, ఎనిమిది మంది గల్లంతు. ►25వ తేదీన వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద జిల్లాలో రూ.8.54 కోట్లు పరిహారంగా 14,652 మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. ►30వ తేదీన హుకుంపేట మండలం తీగలవలస సమీపంలో ఉన్న గుడ్డిగుమ్మి జలపాతంలో ఈతకు వెళ్లి మృతి చెందిన ముగ్గురు యువకులు. ►31వ తేదీన అనకాపల్లిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగన్నన కాలనీకి శంకుస్థాపన జూన్ ►1న అచ్యుతాపురం సెజ్‌లో అంతర్జాతీయ పరిశ్రమలు సెయింట్ గోబిన్, గోల్డ్‌ప్లస్ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రణాళికల కమిటీ ఆమోదం. ►3వ తేదీన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలి దశ గృహ నిర్మాణాలు ప్రారంభం. ►4వ తేదీన కథా దిగ్గజం కాళీపట్నం రామారావు(కారా మాస్టారు) మృతి ►8వ తేదీన జగనన్న తోడు రెండో దఫాలో జిల్లాలో 35,186 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.35.19 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►15వ తేదీన వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలో 33,494 మంది ఆటోడ్రైవర్ల ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున రూ.33.49 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►16వ తేదీన కొయ్యూరు మండలంలో తీగలమెట్ట గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టుల మృతి. ►22వ తేదీన వైఎస్సార్ చేయూత పథకం కింద రెండో దఫాలో జిల్లాలో 1,99,695 మంది మహిళల ఖాతాల్లో రూ.374.42 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►26వ తేదీన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సతీసమేతంగా విశాఖకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. ►26వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా 2019–20కు సంబంధించి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయోడైవర్సిటీ విభాగంలో విశాఖ 5 స్టార్ రేటింగ్‌ను చేజిక్కించుకుంది. అనకాపల్లి వద్ద ఫ్లైవోవర్ కూలి ధ్వంసమైన లారీ జూలై ►6వ తేదీన అనకాపల్లి జలగలమదుం వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి కారు, ట్యాంకర్‌పై పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు. ►17వ తేదీన నామినేటెడ్ పదవుల్లో జిల్లాకు ప్రాధాన్యం కల్పిస్తూ 11 మందికి పోస్టుల కేటాయింపు. ►22వ తేదీన వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా జిల్లాలో 21,177 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.31.76 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►26వ తేదీన బీచ్ రోడ్డులో విక్టరీ ఎట్ సీ వద్ద కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు నివాళులు అర్పించిన నేవీ అధికారులు, సిబ్బంది. ►27వ తేదీన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ సీపీ ►28వ తేదీన జిల్లా 124వ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున. ►29వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఫీజురీయింబర్స్‌మెంట్ రెండో విడత కింద ప్రభుత్వం రూ.59.96 కోట్లను 96,403 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ. ►29వ తేదీన వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ అభ్యంతరాల పరిశీలనకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ►29వ తేదీన జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల భాగస్వామ్యంతో ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడి విద్యార్థులు, యువతకు శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ‘ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్. ►30వ తేదీన జీవీఎంసీ ఎన్నికలో రెండో డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కటుమూరి సతీష్‌కుమార్. ఉక్కు ఉద్యమంలో మేము సైతం అంటున్న చిన్నారులు ఆగస్ట్ ►10వ తేదీన వైఎస్సార్ నేతన్న హస్తం మూడో విడత కింద జిల్లాలో 246 మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.60.96 లక్షలు జమ చేసిన ప్రభుత్వం. ►19వ తేదీన వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అక్కరమాని విజయనిర్మల, నెడ్‌క్యాప్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కె.కె.రాజు ► 24వ తేదీన 20 వేలలోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులు 94,560 ఖాతాల్లోకి రూ.88.29 కోట్లు నగదును జమ చేసిన ప్రభుత్వం. ►29వ తేదీన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 10 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించిన అఖిలపక్షాలు ►30వ తేదీన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న రిలే దీక్షలకు 200 రోజులు పూర్తి. గులాబ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మునిగిన ఎయిర్‌పోర్టు సెప్టెంబర్ ►3వ తేదీన జిల్లాలో 487 ఎంఎస్ఎంఈల ఖాతాల్లోకి రూ.21.70 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►19వ తేదీన జిల్లా పరిషత్ ఎన్నికల్లో 37 స్థానాలకు గానూ 36 చోట్ల విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు. ►23వ తేదీన యూఎస్‌లో విద్యనభ్యసించాలనే విద్యార్థులకు దిశానిర్ధేశం చేయడంతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్‌ను ప్రారంభించిన అమెరికన్ కాన్సులేట్ జనరల్ రీఫ్‌మన్, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ►24వ తేదీన విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఠాకూర్ ►25వ తేదీన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జల్లిపల్లి సుభద్ర. ►27వ తేదీన జిల్లాలో 34.07 సెం.మీ.వర్షపాతంతో బీభత్సం సృష్టించిన గులాబ్ తుపాను ►27వ తేదీన కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను నిరసిస్తూ రైతు, ప్రజా సంఘాల పిలుపుమేరకు చేపట్టిన భారత్ బంద్ విశాఖలో ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. స్వచ్ఛ వాహనాలు ప్రారంభిస్తున్న ఎంపీ, మంత్రి, నగర మేయర్, తదితరులు అక్టోబర్ ►7వ తేదీన వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండో విడతలో జిల్లాలో 63,991 సంఘాల ఖాతాల్లో రూ.470 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►12వ తేదీన రూ.10.11 కోట్లతో 303 ఖాళీ స్థలాల అభివృద్ధి, పరిరక్షణ పనులకు శంకుస్థాపన చేసిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ►12వ తేదీన స్వచ్ఛ విశాఖ లక్ష్యంగా నగరంలో చెత్త సేకరణకు 290 వాహనాలను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ►14వ తేదీన జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ). ►20వ తేదీన ‘జగనన్న తోడు’ పథకంలో భాగంగా జిల్లాలో 31,465 మంది చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ వృత్తుల వారి ఖాతాల్లో రూ.1.09 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►21వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్డులో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన సీపీ మనీష్‌కుమార్ సిన్హా, డీఐజీ ఎల్.కె.వి.రంగారావు, ఎస్పీ బి.కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు. ►26వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా కింద 3.74 లక్షల మందికి రూ.88.39 కోట్లు, పీఎం కిసాన్ కింద 3.29 లక్షల మందికి రూ.68.85 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి రూ.138.97 లక్షలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం. ►28వ తేదీన విశాఖలో వేద, సంస్కృతి పాఠశాలకు, భీమిలి మండలం అన్నవరంలో 7 స్టార్ లగ్జరీ రిసార్ట్, అదానీ డేటా సెంటర్‌కు 130 ఎకరాల భూములను కేటాయిస్తూ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆమోదముద్ర. ►30వ తేదీన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి.లక్ష్మీ శ. విశాఖ–కిరండూల్ మధ్య విస్టాడోమ్ కోచ్‌తో కూడిన రైలును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నవంబర్ ►8వ తేదీన వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్–2041కు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వం. ►9వ తేదీన పాతపట్నం ఎమ్మెల్యే కుమార్తె వివాహ రిసెప్షన్ కోసం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ►16వ తేదీన గులాబ్ తుపానుతో పంట నష్టపోయిన 7,684 మంది రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.2.93 కోట్లు జమ చేసిన ప్రభుత్వం. ►20వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2021లో తొమ్మిదో ర్యాంక్ సాధించిన విశాఖ. ►21వ తేదీన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. ►22వ తేదీన విశాఖపట్నం–కిరండూల్ విస్టాడోమ్ ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. ►25వ తేదీన నీతి ఆయోగ్ వెల్లడించిన పట్టణ సుస్థిరాభివృద్ధి సూచించిన ర్యాంకుల్లో దేశంలో ఉన్న నగరాల్లో 18వ స్థానంలో నిలిచిన విశాఖ. ►25వ తేదీన ఎండాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన త్రీ టౌన్ సీఐ ఈశ్వరరావు ►26వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి. ►29వ తేదీన కార్తీక మాసం సందర్భంగా ఆర్కే బీచ్‌లో కార్తీకమాస దిపోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను సత్కరిస్తున్న శంకరమఠం నిర్వాహకులు డిసెంబర్ ►16వ తేదీన తూర్పు నావికాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులైన సంజయ్ వాత్సాయన్. ►16వ తేదీన విశాఖ పర్యటనకు వచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ►17వ తేదీన నగరంలో రూ.247.32 కోట్లతో నిర్మించిన 12 ప్రాజెక్టులను ప్రారంభించిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. ►21వ తేదీన పోర్టు స్టేడియంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి. ►21వ తేదీన జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ►25వ తేదీన అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన వీఎంఆర్డీఏ పార్కులోకి సందర్శకులకు అనుమతించిన వీఎంఆర్డీఏ అధికారులు -
స్వచ్ఛమైన చిరునవ్వు.. మాట తప్పని నైజం
అమరావతి: ‘చెదరని చిరునవ్వే ఆయుధం.. పోరాడే గుణమే ఆయన బలం.. మాట తప్పని నైజం .. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే వారసత్వం.. ప్రజల ముఖాల్లో ఎల్లప్పుడూ సంతోషం కనిపించాలనే తపనతో సంక్షేమ పాలన అందిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జననేత జన్మదినం పురస్కరించుకొని రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ఈ రెండున్నరేళ్ల పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి పాలన చిరకాలం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.. మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్. అందుకే రాష్ట్ర ప్రజలు జననేత వెంట నడుస్తున్నారు. జగన్‌కు జై కొడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తే అప్పట్లో అధికార పార్టీకి చెమటలు పట్టాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా పాలన సాగిస్తుంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలకు దిక్కుతోచడం లేదు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఇంతటి కష్ట సమయంలోనూ వైయస్ జగన్ హామీల అమలులో ముందుకు సాగుతున్నారు. తాను గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. ఇందుకు ఉదాహరణగా వందకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విప్లవాత్మకమైన సంస్కరణలు, చట్టాలే సజీవ సాక్ష్యం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు రెండున్నరేళ్ల పాలనలోనే దాదాపు 96 శాతం అమలు చేసి జనరంజక పాలన అందిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధే గీటురాయిగా... రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు... వ్యయం చేస్తోందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విశ్లేషించింది. 2019 – 20 నుంచి వరుసగా పరిశీలిస్తే ..అభివృద్ధి వ్యయం ఏటా పెరుగుతోందని ఆర్బీఐ నివేదికతో స్పష్టమవుతోంది. అభివృద్ధి వ్యయం 2020–21తో పోల్చితే....2021–22లో ఏకంగా 33.5 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. సామాజిక రంగాల వ్యయం కూడా భారీగా పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలపై... ఆర్బీఐ విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. ఇక 2019–20 నుంచి ఉద్యోగుల జీతభత్యాలు బాగా పెరిగాయని.. అలాగే గతంలో చేసిన అప్పులకు ...వడ్డీ చెల్లింపులూ అధికమయ్యాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లగా ప్రజారోగ్యం... కుటుంబ సంక్షేమంపై వ్యయం పెరిగిందని తెలిపింది. పెరిగిన జీతభత్యాల పద్దు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 27 శాతం మధ్యంతర భృతి పెంచారు. వైద్య ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున శాశ్వత ఉద్యోగాలను కల్పించడంతో పాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న చిరు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచారు. దీంతో జీత భత్యాల పద్దు భారీగా పెరిగింది. గత సర్కారు హయాంలో ... 2018–19లో ఉద్యోగుల జీతభత్యాల పద్దు...రూ.32,743.40 కోట్లు ఉండగా...2021–22లో అది రూ.50,662.20 కోట్లకు చేరిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి. ఆహారం నిల్వ తదితర రంగాల వ్యయం.. 2019–20లో మొత్తం బడ్జెట్లో 45.4 శాతం ఉండగా...2021–22లో 49.4 శాతానికి పెరిగింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై ... గత మూడు సంవత్సరాలుగా బడ్జెట్లో వ్యయం పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. 2019–20లో బడ్జెట్లో ఈ రంగంపై 4.3 శాతం వ్యయం చేయగా 2020–21లో 5.2 శాతం వ్యయం చేసినట్లు తెలిపింది. 2021–22లో 6.1 శాతం మేర కేటాయింపులు చేసినట్లు వెల్లడించింది. అభివృద్ధికే ఎక్కువ వ్యయం ప్రధాన ఆర్థిక సూచికల ప్రకారం చూస్తే మూడు ఆర్ధిక సంవత్సరాల్లో అభివృద్ధియేతర వ్యయం కన్నా అభివృద్ధికే ఎక్కువ వ్యయం చేస్తున్నట్లు ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. చదువుల్లో ఏపీ టాప్ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో మన ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ ఇటీవల విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ఫౌండేషన్ విద్య అందుబాటు అంశంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. చిన్న రాష్ట్రాల కేటగిరీలోని వివిధ అభివృద్ధి సూచికల్లో ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇతర అభివృద్ధి సూచికల విషయంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు మాత్రమే సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ఇతరులకు రోల్ మోడల్‌గా నిలుస్తాయి. కానీ, కొన్ని సమయాల్లో సవాళ్లను పరిష్కరించేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేర్చుకోవాలి. చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవచ్చు’ అని పేర్కొంది. అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం చదువులు, సీబీఎస్ఈ వంటి విప్లవాత్మక మార్పులతో దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలిచింది. పల్లెకు ప్రాణనాడి 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ 104 అంబులెన్స్ సేవలు పల్లెకు ప్రాణనాడిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 656 MMUలు వెళ్తున్నాయి. ఈ ఏడాదిన్నరలో గ్రామీణ వైద్యం రూపురేఖలు మారింది. గత జూలై నుంచి 1.03 కోట్ల మందికి వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితమైన 8.54 లక్షల మందికి ఇంటి వద్దే వైద్యం అందించారు. 43.36 లక్షల మందికి పరీక్షలు.. 41.96 కోట్ల మందుల పంపిణీ చేశారు. గత సర్కారు హయాంలో మంచం పట్టిన ఈ వ్యవస్థకు జవసత్వాలు కల్పించి ప్రతి మండలానికి ఒక 104 చొప్పున మొత్తం 656 వాహనాలను సీఎం జగన్ ప్రభుత్వం గతేడాది జూలై 1 నుంచి అందుబాటులోకి తెచ్చింది. గ్రామ వికాసానికి కృషి చేసేలా ‘రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి పంట విక్రయం దాకా అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా నిలిచి అమిత ఆదరణ పొందుతున్న రైతు భరోసా కేంద్రాలు గ్రామ వికాసానికి పూర్తి స్థాయిలో దోహదం చేసేలా సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 9,899 పాల సేకరణ కేంద్రాల భవన నిర్మాణాలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. భవనాల నిర్మాణం పూర్తి కాగానే వీటిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించనున్నారు. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఆర్బీకేల పరిధిలో పలు సదుపాయాలు కలిగిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను యుద్ధప్రాతిపదిక అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రూ.9,104 కోట్ల వ్యయంతో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఏపీలో పారిశ్రామిక విప్లవం రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం మొదలైంది. కరోనాకు ఎదురొడ్డి రెండు భారీ పారిశ్రామిక పార్కులను వైయస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో .. 3,155 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు (25 వేల కోట్ల భారీ పెట్టుబడులు, 75వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి). 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (10 వేల కోట్ల పెట్టుబడులు,25 వేల మందికి ఉపాధి ) వీటి ద్వారా రూ.35,000 కోట్ల పెట్టుబడులు.. లక్ష మందికి ఉపాధి ఈ నెల డిసెంబర్ 23న ప్రారంభించనున్న సీఎం రూ.207 కోట్లతో ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ యూనిట్ డిక్సన్ కంపెనీలో ఉద్యోగాలకు నియామక పత్రాల జారీ మరో 4 భారీ ఎలక్ట్రానిక్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూ.. మరో 18 చిన్న యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభం తైవాన్, రష్యా, ఇండియా సెమీ కండక్టర్స్ అసోసియేషన్స్‌తో కొప్పర్తికి పెట్టుబడుల ఒప్పందం 23న బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్‌కు, 24న పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ యూనిట్‌కు శంకుస్థాపన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), 801 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ) వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్ ద్వారా రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడులు 75,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. వైఎస్సార్ ఈఎంసీ ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి కల్పించనుంది కీలక ఒప్పందాలు ఈఎంసీలో డిక్సన్ సంస్థ రూ.127 కోట్ల పెట్టుబడితో హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. డిక్సన్ రూ.80 కోట్ల పెట్టుబడితో ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్స్ తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా మరో 1,100 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌లో రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ యూనిట్ ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఏపీలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి నేతృత్వంలో సంస్థ బృందం ఈ నెల 16న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైంది. ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో మరిన్ని పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో భాగస్వామి కావడానికి ఆసక్తి వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్ సీఈవో కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. బియ్యం ఎగుమతుల్లో దూసుకుపోతున్న ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బియ్యం ఎగుమతుల్లో దూసుకుపోతోంది. 2019–20 లో బియ్యం ఎగుమతులు రూ.1,902.65 కోట్లు 2020–21లో రూ.5,790 కోట్ల విలువైన 22.09 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి. ఈ ఏడాది అక్టోబర్‌కే రూ. 4,131.86 కోట్ల విలువైన 16.38 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బియ్యం ఎగుమతులు 30 లక్షల టన్నులు దాటుతాయని అంచనా . ప్రస్తుతం రాష్ట్ర ఎగుమతుల్లో 5 శాతం వాటాను కలిగి ఉన్న బియ్యం .. ప్రపంచదేశాల డిమాండ్‌ను అందిపుచ్చుకున్న రాష్ట్రం. కొత్త ఏడాదిలో పింఛన్ పెంపు కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైయస్ జగన్ సర్కార్ కానుక ఇవ్వనుంది. 2022 జనవరి నుంచి వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.2500 అందించనున్నారు. వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.2250 నుంచి రూ.2500కు పెంచనున్నారు. జనవరి 1, 2022న అమలు కానుంది. జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో వైయస్ జగన్ సర్కార్ రూ.2500 పెట్టనుంది. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజున ఓటీఎస్ ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. తణుకులో ఏర్పాటు చేసిన ఓటీఎస్ అవగాహన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తారు. ఏడాది మొత్తం అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు 16 లక్షలు కాగా ఓటీఎస్ ద్వారా 51 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల మేర భారీ బకాయిలను మాఫీ చేస్తోంది. క్లియర్ టైటిల్ ఇస్తోంది. ఆస్తిని అమ్ముకునేందుకు లేదా తమవారికి బహుమతిగా ఇవ్వడానికి పూర్తి హక్కులు కల్పిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశం దక్కుతుంది. ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. చాలావరకు ఈ ఇళ్లు ఉన్న చోట రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంది. అంత మొత్తంపై రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నాం. ఉచిత రిజిస్ట్రేషన్ వల్ల పేదలకు దాదాపు రూ.6 వేల కోట్ల మేర లబ్ధి కలుగుతోంది. ఇలా మొత్తం రూ.16 వేల కోట్ల దాకా పేదలకు ప్రయోజనం కలుగుతుంది. -
ముందు రాతలు, తర్వాత అధికారులు.. వాహ్ క్యా ప్లాన్
ముందు రికార్డుల్లో రాతలు మార్చాలి. తర్వాత అధికారులను ఏమార్చాలి. ఇదీ ప్లాన్. కానీ అంతా అనుకున్నట్టు జరగదు కదా.. సంపూర్ణ పోషణ పాల అక్రమ రవాణా కేసులో కొందరు అంగన్వాడీ సిబ్బంది తప్పు మీద తప్పు చేస్తున్నారు. పాత తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త తప్పులు చేస్తున్నారు. అష్ట దిగ్బంధనమవుతున్న దశలో రికార్డుల రూపురేఖలు కూడా మార్చేస్తున్నారు. వీరి తీరు అధికార వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సాక్షి, శ్రీకాకుళం: వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో రికార్డుల దిద్దుబాట్లు జోరుగా జరుగుతున్నాయి. పాల ప్యాకెట్ల సరఫరాలో తేడాలు స్పష్టంగా కనిపించడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డుల్లో అంకెలు మార్చుతున్నారు. రెండు రోజులుగా సెక్టార్ మీటింగ్‌లని చెప్పి, కార్యకర్తలను పిలిచి, సూపర్వైజర్లు దగ్గరుండి ఈ తంతు జరిపి స్తున్నారు. ఈ నెల 3వ తేదీన భామిని మండలం బత్తిలి చెక్‌పోస్టు వద్ద పాలప్యాకెట్ల అక్రమ రవాణా వెలుగు చూసిన నాటి నుంచి నేటి వరకు ఈ వ్యవహారం అనేక మలుపులు తీసుకుంటోంది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఒకవైపు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులు రంగం సిద్ధం చేస్తుంటే.. మరోవైపు ప్రాజెక్టు పరిధిలో ఆ చర్యల నుంచి తప్పించుకునేందుకు, న్యాయపరంగా దొరకకుండా ఉండేందుకు రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. ఇదే విషయమై సమాచారం తెలుసుకున్న ‘సాక్షి’ అక్కడికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసేసరికి రికార్డులు మూసేయండంటూ కార్యకర్తలు సైగలు చేశారు. కానీ లాభం లేకపోయింది. ఏం జరిగిందంటే..? ►ఇటీవల భామిని మండలం బత్తిలి చెక్‌పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడిన పాల ప్యాకెట్లలో తేడాలపై రికార్డులు దిద్దుబాట్లు జరపాలంటూ అంగన్వాడీ కార్యకర్తలను సూపర్వైజర్ పట్టుబట్టారు. ►ఐసీడీఎస్ స్టాక్ పాయింట్ నుంచి డెలివరీ చేసిన రికార్డులకు, అంగన్వాడీ కేంద్రాలకు చేరిన పాలు నిల్వల రికార్డులకు వ్యత్యాసం ఉంది. ►ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి సరఫరా చేసిన పాల నిల్వల్లో వ్యత్యాసం ఉండడం, అవే నెలలకు సరఫరా చేసిన పాల ప్యాకెట్లు పోలీసు లు పట్టబడడంతో దర్యాప్తు చేస్తున్నారు. ►వీరఘట్టం ఐసీడీఎస్ పీఓ, సూపర్వైజర్లు స్టాక్ పాయింట్ వద్ద పర్సంటేజీ రూపంలో పాల ప్యా కెట్లు మినహాయించి మిగిలిన పాలను నెలల వా రీగా అంగన్వాడీ కేంద్రాలకు అందజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే సీడీపీఓ సెలవులో ఉన్నారు. ప్రస్తుతం సూపర్వైజర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే..? వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సూపర్వైజర్ జె.జ్ఞానమ్మ ఆధ్వర్యంలో వంగర, వీరఘట్టం మండలాల సెక్టార్ పరిధి అంగన్వాడీ కార్యకర్తల సమావేశం గురు, శుక్రవారాల్లో జరిగింది. ►ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రికార్డులను అంగన్వాడీ కార్యకర్తలు దిద్దుబా టు చేసేశారు. వాటిలో కూడా తేడాలుండటంతో సెక్టార్ సమావేశంలో సూపర్ వైజర్ జె.జ్ఞానమ్మ ఒత్తిడి మేరకు పీఓ కార్యాలయం వద్ద ఉన్న రికార్డులు దిద్దుబాటు చేస్తున్నారు. తొలుత కార్యకర్త లు సతాయించినా.. ఈ గండం నుంచి బయటపడాలంటే ఇలా చేయాల్సిందేనంటూ ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న రికార్డుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నా రులు పేర్లు కొన్ని చోట్ల(ఏప్రిల్, మే, జూన్) నెలలకు సంబంధించి తొలగించడం, కొన్ని తప్పుడు పేర్లు యాడ్ చేయడంతో నిల్వలకు సరిపడినట్లు కాగితాలపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ►కొంత మంది అంగన్వాడీ కేంద్రాల్లో లొసుగులు ఉండడంతో కార్యకర్తలంతా ఏమీ చేయలేక ఐసీడీఎస్ అధికారులు మాటలకు తలొగ్గి దిద్దుబాటే శరణ్యంగా భావించి రికార్డులు తారుమారు చేస్తున్నారు. ►అంగన్వాడీ కేంద్రాల వద్ద ప్రతి నెల నిల్వ ఉన్న పాలను ఆ తదుపరి నెలకు లెక్క చూపిస్తారు. అ యితే పాల రికార్డులు తప్పుల తడకగా ఉండడంతో ఆ పాలను సూపర్వైజర్లు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో నమోదు చేయడం లేదు. దీని కారణంగా దర్యాప్తులో గుర్తించిన పాలతోపాటు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో షార్టేజీ చూపించారు. దీన్ని దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దిద్దుబాటు సరికాదు సెక్టార్ సమావేశాల్లో రికార్డులు దిద్దుబాటు చేయకూడదు. సీడీపీఓ సెలవులో ఉన్నారు. ఇన్చార్జి పా లనలో ఉంది. అక్కడేం జరిగిందో తెలుసుకుని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. శనివారం ఆ ప్రాజెక్టుకు వెళ్తాం. రికార్డులన్నీ పరిశీలిస్తాం. – జి.జయదేవి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, శ్రీకాకుళం -
అలా ముగిసింది..
తూతూమంత్రంగా ఐటీడీఏ సమావేశం * విద్య, వైద్యంపై కానరాని ప్రణాళిక * రుణసాయంపై అందని భరోసా * పెండింగ్ పనుల పూర్తికి లేని గడువు * రెండో రోజు సగం మంది గైర్హాజర్ సాక్షి, హన్మకొండ : నాలుగున్నరేళ్ల తర్వాత ఐటీడీఏ పాలకమండలి సమావేశం జరుగుతుండడంతో సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుకు నిర్ధిష్ట కార్యాచరణ రూపొందిస్తారని, ఇకపై అంతా సవ్యంగా జరుగుతుందని ఆశించిన గిరిజనులకు చుక్కెదురైంది. ‘ఉత్తీర్ణత శాతాన్ని 90 శాతానికి పైగా చూపిస్తే సరిపోదు.. ఉత్తీర్ణులయ్యే వారంతా ఏ గ్రేడ్‌తోనే పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు మన బడి-మన ప్రణాళిక, మన హాస్టల్-మన రూపొందిచాలి’ అంటూ లోతైన విశ్లేషణతో ప్రారంభమైన ఐటీడీఏ పాలకమండలి సమావేశం చివరకు నిస్సారంగా ముగిసింది. వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నత్తనడకన సాగడానికి కారకులైన వారిని గుర్తించడం, అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేసే చర్యలపై చర్చించకుండానే సమావేశాన్ని మమ అనిపించారు. రెండో రోజు పాలకమండలి సమావేశానికి సగం మంది ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. ఎంపీలు గుండు సుధారాణి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపూరి రాజలింగం, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సమావేశానికి రాలేదు. మన బడి - మన విద్య ఎప్పుడో... నాణ్యమైన విద్యను అందించడం ద్వారా గిరిజనులను త్వరితగతిన అభివృద్ధిలోకి తీసుకురావచ్చంటూ మొదటి రోజు సమావేశంలో ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా మన ఊరు-మన ప్రణాళిక తరహాలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, ఆశ్రమపాఠశాలల్లో అక్కడి అవసరాలకు అనుగుణంగా మార్పులు.. చేర్పులు చేపట్టాలని డిప్యూటీ సీఎం రాజయ్య సూచించారు. కానీ... ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపొందించ లేదు. కేవలం ఏటూరునాగారంలో ఇంటర్మీడియట్ కోర్సును ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఒకే ఒక్క విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 13 మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు.. వైద్యుల కొరత వంటి అంశాలను ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ఏకరువు పెట్టినా.. వీటిపై ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఐటీడీఏ పరిధిలోని అన్ని పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా మార్చాలని కోరగా.. కేవలం ఒక్క ఏటూరునాగారం ఆస్పత్రిలో గైనకాలజిస్టు, అనస్తీషియా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తీర్మానం చేశారు. భరోసా లేని ఆర్థిక సాయం ఆదివారం జరిగిన సమీక్షలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక సాయం చేసేం దుకు రూ 6.6 కోట్లు మంజూరయ్యాయని.. 959 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని కలెక్టర్ కిషన్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు రాకపోవడంతో వీరికి రుణసాయం అందించలేదన్నారు. కనీసం ఈ సమావేశంలో అయినా రుణసాయం త్వరగా అందిం చేందుకు చర్యలు చేపడతారని ఎదురు చూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఎంపికైన లబ్ధిదారులకు సత్వర సాయమందించే విషయంలో ఎటువంటి భరోసా ఇవ్వలేదు. గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులకు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలివ్వాలని రాపోలు ఆనందభాస్కర్ సూచించగా... ఎటువంటి హామీ లభించలేదు. పరిష్కారానికి నోచుకోని అటవీ వివాదాలు అటవీహక్కుల చట్టం చుట్టూ నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఇటు గిరిజన ప్రజాప్రతినిధులు, అటు అటవీశాఖ అధికారులు కోరినప్పటికీ... ఏ విధమైన స్పష్టత ఇవ్వకుండా ఈ అంశాన్ని అర్ధంతరంగా వదిలేశారు. ఇంజినీరింగ్ విభాగంలో నాలుగైదేళ్లుగా నత్తనడకన సాగుతున్న పనులు పూర్తి చేసేందుకు ఎటువంటి గడువు విధించలేదు. మరోసారి సమీక్షిస్తామని చెప్పిన అధికారులు అందుకు కనీసం తేదీని కూడా ప్రకటించకపోవడంతో అసంపూర్తిగా ఉన్న భవనాలు ఎప్పుడు పూర్తవుతాయో ? అందులో నాణ్యత ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రెండో రోజు తీర్మానాలివే... రెండో రోజు సమావేశంలో మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ ఐటీడీఏ పాలకమండలి తీర్మానం చేసింది. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం ఆర్డినెన్స్ రద్దు చేయడం... ఐటీడీఏ పీఓకు కొత్త వాహనం కొనుగోలు, ఖాళీలను వెంటనే భర్తీ చేయడం వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. అదేవిధంగా మహబూబాబాద్‌లో మాడా కార్యాలయం ఏర్పాటు చేసి ఆర్డీ స్థాయి అధికారిని అక్కడ నియమించాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న చిలకలగుట్ట ఫెన్సింగ్ పనులు త్వరగా పూర్తి చేయడంతోపాటు మల్లూరు దేవస్థానం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సభ్యులు సూచించారు.