డిసెంబరు 23న వరంగల్ జిల్లాలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాటా అధ్యక్షుడు గంగాసాని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. వరంగల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సేవ్ ఏ గర్ల్ చైల్డ్‌తో పాటు పలు సామాజిక సదస్సులు నిరుపేద మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతులు అందివ్వనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రలలో నిర్వహిస్తున్నామని అన్నారు. వరంగల్‌లో జరిగే కార్యక్రమాలలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలియజేశారు.