2014 సమావేశాలకు ‘నాటా’ సన్నాహాలు | NATA prepare for 2014 Meetings in US | Sakshi
Sakshi News home page

2014 సమావేశాలకు ‘నాటా’ సన్నాహాలు

Published Fri, Oct 25 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

NATA prepare for 2014 Meetings in US

సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 2014 సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. 2014 జూలై 4 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ‘నాటా 2014 కాన్వకేషన్’ ప్రచారంలో భాగంగా అక్టోబర్ 18, 19 తేదీల్లో ‘మీట్ అండ్ గ్రీట్’ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 600 మంది తెలుగు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా 2014 కాన్వకేషన్ కోసం విరాళాలను సేకరించగా ఒక్క రోజులోనే 7 లక్షల అమెరికన్ డాలర్ల విరాళాలు అందినట్లు నాటా సలహా మండలి అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి వెల్లడించారు. మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న ప్రముఖ ఫిలాంత్రోపిస్ట్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి చెరో లక్ష డాలర్ల విరాళాలు అంద జేశారన్నారు. అట్లాంటాలో జరిగే 2014 నాటా కాన్వకేషన్‌లో 10 వేల మంది తెలుగువారు పాల్గొననున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement