
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 2018 జూలైలో జరగనున్న నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) సభలకు అతిథిగా హాజరుకావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు నాటా అధ్యక్షుడు జి.రాజేశ్వర్‌రెడ్డి, జి.రాఘవరెడ్డి (ఎలక్ట్) నేతృత్వం లోని ప్రతినిధి బృందం మంగళవారం ఇక్కడ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుంది. వచ్చే ఏడాది జూలై 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు ఈ సభలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఐదు నీటిశుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చును వైవీ సుబ్బారెడ్డి, నాటా ట్రస్టు సంయుక్తంగా భరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నాటా ఉపాధ్యక్షుడు శ్రీధర్ కొర్సపాటి, ఆళ్ల రామిరెడ్డి, ద్వారాక్ వారణాసి, ప్రతాప్, ప్రసాద్, ఎస్.నారాయణరెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment