సెయింట్ లూయిస్ : ఫిలడెల్ఫియాలో జులైలో జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి ముందు సెయింట్ లూయిస్‌లో మెగా నాటా డే వేడుకలను నిర్వహించారు. సెయింట్ లూయిస్‌లోని మహాత్మాగాంధీ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి 700 మందికిపైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో 160 మంది కళాకారులు ఆటా, పాటలతో అతిథులను అలరించారు. చెస్, మాథ్స్ పోటీల్లో120 మంది చిన్నారులు హుషారుగా పాల్గొన్నారు. ఈ కల్చరల్ ఈవెంట్‌లో పాల్గొన్న కళాకారులందరికి నిర్వాహుకలు ట్రోపీలను అందజేశారు. స్థానిక గాయకులు మాధురి గాజుల, సుమ ఆరెపల్లి, సాహితి ముంగండిలు కెనడా నుంచి వచ్చిన ధీరజ్ బాల్ర, న్యూజెర్సీ నుంచి వచ్చిన దీప్తి నాగ్‌లతో కలిసి తమ గాత్రంతో అభిమానులను హోరెత్తించారు.
ఫిలడెల్ఫియాలో జులై 6 నుంచి 8 వరకు జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి వచ్చి విజయవంతం చేయాలని సెయింట్ లూయిస్ తెలుగు కమ్యునిటీవారిని నాటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి కోరారు. మెగా నాటా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు తమ బృందంవారికి కృతజ్ఞతలు తెలిపారు. డీజే రవి జూలకంటి, ఈవెంట్ మేనేజ్‌మెంట్ స్టేజ్ డిజైనర్ కుమార్ రెడ్డి, ఎంసీ నిక్కి భూమా, హన్సితా తెలుగుంట్ల, నర్సిరెడ్డి ఉప్పునూరిలతో పాటూ వాలంటీర్లు ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగడానికి తమవంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో డల్లాస్‌కు చెందిన తిరుమల రెడ్డి కుంభం(ఫైనాన్సియల్ సర్వీస్ మానియా), అట్లాంటాకు చెందిన డా. ధనుంజయ రెడ్డి గడ్డం(షెపర్డ్ యానిమల్ హాస్పిటల్)లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment