cultural event
-
తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వసమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు”అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారంఅని, వీటిని పరిరక్షించవలసిన బాధ్యత మనఅందరిదీ అంటూపాల్గొంటున్న అతిథులకు స్వాగతం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – సామెతలు, పొడుపుకథలలో పరిశోధనలుచేసిన, చేస్తున్నసాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ..“భాషాసౌందర్యం, అనుభవ సారం, నీతి, సూచన, హాస్యంకలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయని, వీటిని కోల్పోకుండా భావితరాలకు అందించడంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయ వలసిన కృషి ఎంతైనా ఉందన్నారు” పొడుపుకథలలో పరిశోధనచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పీహెచ్డీ పట్టా అందుకుని, అదే విశ్వ విద్యాలయంలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై “తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానంఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కల్గించే పొడుపు కథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారం, నిగూఢభావం కల్గిన పొడుపుకథలు పల్లె పట్టుల్లో, మరీముఖ్యంగా జానపద గేయాలలో కూడా ఎక్కువగా ఉంటాయని అనేక ఉదాహరణలతో శ్రావ్యంగా గానంచేసి వినిపించారు.ప్రత్యక అతిథిగా హాజరైన డా. ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కార గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదభందాలుమొదలైనసాహితీ ప్రక్రియలన్నీ మన తెలుగు సిరిసంపదలని, వాటి గొప్పదనాన్ని ఒక విహంగ వీక్షణంగా ప్రతిభా వంతంగా స్పృశించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్వతెలుగు అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, ఆచార్య డా. సి.ఎచ్ సుశీలమ్మ (గుంటూరు)– ‘కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన’ ; నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు జి.ఎస్ చలం (విజయనగరం) ‘ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన’; మైసూరులోని తెలుగు అధ్యయన, పరిశోధనా విభాగంలో సహాయా చార్యులుగా పని చేస్తున్న ఆచార్య డా. బి నాగశేషు (సత్యసాయి జిల్లా) – ‘రాయలసీమ ప్రాంత సామెతలపైన’; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు - తులనాత్మక పరిశీలన” అనేఅంశంపై పి.ఎచ్.డి చేస్తున్నబుగడూరు మదనమోహన్ రెడ్డి (హిందూపురం) – ‘వ్యవసాయరంగ సామెతలపై’ ఎన్నో ఉదాహరణలతో చేసిన అసక్తికర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య ఎంత పెద్దది అయ్యిందో చూడండి!
-
డల్లాస్‌లో తానా కళాశాల అభినందన
డల్లాస్, టెక్సాస్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తానా కళాశాల' అభినందన కార్యక్రమం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గం తో పాటు పలువురు కళాప్రియులు వచ్చారు. అనంతరం తానా కళాశాల చైర్మన్ డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి, కో-చైర్ మాలతీ నాగభైరవలు కళాశాల కార్యక్రమాల గురించి వివరించారు. గత ఐదేళ్లుగా తానా సంస్థ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కూచిపూడి, భరతనాట్యం, సంగీతం కోర్సులకి ఎనలేని స్పందన లభిస్తోందన్నారు., ఇప్పటికి దాదాపు 400 పైగా విద్యార్థులు ఈ కోర్సులో చేరి సరిఫికేట్స్ పొందారని తెలిపారు. తానా సహకారంతోనే ఈ కళాశాల అభివృద్ధి సాధ్యపడిందన్నారు. తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. మహిళా విశ్వవిద్యాలయం సలహా సహకారాలతో ఈ శిక్షణా తరగతులని అమెరికా అంతటా విస్తృతం చేయాలన్నారు. తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట మాట్లాడుతూ భారతీయ కళలు తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే దిశగా తానా పని చేస్తుందన్నారు. నృత్య, సంగీత గురువులు పద్మ శొంఠి, డాక్టర్ సుధా కలవగుంట, శ్రీలత సూరి, కల్యాణి ఆవుల, హేమ చావలి, సమీర శ్రీపాదలను తానా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అలాగే ఈ సమావేశానికి ఇండియా నుంచి వెళ్లిన ప్రొఫెసర్ డాక్టర్ హిమబిందుకి జ్ఞాపిక బహూకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు సంస్థ టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి పాలేటి, తానా ప్రతినిధులు మురళి వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, సాంబ దొడ్డ, నాగరాజు నలజుల, వెంకట్ ములుకుట్ల, లెనిన్ తుళ్లూరి, రాజా నల్లూరి, ప్రవీణ్ కొడాలి, రాజేష్ పోలవరపు, విజయ్ వల్లూరు, వెంకట్ తొట్టెంపూడి, చంద్ర రెడ్డి పోలీస్, ప్రమోద్ నూతేటి, పవన్ గంగాధర, దీప్తి సూర్యదేవర, మధుమతి వైశ్యరాజు, శ్రీదేవి ఘట్టమనేని, అరవింద జోస్యుల తదితరులు పాల్గొన్నారు. -
భాగవత జయంతి ఉత్సవాలు
సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో 5వ అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు వర్చువల్ మోడ్‌లో జరిగాయి. ఫేస్బుక్ , యూట్యూబ్ వేదికలుగా సెప్టెంబరు 4న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగవత పద్యాలు, కీర్తనలు ఆలపించారు. వివిధ దేశాలకు చెందిన 75 మంది పిల్లల భాగవతంలో పలు ఘట్టాలకు సంబంధించి కళా ప్రదర్శనలు చేశారు. సింగపూర్, భారత్‌ల నుంచే కాకుండా అమెరికా, మలేషియా దేశాలకు చెందిన పిల్లలు పాల్గొన్నారు. ప్రముఖ నేపథ్య గాయకులు నేమాని పార్థసారథి, షర్మిల, కిడాంబి విక్రమాదిత్య, విద్య కాపవరపు, అపర్ణ ధార్వాడ వంటి ప్రముఖుల విద్యార్థుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చదవండి: వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు -
రికార్డు సృష్టించిన నాట్యాంజలి
సాక్షి,చెన్నై : చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో జరిగిన నాట్యాంజలి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారులు ఏటా నటరాజ స్వామి ముందు తమ నాట్యంతో అంజలి ఘటించటం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. నాట్యం అభ్యసించిన ప్రతి కళాకారుడు నటరాజ స్వామికి తమ నాట్యాన్ని అంకితం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా నటరాజ స్వామి ఆలయంలో నాట్యాంజలి పేరుతో నాట్యోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగానే 2017లో 4525 మంది నాట్య కళాకారులు ఒకే వేదికపై చేసిన నాట్యాంజలి రికార్డు సృష్టించింది. అయితే ఈ ఏడాది కూడా నాట్యంజలిలో గిన్నిస్ రికార్డు సృష్టించాలని నిర్ణయించారు. దీక్షితుల నిర్వహణలో కొనసాగుతున్న ఈ ఆలయంలో ఈ ఏడాది నాట్యాంజలిని రికార్డు చేసేందుకు గిన్నిస్ బుక్ వారిని ఆహ్వానించారు. దీంతో ప్రఖ్యాత నాట్య కళాకారిణి గురు పద్మభూషణ్ పద్మసుబ్రమణ్యం నేతృత్వంలో 19 వేల నాట్య కళాకారులతో నాట్యంజలి నిర్వహించారు. ఇందులో తమిళనాడు నలుమూలల నుంచి 7195 మంది నాట్య కళాకారులు ఒకే వేదికపై నటరాజస్వామికి తమ నాట్యంతో అంజలి ఘటించారు. తద్వారా గతంలో ఉన్న 4 వేల మంది నాట్యాంజలి రికార్డు తిరగరాశారు. గిన్నిస్ ప్రతినిధి రిషినాధ్ ఆలయ దీక్షితులకు రికార్డు పత్రాన్ని అందచేశారు. ఒకే వేదికపై 7 వేల మంది నాట్యకళాకారులు తమ అభినయంతో నటరాజ స్వామికి నాట్యాంజలి అందించటం చిదంబరం ఆలయంలో వేడుకను తలపించింది. -
సెయింట్ లూయిస్‌లో ఘనంగా మెగా నాటా డే వేడుకలు
సెయింట్ లూయిస్ : ఫిలడెల్ఫియాలో జులైలో జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి ముందు సెయింట్ లూయిస్‌లో మెగా నాటా డే వేడుకలను నిర్వహించారు. సెయింట్ లూయిస్‌లోని మహాత్మాగాంధీ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి 700 మందికిపైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో 160 మంది కళాకారులు ఆటా, పాటలతో అతిథులను అలరించారు. చెస్, మాథ్స్ పోటీల్లో120 మంది చిన్నారులు హుషారుగా పాల్గొన్నారు. ఈ కల్చరల్ ఈవెంట్లో పాల్గొన్న కళాకారులందరికి నిర్వాహుకలు ట్రోపీలను అందజేశారు. స్థానిక గాయకులు మాధురి గాజుల, సుమ ఆరెపల్లి, సాహితి ముంగండిలు కెనడా నుంచి వచ్చిన ధీరజ్ బాల్ర, న్యూజెర్సీ నుంచి వచ్చిన దీప్తి నాగ్‌లతో కలిసి తమ గాత్రంతో అభిమానులను హోరెత్తించారు. ఫిలడెల్ఫియాలో జులై 6 నుంచి 8 వరకు జరిగే నాటా మెగా కన్వెన్షన్‌కి వచ్చి విజయవంతం చేయాలని సెయింట్ లూయిస్ తెలుగు కమ్యునిటీవారిని నాటా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి కోరారు. మెగా నాటా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు తమ బృందంవారికి కృతజ్ఞతలు తెలిపారు. డీజే రవి జూలకంటి, ఈవెంట్ మేనేజ్మెంట్ స్టేజ్ డిజైనర్ కుమార్ రెడ్డి, ఎంసీ నిక్కి భూమా, హన్సితా తెలుగుంట్ల, నర్సిరెడ్డి ఉప్పునూరిలతో పాటూ వాలంటీర్లు ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగడానికి తమవంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో డల్లాస్‌కు చెందిన తిరుమల రెడ్డి కుంభం(ఫైనాన్సియల్ సర్వీస్ మానియా), అట్లాంటాకు చెందిన డా. ధనుంజయ రెడ్డి గడ్డం(షెపర్డ్ యానిమల్ హాస్పిటల్)లు ఉన్నారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నెల్లూరు(బారకాసు): జక్కా రంగారెడ్డి స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో జక్కా సౌదామిని సప్తమ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాత్రి పురమందిరంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత సౌదామిని చిత్రపటానికి నిర్వాహకులు, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ కళాకారిణి ఉమా కిరణ్ శిష్య బృందంలోని ఇనిషా గ్రూపు ప్రదర్శించిన బేటీ బచావో – బేటీ పఢావో నాటిక ఆలోచింపజేసింది. బాలార్కా శిష్య బృందం ఆలపించిన భక్తి గేయాలు ఓలలాడించాయి. గురుకృప నాట్యాలయ చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. జేఎస్ రెడ్డి, పొన్నాల రామసుబ్బారెడ్డి, సురభి గాయత్రి, తుంగా శివప్రసాద్‌రెడ్డి, మెట్టు రామచంద్రప్రసాద్, బీవీ నరసింహం, డాక్టర్ సర్వేపల్లి అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.