అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
Published Tue, Jul 19 2016 10:13 PM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
నెల్లూరు(బారకాసు): జక్కా రంగారెడ్డి స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో జక్కా సౌదామిని సప్తమ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాత్రి పురమందిరంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత సౌదామిని చిత్రపటానికి నిర్వాహకులు, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ కళాకారిణి ఉమా కిరణ్ శిష్య బృందంలోని ఇనిషా గ్రూపు ప్రదర్శించిన బేటీ బచావో – బేటీ పఢావో నాటిక ఆలోచింపజేసింది. బాలార్కా శిష్య బృందం ఆలపించిన భక్తి గేయాలు ఓలలాడించాయి. గురుకృప నాట్యాలయ చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. జేఎస్ రెడ్డి, పొన్నాల రామసుబ్బారెడ్డి, సురభి గాయత్రి, తుంగా శివప్రసాద్‌రెడ్డి, మెట్టు రామచంద్రప్రసాద్, బీవీ నరసింహం, డాక్టర్ సర్వేపల్లి అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement