dance competition
-
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
ఈ మధ్య అమెరికాలో అయినా, ఇండియాలో అయినా ఎన్నికల తర్వాత అత్యధికంగా తెలుగు వారు మాట్లాడుకునేది అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి 18వ ఆటా కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ గురించే. దీన్ని ఈ ఏడాది జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో అంగ రంగ వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా నిర్వాహకులు పలు నగరాల్లో నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు. సిరిసిరిమువ్వ సినిమాలోని ‘ఝుమ్మంది నాదం సయ్యంది పాదం’ పాట స్ఫూర్తితో ఈ పోటీలకు ‘సయ్యంది పాదం’ అని ఆటా వారు నామకరణం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ పోటీలలో గెలిచిన వారికి బహుమతులతో పాటు, తెలుగు గడ్డపై వివిధ వేదికలలో అవకాశాలు కల్పించడం ఆటా వారికే చెల్లింది. ఇలాంటి పోటీలతో పాటు గత 34 సంవత్సరాలుగా తెలుగు వారికి అన్ని విషయాలలో వెన్ను దున్నుగా ఉంటున్న ఆటా వారు శ్లాఘనీయులు. దాదాపు 15 నగరాలలో ఇప్పటికే 4500 మంది హాజరయ్యారు అంటే.. ఇంక కన్వెన్షన్‌కి ఎంత మంది వస్తారో ఊహించుకోవచ్చు. ప్రతి సిటీలో భోజనం, టీ, కాఫీ, మంచి నీళ్లు, స్నాక్స్, పండ్లు ఇవ్వడం జరిగింది. అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో అమెరికా నలుమూలలా వేలాదిమంది చరిత్రలో చూడని విధంగా ఈ కన్వెన్ని అట్టహాసంగా నిర్వహించాలని ప్రయాసపడుతున్నారు. అన్ని కార్యక్రమాల వివరములకు www.ataconference.org ని సందర్శించండి.ఇక, సయ్యంది పాదం విషయానికి వస్తే.. ‘కాలు కదుపుదాం, ప్రైజ్ గెలుద్దాం’ అన్న చందాన ఇప్పటికే ఈ నృత్య పోటీలు లాస్ ఏంజెల్స్, నాష్ విల్, రాలీ, అట్లాంటా, డల్లాస్, న్యూ జెర్సీ, ఆస్టిన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డిసి, షార్లెట్, చికాగోలలో జరగగా, ఇంకా పలు నగరాలలో జరగాల్సి వుంది. ప్రతి ఊరిలో దాదాపు 80 నుంచి 120 మంది కళాకారులు పాల్గొనడం గమనార్హం. ఎలా చూసినా, వెయ్యి మందికి పైగా పాల్గొన్న సయ్యంది పాదంలో 7 నుంచి 13 సంవత్సరాల వారు జూనియర్ల విభాగంలో, 14 ఆపై వారు సీనియర్ల విభాగంలో క్లాసికల్, నాన్ క్లాసికల్, సోలో, గ్రూప్ వంటి విభిన్న పోటీలలో ఎందరో పాల్గొని, తమ సత్తా చాటారు. యాంకర్లు ఉత్సాహంగా నడిపించగా, జడ్జీలకు డాన్సర్లు తమ నృత్య కౌశల్యంతో సవాలు విసిరారు. అన్ని విభాగాలలో మొదటి, రెండో స్థానంలో నిలిచిన వారికి ఆటా కన్వెన్షన్ ఫైనల్స్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వడమే కాకుండా, టిక్కెట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు ఇచ్చారు.సయ్యంటే సై అన్నట్టుగా సాగిన ఈ కార్యక్రమానికి ఛైర్ శృతి చిట్టూరి అంకిత భావంతో పని చేస్తూ, అందరికీ దిశానిర్దేశం చేశారు. అలానే, అడ్వైజర్ రాజు కాకర్ల, కో ఛైర్ వాణి గడ్డం, మెంబర్లు గౌరీ కారుమంచి, రజనీకాంత్ దాడి, చిట్టి అడబాల అఖండ కృషి అభినందనీయం. సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనం, కమ్మని భోజనం ప్రతి ఊరిలో ఏర్పాటు చేశారు. అట్లాంటా నుంచి సందీప్ రెడ్డి, నీలిమ గడ్డమణుగు, కిషన్ దేవునూరి, ఉదయ ఈటూరి, శ్రావణి రాచకుళ్ల, మాధవి దాస్యం, జయచంద్రా రెడ్డి, నిరంజన్ పొద్దుటూరి, గణేష్ కాసం, రాలీ నుంచి శృతి ఛామల, రాధా కంచర్ల, కీర్తి ఎర్రబెల్లి, అజిత చీకటి, పవిత్ర రత్నావత్, షాలిని కల్వకుంట్ల, శ్రీదేవి కటిక, రజని త్రిపురారి, నాష్ విల్ నుంచి రామకృష్ణా రెడ్డి అల, కిశోర్ గూడూరు, నరేంద్ర నూకల, సుశీల్ చండ, క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండ, లావణ్య నూకల, బిందు మాధవి చండ, షార్లెట్ నుంచి వెంకట రంగారెడ్డి సబ్బసాని, క్రాంతి ఏళ్ళ, సునీత నూకల ఇలా ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఎంతో కృషి చేశారు.ఈ కార్యక్రమాలు పలు నగరాలలో విజయ దుందుభి మ్రోగించడానికి సహకరించిన స్పాన్సర్లకు, జడ్జీలకు, ఆటా టీం, వాలంటీర్లు, ఆహుతులు, ఫోటో మరియు వీడియో గ్రాఫర్లకు, డీ జె, వెన్యూ. రెస్టారెంట్లకు, డెకొరేషన్ వారికి ఇలా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగనున్నాయి. అంతేగాక చాలామంది సెలెబ్రిటీస్ ఇండియా నుంచి రానున్నారు. తామెల్లరూ ఈ కన్వెన్షన్‌కి విచ్చేసి విజ్ఞాన, వివేక, వినోదాలలో భాగం కండి. ప్రతి వారం మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తుంటాము. అని ఆటా కన్వెన్షన్ నిర్వాహకులు చెబుతున్నారు. (చదవండి: అమెరికన్ల పేర్లు, ఇంటిపేర్ల కథ.. కమామీషు !) -
అట్లాంటలో ఆటా సయ్యంది పాదం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా (ఆటా) ఆధ్వర్యంలో సయ్యంది పాదం డాన్స్ కాంపిటీషన్‌తో పాటు అందాల పోటీలను అట్లాంటా నగరంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 25కి పైగా డాన్స్ గ్రూప్స్ పాల్గొన్నాయి. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సెగ్మెంట్స్ క్లాసికల్ మరియు నాన్-క్లాసికల్ విభాగాలలో టీన్స్, మిస్, మిస్సెస్ పోటీలలో చాలా మంది మహిళలు పాల్గొని సందడి చేశారు. ఈ పోటీలను బాలు వళ్లు, శ్వేతా పర్యవేక్షించారు. అందాల పోటీల నిర్వహణలో శ్రావణి రాచకుల్లా, మల్లికా దుంపల, శృతి చితూరీ మరియు ఉదయ ఏటూరి చురుకైన పాత్ర పోషించారు. ఈ పోటీలకు ముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీరామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటా అట్లాంటా టీంని సభకు పరిచయం చేసారు. ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి ఆటా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, ఆట మెంబెర్ బెనిఫిట్స్ సభకు వివరించారు. ఆటా పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా కాన్ఫరెన్స్ అడ్వైసర్ గౌతమ్ గోలి, ట్రస్టీస్ అనిల్ బొద్దిరెడ్డి, వేణు పిసికే మరియు ప్రశీల్ రెడ్డి. ఆటా నేషనల్ కమిటీ చైర్ వెంకట్ వీరనేని, నిరంజన్ పొద్దుటూరి , జయ చందా, తిరుమల పిట్టా, శ్రీనివాస్ ఉడతా మరియు ఉమేష్ ముత్యాల పాల్గొన్నారు. ఆటా 17 వ మహా సభలలో విరివిగా పాల్గోవాలిసిందిగా కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, అట పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి మరియు గౌతమ్ గోలి పిలుపునిచ్చారు. అత్య అద్భుతమైన ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన వారికి లీడర్షిప్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసింది. కార్యక్రమంలో పాల్గొన్న వారికి మొమెంటోస్ అందచేశారు. విజేతలు వాషింగ్టన్ డీసీ కార్యకరంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పాటుని అందించిన ప్రతి ఒక్కరికి ఆటాకాన్ఫరెన్స్ కో-కోర్డినేటర్ కిరణ్ పాశం ధన్యవాదాలు తెలియచేశారు. నిర్వాహకులు సయ్యంది పాదం చైర్ సుధా కొండెపు, అడ్వైసర్ రామకృష్ణ అలె, కో చైర్స్ భాను, రాంరాజ్, అందాల పోటీలు చైర్ నీహారిక నవల్గా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చదవండి: మన చాయ్ పానీ ముందు..పిజ్జా, బర్గర్లు జుజుబీ అనాల్సిందే! -
Nidhi Achha: ఈ టట్టింగ్ బహుత్ అచ్చా హై
సరదాగా చేసే కొన్ని పనులు గుర్తింపుతోపాటు మంచి పేరుని తెస్తాయి. నిధి అచ్చా కూడా ఇలానే సరదాగా చేసిన డ్యాన్స్ అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యేలా చేసింది. డ్యాన్స్‌ని కెరియర్‌గా ఎంచుకోవాలని అనుకోలేదు కానీ అంతర్జాతీయ డ్యాన్స్ పోటీలో విజేతగా నిలిచింది. ముంబైలోని కుర్లాకు చెందిన 23 ఏళ్ల డ్యాన్సర్ నిధి అచ్చా. ఐదేళ్ల వయసు నుంచి నిధికి డ్యాన్స్ అంటే ఇష్టం. దీంతో ఎక్కడ డ్యాన్స్ చూసినా వెంటనే ఆ స్టెప్పులు నేర్చుకునేది. ఇలా నేర్చుకున్న స్టెప్పులకు మరింత సాధన చేసి.. ఇటీవల అంతర్జాతీయ టట్టింగ్–2 కాంపిటీషన్లో విజేతగా నిలిచింది. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, దక్షిణాసియా దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా నుంచి పాల్గొన్న ఒకే ఒక డ్యాన్సర్ నిధి. అబ్బాయిలు ఎక్కువగా ఉండే.. టట్టింగ్ డ్యాన్స్ పోటీల్లో ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తుంటారు. నిధికి డ్యాన్స్ మీద ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వెన్ను తట్టి ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే డ్యాన్స్ తరగతులకు హాజరయ్యి మరింత సాధన చేసింది. మూడు వారాలపాటు కఠోర సాధనతో తన ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దుకుని తండ్రి సాయంతో ఆ డ్యాన్స్ వీడియోలను రికార్డు చేసుకునేది. ఈ సాధనతో అంతర్జాతీయ టట్టింగ్ విన్నర్‌గా నిలిచింది. నిధి టట్టింగ్తోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వీడియోలు పోస్టు చేస్తుంది. అంతేగాక ఎన్జీవోలో వలంటీర్‌గా పనిచేస్తూ.. వృద్ధాశ్రమం, అనాథాశ్రమాలకు వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడుతోంది. టట్టింగ్.. టట్టింగ్ అనేది వీధిలో చేసే ఒక రకమైన డ్యాన్స్. 1960–70లలో క్యాలిఫోర్నియాలో బాగా వాడుకలో ఉన్న డ్యాన్స్ ఇది. జామెట్రికల్ ఆకారంలో... 90 డిగ్రీల కోణంలో చేతులు, వేళ్లను కదిలించడం ఈ డ్యాన్స్‌లో ఉన్న ప్రత్యేకత. ఈజిప్ట్ కళలోని కొన్ని రకాల భంగిమలు టట్టింగ్ను పోలి ఉంటాయి. కేవలం చేతులతో చేసే ఈ డ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. (క్లిక్: ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారా?) -
ఒకపక్క సీరియళ్లు, సినిమాలు, మరోపక్క యాడ్స్..19 ఏళ్లలోనే అనుష్క రికార్డ్
చదువు, ఆటపాటల్లో చురుకుగా ఉండే ఈ అమ్మాయికి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో జరిగే వివిధ ఈవెంట్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనేది. ఒకసారి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొంది కానీ తొలిరౌండ్లో ఎలిమినేట్ అయ్యింది. ఆ తరువాత టీవీ సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో మంచి నటిగా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క సేన్. 19 ఏళ్ల అనుష్క వివిధ సీరియల్స్‌లో నటించి పాపులర్ అవడమేగాక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లక్షలమంది వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటోంది. చిన్న వయసులో సీరియల్స్, యాడ్స్‌లో నటిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎంతో మంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. జార్ఖండ్‌కు చెందిన అనిర్బన్, రాజ్‌రూప సేన్ దంపతుల ఒక్కగానొక్క సంతానం అనుష్కసేన్. 2002 ఆగస్టు 4న రాంచీలో పుట్టిన అనుష్క కొన్ని రోజులు అక్కడే ఉన్న తరువాత, కుటుంబం ముంబైకి మకాం మార్చడంతో ముంబైలోని ‘రయాన్ ఇంటర్నేషనల్ స్కూల్’లో చదివింది. చిన్నప్పటి నుంచి క్యూట్‌గా, యాక్టివ్‌గా ఉండే అనుష్కకు డ్యాన్స్ అంటే ఇష్టం. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ పోటీలో పాల్గొంది. కానీ కాళ్లకు సమస్య ఎదురవడంతో వెంటనే ఎలిమినేట్ అయ్యింది. డ్యాన్స్ కాంపిటీషన్ నుంచి వెనుతిరిగాక, అదే సమయంలో ‘యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీ’ అనే హిందీ టీవీ సీరియల్లో నటించే అవకాశం అనుష్కను బిజీ చేసేసింది. రాణి లక్ష్మిగా... సీరియల్స్‌లో నటిస్తూనే... రాకేష్ ఓమ్ ప్రకాష్ మెహ్రా కంపోజ్ చేసిన ‘హమ్కో హై ఆశా’ మ్యూజిక్ వీడియోలో(2012) నటించింది. మరుసటి ఏడాది బాల్ వీర్, దేవన్ కి దేవ్ మహదేవ్ సీరియల్లో చిన్నప్పటి పార్వతీ దేవిగా, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్, కామెడీ క్లాసెస్, ఇంటర్నెట్ వాలా లవ్ , అప్నా టైమ్ భీ ఆయేగా వంటి సీరియల్స్‌లో నటించింది. కలర్స్ టీవీలో ప్రసారమైన ఝాన్సీ కీ రాణి సీరియల్లో అనుష్క పోషించిన రాణి లక్ష్మి పాత్ర తనకి మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. అంతేగాక బాల్ వీర్లో మెహర్‌గా క్యారెక్టర్లో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక్కడినుంచి అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటనలో కాస్త నిలదొక్కుకున్నాక ‘షియామక్ దేవర్ డ్యాన్స్ అకాడమీ’లో చేరి డ్యాన్స్ నేర్చుకుంది. యాక్టింగ్ చేస్తున్నప్పటికీ, చదువును నిర్లక్ష్యం చేయలేదు. పదోతరగతి, ఇంటర్మీడియట్లలో ఎనభైఐదు శాతం పైగా మార్కులు సాధించింది. భవిష్యత్‌లో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేయాలని అనుష్క భావిస్తోంది. యాడ్స్‌లో.. సీరియల్ ద్వారా అనుష్కకు వచ్చిన పాపులారిటీతో ఆమెకు అనేక యాడ్లలో నటించే అవకాశాలు వచ్చాయి. వీటిలో అమూల్ చీజ్, హార్లిక్స్, హరిదర్శన్ దూప్ స్టిక్స్, డీఎన్ఏ, అబ్సల్యూట్ ఇండియా, ఏరియల్ డిటర్జెంట్, కొరియో ఎలక్ట్రానిక్స్, ఇమేజ్ బజార్, నయి దునియా వంటి అనేక యాడ్లలో నటించింది. ఎమ్ఎస్ ధోనీతో కలిసి కమర్షియల్ యాడ్‌లో కూడా నటించింది. ఇవేగాక అర్బన్ క్లాప్, కూవ్స్, మింత్రా వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా... అనుష్కకు కంగనా రనౌత్ అంటే బాగా ఇష్టం. దీంతో ఆమె నటించిన క్వీన్ సినిమాను అనేకసార్లు చూసింది. 2015లో ‘క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’ సినిమాలో నటించి బాలీవుడ్లో అడుగు పెట్టింది. లిహాఫ్: ద క్విల్ట్, షార్ట్ ఫిల్మ్ సమ్మదిత్తిలో నటించింది. చాలా మ్యూజిక్ వీడియోలలో అనుష్క నటించింది. వీటిలో ‘గల్ కర్కే’, ‘వియా’, ‘సూపర్ స్టార్’ వంటివి బాగా పాపులర్ అయ్యాయి. రామ్ కపూర్ నిర్మించిన బడే అచ్చే లగతే హై సీరియల్, డ్యాన్స్ టెలివిజన్ రియాలిటీ షో జలక్ ధికలాజా, కామెడీ సర్కస్‌లో పాల్గొంది. ఒకపక్క సీరియళ్లు, సినిమాలు, మరోపక్క యాడ్లు చేస్తూనే ఖాళీ సమయాల్లో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూట్యూబ్(2017) చానల్లో తనకు సంబంధించిన కంటెంట్, ఫన్నీ, కామెడీ, బ్యూటీ రెమిడీ వీడియోలను పోస్టు చేస్తూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆరు మిలియన్ల ఫాలోవర్స్‌తో పాపులర్ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. ఇండియాలో టిక్‌టాక్ నడిచినంతకాలం టిక్‌టాక్ సెలబ్రిటీగా, సింగర్, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క యూట్యూబ్ చానల్‌కు దాదాపు 24 లక్షలమంది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ‘ఖతరోంకే ఖిలాడీ– 11’లో పాల్గొని ఎలిమినేట్ అయ్యింది. ఈ షోలో పాల్గొన్న 19 ఏళ్ల పిన్న వయస్కురాలిగా అనుష్క సేన్ నిలవడం విశేషం. తల్లిదండ్రులతో అనుష్కసేన్ సోషల్ స్టార్ -
సిక్కోలు బిడ్డ ఖ్యాతి: అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణాలు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చెందిన ప్రఖ్యాత నాట్యగురు రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్యురాలు అన్నా నేహాథామస్ అంతర్జాతీయ నాట్య పోటీల్లో మూడు స్వర్ణపతకాలు గెలుచుకున్నారు. ఐసీఎండీఏ చెన్నై, గ్రేట్ ఇండియా ఫెస్టివల్ న్యూఢిల్లీ వారు ఇటీవల అంతర్జాతీయ నాట్య పోటీలను అంతర్జాలంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అన్నా నేహా థామస్ కూచిపూడి, భరతనాట్యం విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది. గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో కూచిపూడి, భరతనాట్యంలలో రెండు స్వర్ణాలు, ఐసీఎండీఏ చెన్నైవారు నిర్వహించిన భరతనాట్యం పోటీలో స్వర్ణ పతకం అందుకుంది. ఈ సందర్భంగా అన్నా నేహా థామస్‌కు పలువురు అభినందనలు తెలిపారు. -
కూచిపూడి నృత్యోత్సవానికి యానాం విద్యార్థిని
యానాం టౌన్ : ఇంటర్నేషనల్ డ్యాన్స్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఏపీ భవన్ న్యూఢిల్లీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫెస్టివల్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ కార్యక్రమంలో యానాం విద్యార్థిని కడియం హిమమహాలక్ష్మి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనుంది. ఈ ఫెస్టివల్‌ను న్యూఢిల్లీలోని ఏపీ భవన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో ఈ నెల 20 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హిమ మహాలక్ష్మి ఈ నెల 22న సాయంత్రం 6.30కు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనుంది. ఈ మేరకు హిమమహాలక్ష్మి ఎంపికైనట్టు ఇంటర్నేషనల్ డ్యాన్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ తాడేపల్లి నుంచి సమాచారం అందినట్టు విద్యార్థిని తండ్రి భాస్కర్ సోమవారం విలేకరులతో తెలిపారు. అలాగే హిమమహాలక్ష్మి ఫోటోతో ఉన్న ఆహ్వానపత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. హిమ మార్చినెలలో ఢిల్లీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆ««దl్వర్యంలో నిర్వహించిన ప్రపంచ సంస్కృతి సదస్సుకు ఎంపికై, కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి అందరి దృíష్టిని ఆకర్శించింది. యానాంలో విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న జవహర్ మినీ బాల భవన్లో ఆర్.శ్రీవాత్సవి వద్ద హిమమహాలక్ష్మి కూచిపూడి నృత్యంపై శిక్షణ పొందింది. హిమ మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నట్టు ఆమె తండ్రి తెలిపారు. -
సంప్రదాయ కళలను ప్రోత్సహిద్దాం
కర్నూలు (కల్చరల్): భారతీయ సంప్రదాయ కళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక బిర్లాగేట్ సమీపంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీ పౌండేషన్ వారు ప్రతి సంవత్సరం శాస్త్రీయ జానపద నృత్య పోటీలను నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఎస్వీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ఎస్వీ ఫౌండేషన్ రాష్ట్రస్థాయి నృత్య పోటీలను నిర్వహిస్తూ కళాకారులను ఉత్తమ కళాకారులుగా రాణించేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. ఆకట్టుకున్న శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు: ఎస్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాలులో జరిగిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలల్లో వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రధానంగా చిన్నారులు చేసిన స్వాగత నృత్యం, దుర్గామాత తదితర నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ కేంద్ర క్రమశిక్షణా సంఘం సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్వీ ఫౌండేషన్ కార్యాధ్యక్షులు రాయపాటి శ్రీనివాస్, కర్నూలు శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రన్, పోటీల న్యాయ నిర్ణేతలు విజయలక్ష్మి, నాగసాయి ప్రదీప్, ఎలమర్తి రమణయ్య, పల్లె గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నెల్లూరు(బారకాసు): జక్కా రంగారెడ్డి స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో జక్కా సౌదామిని సప్తమ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాత్రి పురమందిరంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత సౌదామిని చిత్రపటానికి నిర్వాహకులు, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ కళాకారిణి ఉమా కిరణ్ శిష్య బృందంలోని ఇనిషా గ్రూపు ప్రదర్శించిన బేటీ బచావో – బేటీ పఢావో నాటిక ఆలోచింపజేసింది. బాలార్కా శిష్య బృందం ఆలపించిన భక్తి గేయాలు ఓలలాడించాయి. గురుకృప నాట్యాలయ చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. జేఎస్ రెడ్డి, పొన్నాల రామసుబ్బారెడ్డి, సురభి గాయత్రి, తుంగా శివప్రసాద్‌రెడ్డి, మెట్టు రామచంద్రప్రసాద్, బీవీ నరసింహం, డాక్టర్ సర్వేపల్లి అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.