కూచిపూడి నృత్యోత్సవానికి యానాం విద్యార్థిని
Published Mon, Oct 17 2016 9:51 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
యానాం టౌన్ :
ఇంటర్నేషనల్ డ్యాన్స్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఏపీ భవన్ న్యూఢిల్లీ అండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫెస్టివల్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ కార్యక్రమంలో యానాం విద్యార్థిని కడియం హిమమహాలక్ష్మి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనుంది. ఈ ఫెస్టివల్‌ను న్యూఢిల్లీలోని ఏపీ భవన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో ఈ నెల 20 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో హిమ మహాలక్ష్మి ఈ నెల 22న సాయంత్రం 6.30కు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించనుంది. ఈ మేరకు హిమమహాలక్ష్మి ఎంపికైనట్టు ఇంటర్నేషనల్ డ్యాన్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ తాడేపల్లి నుంచి సమాచారం అందినట్టు విద్యార్థిని తండ్రి భాస్కర్ సోమవారం విలేకరులతో తెలిపారు. అలాగే హిమమహాలక్ష్మి ఫోటోతో ఉన్న ఆహ్వానపత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. హిమ మార్చినెలలో ఢిల్లీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆ««దl్వర్యంలో నిర్వహించిన ప్రపంచ సంస్కృతి సదస్సుకు ఎంపికై, కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి అందరి దృíష్టిని ఆకర్శించింది. యానాంలో విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న జవహర్ మినీ బాల భవన్‌లో ఆర్.శ్రీవాత్సవి వద్ద హిమమహాలక్ష్మి కూచిపూడి నృత్యంపై శిక్షణ పొందింది. హిమ మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నట్టు ఆమె తండ్రి తెలిపారు.
Advertisement