సాక్షి, కాకినాడ జిల్లా: గోదావరి నదిలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్ కొనసాగుతోంది. యానాం దరియాలతిప్ప వద్ద గౌతమీ నది(గోదావరి)లో ఓఎన్‌జీసీ పైపు లైన్ లీక్ కావడంతో గ్యాస్ నదిలో పొంగుతూ బుడగలుగా బయటకు వెళ్తుంది. లీకేజీని ఆపేందకు ఓఎన్‌జీసీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా లీకేజీ అదుపులోకి రావడం లేదు.
యానాం దరియాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నది ముఖ ద్వారానికి సమీపంలో గ్యాస్ లీకేజీ కావడంతో గోదావరి, సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో మత్స్య సంపద మనుగడ ప్రశ్నార్థకం కానుందని గ్యాస్ లీకేజీపై గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు.
గోదావరి జిల్లాల్లో గతంలోనూ ఇలాంటి గ్యాస్ లీక్ కారణంగా భారీ నష్టమే జరిగిందని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: డైవర్షన్ చంద్రబాబుకి దెబ్బపడింది అక్కడే!
Comments
Please login to add a commentAdd a comment