తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా (ఆటా) ఆధ్వర్యంలో సయ్యంది పాదం డాన్స్ కాంపిటీషన్‌తో పాటు అందాల పోటీలను అట్లాంటా నగరంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 25కి పైగా డాన్స్ గ్రూప్స్ పాల్గొన్నాయి. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సెగ్మెంట్స్ క్లాసికల్ మరియు నాన్-క్లాసికల్ విభాగాలలో టీన్స్, మిస్, మిస్సెస్ పోటీలలో చాలా మంది మహిళలు పాల్గొని సందడి చేశారు. ఈ పోటీలను బాలు వళ్లు, శ్వేతా పర్యవేక్షించారు. అందాల పోటీల నిర్వహణలో శ్రావణి రాచకుల్లా, మల్లికా దుంపల, శృతి చితూరీ మరియు ఉదయ ఏటూరి చురుకైన పాత్ర పోషించారు.
ఈ పోటీలకు ముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీరామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటా అట్లాంటా టీంని సభకు పరిచయం చేసారు. ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి ఆటా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, ఆట మెంబెర్ బెనిఫిట్స్ సభకు వివరించారు. ఆటా పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా కాన్ఫరెన్స్ అడ్వైసర్ గౌతమ్ గోలి, ట్రస్టీస్ అనిల్ బొద్దిరెడ్డి, వేణు పిసికే మరియు ప్రశీల్ రెడ్డి. ఆటా నేషనల్ కమిటీ చైర్ వెంకట్ వీరనేని, నిరంజన్ పొద్దుటూరి , జయ చందా, తిరుమల పిట్టా, శ్రీనివాస్ ఉడతా మరియు ఉమేష్ ముత్యాల పాల్గొన్నారు.
ఆటా 17 వ మహా సభలలో విరివిగా పాల్గోవాలిసిందిగా కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, అట పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి మరియు గౌతమ్ గోలి పిలుపునిచ్చారు. అత్య అద్భుతమైన ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన వారికి లీడర్షిప్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసింది. కార్యక్రమంలో పాల్గొన్న వారికి మొమెంటోస్ అందచేశారు. విజేతలు వాషింగ్టన్ డీసీ కార్యకరంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పాటుని అందించిన ప్రతి ఒక్కరికి ఆటాకాన్ఫరెన్స్ కో-కోర్డినేటర్ కిరణ్ పాశం ధన్యవాదాలు తెలియచేశారు. నిర్వాహకులు సయ్యంది పాదం చైర్ సుధా కొండెపు, అడ్వైసర్ రామకృష్ణ అలె, కో చైర్స్ భాను, రాంరాజ్, అందాల పోటీలు చైర్ నీహారిక నవల్గా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: మన చాయ్ పానీ ముందు..పిజ్జా, బర్గర్‌లు జుజుబీ అనాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment