
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహణలో “ తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు” సదస్సు విజయవంతం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వసమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు”అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకంగా జరిగింది.
తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారంఅని, వీటిని పరిరక్షించవలసిన బాధ్యత మనఅందరిదీ అంటూపాల్గొంటున్న అతిథులకు స్వాగతం పలికారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – సామెతలు, పొడుపుకథలలో పరిశోధనలుచేసిన, చేస్తున్నసాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు..
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ..“భాషాసౌందర్యం, అనుభవ సారం, నీతి, సూచన, హాస్యంకలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయని, వీటిని కోల్పోకుండా భావితరాలకు అందించడంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయ వలసిన కృషి ఎంతైనా ఉందన్నారు”
పొడుపుకథలలో పరిశోధనచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పీహెచ్‌డీ పట్టా అందుకుని, అదే విశ్వ విద్యాలయంలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై “తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానంఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కల్గించే పొడుపు కథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారం, నిగూఢభావం కల్గిన పొడుపుకథలు పల్లె పట్టుల్లో, మరీముఖ్యంగా జానపద గేయాలలో కూడా ఎక్కువగా ఉంటాయని అనేక ఉదాహరణలతో శ్రావ్యంగా గానంచేసి వినిపించారు.
ప్రత్యక అతిథిగా హాజరైన డా. ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కార గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదభందాలుమొదలైనసాహితీ ప్రక్రియలన్నీ మన తెలుగు సిరిసంపదలని, వాటి గొప్పదనాన్ని ఒక విహంగ వీక్షణంగా ప్రతిభా వంతంగా స్పృశించారు.
విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్వతెలుగు అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, ఆచార్య డా. సి.ఎచ్ సుశీలమ్మ (గుంటూరు)– ‘కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన’ ; నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు జి.ఎస్ చలం (విజయనగరం) ‘ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన’; మైసూరులోని తెలుగు అధ్యయన, పరిశోధనా విభాగంలో సహాయా చార్యులుగా పని చేస్తున్న ఆచార్య డా. బి నాగశేషు (సత్యసాయి జిల్లా) – ‘రాయలసీమ ప్రాంత సామెతలపైన’; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు - తులనాత్మక పరిశీలన” అనేఅంశంపై పి.ఎచ్.డి చేస్తున్నబుగడూరు మదనమోహన్ రెడ్డి (హిందూపురం) – ‘వ్యవసాయరంగ సామెతలపై’ ఎన్నో ఉదాహరణలతో చేసిన అసక్తికర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.