నాటా కొత్త కార్యవర్గం | North American Telugu Association Elects New Working Committee Members | Sakshi
Sakshi News home page

నాటా కొత్త కార్యవర్గం

Published Wed, Jan 26 2022 10:44 PM | Last Updated on Wed, Jan 26 2022 10:50 PM

North American Telugu Association Elects New Working Committee Members - Sakshi

అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్‌ అమెరికా తెలుగు అసొసియేషన్‌ నాటా తన మెగా కన్వెన్షన్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కీలకమైన నాటా కొత్త కార్యవర్గం లాస్‌ వేగాస్‌లో నామినేట్ అయినట్టు నాటా మీడియా అండ్‌ పీఆర్ డీవీ కోటిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో నాటా కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ గోసల రాఘవ రెడ్డి నుంచి శ్రీధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సమావేశంలో నాటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ ఎమిరేటర్స్‌ డా. ప్రేమ్‌రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్‌ ఆది శేషారెడ్డి, డా. మోహన్‌ మల్లం, డా.సంజీవ రెడ్డి, డా. ప్రసాద్‌ జీరెడ్డి, డా.చంద్రశేఖర్‌ నారాల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతీ రెండేళ్లకోసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాటా మెగా కన్వెన్షన్‌ కరోనా కారణంగా 2020లో జరగలేదు. ఈ సారి కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు.. పాండమిక్‌ కాస్తా ఎండమిక్‌గా మారిపోవడంతో మళ్లీ నాటా సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

జులై 2023లో డల్లాస్‌ వేదికగా మెగా కన్వెన్షన్‌ నిర్వహించనున్నట్టు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. ప్రవాసాంధ్రులను ఒక్కతాటిపైకి తేవడంతో పాటు వారికి సంబంధించిన అన్ని అంశాలు చర్చిస్తామని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంధ, సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. అమెరికాలో నివసించే తెలుగు ప్రజలందరికి నాటా ఎప్పుడు అండగా ఉంటుందని, తమ సంస్థ ద్వారా విస్తృతంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు కొర్సపాటి శ్రీధర్‌ రెడ్డి. న్యూజెర్సీలో నాటా కార్యాలయానికి త్వరలోనే శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు.

2022 - 2023కు గాను నామినేట్‌ అయిన నాటా కొత్త కార్యవర్గం
డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(అధ్యక్షులు)
 హరి వేల్కూర్(కాబోయే అధ్యక్షులు)
 ఆళ్ళ రామి రెడ్డి  (కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు)
 గండ్ర నారాయణ రెడ్డి(ప్రధాన కార్యదర్శి)
 సోమవరపు శ్రీనివాసులు రెడ్డి(కోశాధికారి)
 మందపాటి శరత్ రెడ్డి(సంయుక్త కోశాధికారి)
 సతీష్ నరాల(సంయుక్త కార్యదర్శి )
 డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(మాజీ అధ్యక్షులు)
 అంజిరెడ్డి సాగంరెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)
 శ్రీనివాసులు రెడ్డి కోట్లూరే (నేషనల్ కన్వెన్షన్ అడ్వైజర్)
 నగేష్ ముక్కమల్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు)
 దర్గా నాగిరెడ్డి (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు)
 లక్ష్మీ నరసింహారెడ్డి కొండా (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు)
 శ్రీధర్ రెడ్డి తిక్కవరపు (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు)
 సురేన్ బత్తినపట్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు)
 సురేష్ రెడ్డి కోతింటి (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు)

.
డల్లాస్‌ కన్వెన్షన్‌ కమిటీ:
► గిరీష్‌ రామిరెడ్డి, కన్వీనర్‌
► డా.రామిరెడ్డి బూచిపూడి, కోఆర్డినేటర్‌
► కృష్ణ కోడూరు, కో కన్వీనర్‌
► భాస్కర్ గండికోట, కో-ఆర్డినేటర్
► రమణారెడ్డి క్రిష్టపతి డిప్యూటీ కన్వీనర్
► మల్లిక్ అవుల, డిప్యూటీ కోఆర్డినేటర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement