
పోలీసుల అదుపులో సోహన్ పుంజ్రోలియా
న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన తండ్రిని కాల్చి చంపిన ఘటన అమెరికాలోని ఫిలదెల్పియాలో జరిగింది. ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్న సోహన్ పుంజ్రోలియా (31) తన తండ్రి మహేంద్ర పుంజ్రోలియా(60)ను ఈ నెల 3న సాయంత్రం సమయంలో తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
నిందితుడికి మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందని, సాయుధుడై ఉండవచ్చని పోలీసులు భావించారు. ఓ ఐస్ క్రీమ్ స్టాల్ వద్ద అతడి కారు ఆగి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే సోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పరారయ్యేలోపే పట్టుకోగలిగామని పోలీస్ చీఫ్ బ్రాన్‌విల్లే బార్డ్ తెలిపారు. నిందితుడు హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసినట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment