indian origin man
-
Us: అమెరికాలో మరో భారతీయుడి హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ విద్యార్థులు,భారత సంతతికి చెందిన వారిపై ఇటీవల తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లోని హోటల్ బయట రోడ్డుపై జరిగిన వాగ్వాదంలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. ఈ నెల 2న జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన వివేక్ తనేజా(41) అనే వ్యక్తి అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తున్న ‘డైనమో టెక్నాలజీస్’ కో ఫౌండర్. వర్జీనియాలో వివేక్ నివాసముంటున్నారు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా కొట్టుకునేదాకా రావడంతో దుండగుడు వివేక్ తలపై దాడి చేశాడు. వివేక్‌ను విచక్షణా రహితంగా నేలకేసి కొట్టాడు. తలకు తీవ్రంగా గాయమవ్వడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్ ప్రాణాలు కోల్పోయారు. DC Police just released this video of a person of interest in the case of a man assaulted outside Shoto Restaurant on 15th Street NW on Friday at 2am. 41-year-old Vivek Taneja of Alexandria was seriously injured. He passed away Wednesday. pic.twitter.com/DgwLyQms8y — Spencer Allan Brooks (@SpencerSays) February 9, 2024 ఇదీ చదవండి.. పాక్‌లో నవాజ్, బిలావల్ ప్రభుత్వం -
లండన్ లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి దారుణ హత్య
-
ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి భారత సంతతి వ్యక్తి
డబ్లిన్: భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఐర్లాండ్ ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రొటేషన్ పద్ధతిలో ఫిన్‌గేల్ పార్టీకి చెందిన వరాద్కర్‌కు మరోసారి అవకాశం దక్కింది. 2017లో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2020లో ఫిన్‌గేల్, మార్టిన్ ఫియన్నాఫెయిల్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రొటేషన్ పద్ధతిలో వరాద్కర్‌కు మరో అవకాశం లభించింది. మైఖెల్ మార్టిన్ స్థానంలో ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. రెండోసారి అవకాశం లభించిన క్రమంలో డబ్లిన్‌లోని ఐర్లాండ్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు లియో వరాద్కర్. ‘ మన పౌరులందరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలను అందించాలనే కాంక్షతో వినయంగా, సంకల్పంతో ఈ నియామకాన్ని అంగీకరిస్తున్నా. ఐర్లాండ్ ప్రధానిగా అవకాశం రావటం జీవతకాల పురస్కారం. గత 100 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి ఆధారంగా రానున్న తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగిస్తా. అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందేలా ప్రణాళికలు రచించి పక్కాగా అమలుపరుస్తాను. కరోనా వ్యాప్తి సమయంలో సహకారం అందించిన మైఖేల్ మార్టిన్‌కు కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నారు వరాద్కర్. ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న లియో ఐర్లాండ్‌లోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా గతంలోనే చరిత్ర సృష్టించారు. 38 ఏళ్లకే అత్యున్నత పదవిని చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగానూ నిలిచారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కళాశాలలో మెడికల్ డిగ్రీ అందుకున్న వరాద్కర్.. మొదట ప్రాక్టీస్ మొదలు పెట్టినా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2007 తొలిసారి గెలుపొందారు. 2015లో స్వలింగ వివాహాలను చట్టబధ్దం చేసింది. ఈ క్రమంలో తాను గే అని బహిరంగంగానే ప్రకటించారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం.. రష్యా మాస్టర్ ప్లాన్‌తో తీవ్ర ఇబ్బందులు -
వార్నీ.. అందుకని ఆమెను హత్య చేశాడట!
ఆమె హత్య కేసు ఒక సంచలనం. నాలుగేళ్లుగా నిందితుడి కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు అధికారులు. ఏ దేశంలో ఉన్నాడో తెలిసి కూడా.. ట్రేస్ చేయలేకపోయాడు. చివరికి... ఆచూకీ చెబితే భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు కూడా. ఎలాగైతేనేం భారత్‌లో అతన్ని మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు ప్రేరేపించిన కారణం తెలిసి.. మన పోలీసులు కంగు తిన్నారు. 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ.. అక్టోబర్ 21, 2018 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబం క్వీన్స్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్ చస్తే.. మరుసటి రోజు తోయా శరీరం అతిదారుణంగా.. బీచ్ ఇసుకలో పాతిపెట్టిన స్థితిలో పోలీసుల కంట పడింది. ఆమె పెంపుడు కుక్కను ఆ దగ్గర్లోనే ఉన్న ఓ చెట్టుకు కట్టేసి ఉంచారు. ఉన్మాదంతో కూడిన, దారుణమైన హత్య.. అని తోయా హత్య కేసుపై ఆస్ట్రేలియా పోలీసులు ప్రకటన చేశారు. ఆపై దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. రాజ్విందర్ సింగ్ అనే మేల్ నర్స్పై అనుమానపడ్డారు. అయితే ఘటన జరిగిన 48 గంటల్లోపే భార్యాపిల్లలతో పాటు ఉద్యోగాన్ని వదిలేసి దేశం విడిచి పారిపోయాడు రాజ్విందర్ సింగ్. దీంతో రాజ్విందర్పై అనుమానం బలపడింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేముందు అతని ఫొటోను కూడా పోలీసులు ఆచూకీ కోసం ఉపయోగించుకున్నారు. కానీ, ఇండియాలో అతని ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ కష్టతరంగా మారింది. దీంతో మోస్ట్ వాంటెడ్ రాజ్విందర్ సింగ్ ఆచూకీ కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. కిందటి ఏడాది మార్చిలో భారత విదేశాంగ శాఖ సాయం కోరింది క్వీన్స్లాండ్ పోలీస్ శాఖ. ఈ క్రమంలో.. తాజాగా రాజ్విందర్ గురించి సమాచారం అందించిన వాళ్లకు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 5.5 కోట్లు) బహుమతి ప్రకటించింది క్వీన్స్లాండ్ ప్రభుత్వం. అయితే తాజాగా రాజ్విందర్ను శుక్రవారం ఢిల్లీలోని జీటీ కర్నల్ రోడ్లో స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. క్వీన్స్లాండ్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. అతన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అప్పగించే విషయంలో త్వరలో కోర్టు విచారణ జరుగుతుందని వెల్లడించారు. అయితే హత్యకు దారి తీసిన పరిణామం గురించి రాజ్విందర్ చెప్పిన విషయంతో ఢిల్లీ పోలీసులు కంగుతిన్నారు. భారత సంతతికి చెందిన రాజ్విందర్ సింగ్.. ఆస్ట్రేలియాలో నర్సుగా పని చేసేవాడు. 2018 అక్టోబర్ 21వ తేదీన తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ కోపంలో కత్తి, కొన్ని పండ్లు తీసుకుని రిలాక్స్ అయ్యేందుకు బీచ్‌కు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో.. తోయా కార్డింగ్లీ తన పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చింది. ఆ కుక్క రాజ్విందర్ను చూసి పదేపదే మొరిగిందట. అసలే భార్యతో గొడవ పడిన చిరాకులో ఉన్న అతను.. ఈ విషయంలో ఆమెతో వాగ్వాదానికి దిగారు. అది చిలికి చిలికి హత్యకు దారి తీసిందని నేరం ఒప్పుకున్నాడు రాజ్విందర్. తొలుత ఆమెను కత్తితో కసి తీరా పొడిచాడు. ఆపై రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను లాక్కెళ్లి.. ఇసుక దిబ్బల్లో పాతేశాడు. ఆ కుక్కను వెంటాడి పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఆపై రక్తపు మరకలు ఉన్న కత్తిని నీళ్లలోకి విసిరేశాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఆ రోజంతా ఆందోళనగానే ఉన్నాడు. ఆ మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా లగేజ్ సర్దుకుని భారత్‌కు పయనం అయ్యాడు. హత్య చేసి పారిపోయి వచ్చాక.. ఎవరితో సంబంధం లేకుండా ఉన్నాడు రాజ్విందర్ సింగ్. అటు భార్యతోగానీ ఇటు తల్లిదండ్రులతో కానీ ఎలాంటి సంభాషణలు జరపలేదు. కానీ, పంజాబ్-ఢిల్లీ మధ్యే మార్చిమార్చి తిరుగుతూ వచ్చాడు. అధికారులు గుర్తు పట్టకుండా గెటప్ మార్చేస్తూ పోయాడు. ఇక ఇప్పుడు హత్యకు అతను కారణం చెప్పడంతో ఇక్కడి పోలీసుల వంతు పూర్తైంది. అతన్ని ప్రశ్నించడం పూర్తి కావడంతో.. కోర్టులో ప్రవేశపెడతాం అని ఓ ఢిల్లీ పోలీస్ అధికారి తెలిపాడు. రాజ్విందర్ సింగ్ మీద ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. మరోవైపు అప్పగింత చట్టం(extradition act) కింద నవంబర్ 21వ తేదీన పాటియాలా హౌజ్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. దీంతో ఢిల్లీ పోలీసుల గాలింపు ముమ్మరం అయ్యింది. అందిన కొద్దిపాటి సమాచారంతో అతనున్న గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి గాలింపు చేపట్టారు. చివరకు.. గడ్డం, తలపాగాతో ఉన్న రాజ్విందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చూసేయండి -
యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి!
చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష పడక మానదు. ఈ మాటే చాలా సార్లు వినే ఉంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది భారతి సంతతికి చెందిన ఉద్యోగికి. అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేశాడు. దొరికినంత దోచుకున్నాడు, అయితే పాపం పండి చివరికి దోషిగా నలుగురిలో నిలబడ్డాడు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన 52 ఏళ్ల ధీరేంద్ర ప్రసాద్.. కాలిఫోర్నియాలోని యాపిల్ సంస్థలో 2008-18 వరకు పనిచేశాడు. కంపెనీలో దొంగ ఇన్ వాయిస్ లు సృష్టించడం, ఎలక్ట్రానిక్ భాగాలు దొంగిలించడం, కంపోనీలో లేని సర్వీసులకు కూడా డబ్బులు వసూలు చేయడం లాంటివి చేశాడు. ఈ మోసం 2011 నుంచి ప్రారంభమై 2018 వరకు కొనసాగించాడు. అలా కంపెనీలో 17 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం) పైగా దోచుకున్నాడు. ఎట్టికేలకు ఈ విషయం బయటకు రావడంతో ప్రసాద్ కటకటాలపాలయ్యాడు. కోర్టులో దీనిపై విచారణ జరపగా.. ఇందులో రాబర్ట్ గ్యారీ హాన్సెన్, డాన్ ఎమ్ బేకర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపాడు. చివరికి కంపెనీని $17 మిలియన్లకు పైగా మోసం చేసినట్లు కోర్టులో అంగీకరించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి వాయిదా 2023 మార్చి 14న ఉండనుంది. అంతవరకు ప్రసాద్ పోలీసు కస్టడీలో ఉంచనున్నారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ సహాయంతో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రాసిక్యూషన్ జరిగింది. -
UK political crisis: బ్రిటన్‌లో రిషీరాజ్..
లండన్: నూటా యాభయ్యేళ్లకు పైగా మనల్ని పాలించిన బ్రిటన్ను ఇక మనవాడు పాలించనున్నాడు. దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) సరికొత్త చరిత్ర లిఖించారు. సోమవారం పలు ఆసక్తికర పరిణామాల నడుమ అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న నేతగా రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి శ్వేతేతరుడు కూడా రిషియే కావడం మరో విశేషం! అంతేగాక గత 210 ఏళ్లలో అతి పిన్న వయస్కుడైన బ్రిటన్ పీఎంగా కూడా రిషి మరో రికార్డు నెలకొల్పారు. ప్రధాన పోటీదారుగా భావించిన మాజీ ప్రధాని బోరిస్ సోమవారం అనూహ్యంగా తప్పుకోవడంతో ఆయనకు ఒక్కసారిగా లైన్ క్లియరైంది. మూడో అభ్యర్థి పెన్నీ మోర్డంట్ గడువు లోపు 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమవడంతో రిషి ఎన్నిక ఏకగ్రీవమైంది. అలా, నెలన్నర క్రితం లిజ్ ట్రస్‌తో హోరాహోరీగా జరిగిన పోటీలో అందినట్టే అంది తృటిలో చేజారిన ప్రధాని పదవి ఈసారి రిషిని వచ్చి వరించింది. తాను హిందువునని ప్రతి వేదికపైనా సగర్వంగా ప్రకటించుకునే రిషి సరిగ్గా దీపావళి పర్వదినం నాడే ప్రధానిగా ఎన్నికవడం భారతీయుల హర్షోత్సాహాలను రెట్టింపు చేసింది. మంగళవారం టోరీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించాక ఆయన రాజు చార్లెస్–3ని కలిశారు. అనంతరం దేశ 57వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అస్తవ్యస్తంగా మారిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే గురుతర బాధ్యత ఇప్పుడు రిషి భుజస్కంధాలపై ఉంది. ఈ విషయంలో విఫలమవడం వల్లే ట్రస్ కేవలం 45 రోజులకే రాజీనామా చేయాల్సి రావడం, బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం పీఎంగా కొనసాగిన చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన అపారమైన ఆర్థిక అనుభవాన్ని రంగరించి దేశాన్ని రిషి ఎలా ఒడ్డున పడేస్తారన్నది ఆసక్తికరం. ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి చేసిన తొలి అధికారిక ప్రసంగంలోనూ రిషి ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బ్రిటన్ అత్యంత కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అంగీకరించారు. ‘‘ఈ సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు ఏ మాత్రం వెనకాడబోను. నాపై ఉన్న ఆకాంక్షలను పూర్తిగా నెరవేరుస్తా’’అంటూ ప్రతిజ్ఞ చేశారు. దేశాన్ని బంగారు భవిష్యత్తులోకి నడిపిస్తానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో దేశవాసులకు హామీ ఇచ్చారు. రెండు నెలల్లో మూడో ప్రధాని! బోరిస్ జాన్సన్, ట్రస్ తర్వాత గత ఏడు వారాల్లో బ్రిటన్‌కు రిషి మూడో ప్రధాని కావడం విశేషం. పార్టీ గేట్ కుంభకోణం తదితరాల దెబ్బకు మంత్రులు సొంత పార్టీ ఎంపీల డిమాండ్‌కు తలొగ్గి జాన్సన్ రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్‌లో జరిగిన హోరాహోరీ పోరులో రిషిపై నెగ్గి ట్రస్ ప్రధాని అయ్యారు. కానీ పన్ను కోతలు, అనాలోచిత మినీ బడ్జెట్‌తో ఆర్థిక పరిస్థితిని పెనం నుంచి పొయ్యిలో పడేశారంటూ ఇంటా బయటా తీవ్ర విమర్శల పాలయ్యారు. తప్పుకోవాలంటూ సొంత ఎంపీలే డిమాండ్ చేయడం, అవసరమైతే అవిశ్వాసం పెట్టేందుకూ సిద్ధమవడంతో మరో మార్గం లేక ఆమె గురువారం రాజీనామా ప్రకటించారు. మంగళవారం ఆపద్ధర్మ ప్రధాని హోదాలో ట్రస్ చివరి కేబినెట్ సమావేశానికి సారథ్యం వహించారు. అనంతరం బకింగ్‌హం ప్యాలెస్‌కు వెళ్లి చార్లెస్–3కి లాంఛనంగా రాజీనామా సమర్పించారు. తర్వాత రిషి రాజసౌధానికి వెళ్లి రాజుతో లాంఛనంగా భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న రాజు ఆహ్వానాన్ని అంగీకరిస్తూ రాచరిక సంప్రదాయాన్ని అనుసరించి ఆయన ముంజేతిని ముద్దాడారు. కల్లోల సమయంలో కఠిన బాధ్యతలను చేపడుతున్న రిషి తన బాధ్యతలను సమర్థంగా నెరవేర్చాలంటూ ప్రార్థించాల్సిందిగా బ్రిటన్ పౌరులకు కాంటర్బరీ ఆర్చిబిషప్ జస్టిన్ వెల్బీ పిలుపునిచ్చారు. ‘‘ఇది మన దేశానికి అత్యంత కష్టకాలం. ఈ అస్థిర పరిస్థితుల్లో బాధ్యతలు చేపడుఉతన్న రిషి కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’’అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని గ్టటెక్కించగలిగే సత్తా ఉన్న నేత రిషి మాత్రమేనని టోరీ ఎంపీల్లో అత్యధికులు నమ్ముతున్నారు. వారిలో సగం మందికి పైగా ఆయనకు బాహాటంగా మద్దతు ప్రకటించడం అందుకు నిదర్శనంగా నిలిచింది. అభినందనల వెల్లువ... రిషికి నా హార్దిక శుభాభినందనలు. బ్రిటన్‌తో భారత్ చారిత్రక సంబంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మార్చుకుంటున్న వేళ ఇది నిజంగా గొప్ప పరిణామం. ప్రపంచ సమస్యల పరిష్కారానికి రిషితో కలిసి పని చేసేందుకు, 2030–రోడ్‌మ్యాప్‌ను అమలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నా – ప్రధాని నరేంద్ర మోదీ రిషి సాధించింది అపురూప విజయం. ఇదో చరిత్రాత్మక మైలు రాయి. ప్రపంచ భద్రత, ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, యూరప్, మిగతా ప్రపంచంపై దాని ప్రభావాలను రిషితో కలిసి ఉమ్మడిగా ఎదుర్కొంటాం – ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రిషికి హార్దిక అభినందనలు. ఆయన హయాంలో బ్రిటన్–ఉక్రెయిన్ బంధం మరింత బలపడాలి – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం – ఐర్లండ్ ప్రధాని మైఖేల్ మార్టిన్ రిషి హయాంలో బ్రిటన్–ఈయూ సంబంధాలు ఇరుపక్షాల ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూ సాగుతాయని ఆశిస్తున్నాం – యూరోపియన్ కమిషన్ ప్రసిడెంట్ ఉర్సులా వాండెర్ లియాన్ ఇదో చరిత్రాత్మక రోజు. రిషికి అభినందనలు. టోరీ ఎంపీలంతా కొత్త ప్రధానికి పూర్తి మద్దతివ్వాల్సిన వేళ ఇది – బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధానిగా పని చేయడం నాకు దక్కిన అతి గొప్ప గౌరవం. రిషికి నా అభినందనలు. అన్ని అంశాల్లో నూ ఆయనకు నా పూర్తి మద్దతుంటుంది – బ్రిటన్ తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ రిషికి శుభాకాంక్షలు – కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రిషికి అభినందనలు. కానీ దేశంలో తక్షణం ఎన్నికలు జరపాల్సిన అవసరముంది – బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ రిషి వచ్చినా బ్రిటన్‌తో సమీప భవిష్యత్తులోనూ రష్యా సంబంధాలు మెరుగు పడతాయన్న ఆశలేమీ లేవు – రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ రిషి హయాంలో బ్రిటన్‌తో చైనా సంబంధాలు ముందుకు వెళ్తాయని ఆశిస్తున్నాం – చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ రిషిని చూసి ఎంతో గర్విస్తున్నాం. ప్రధానిగా అద్భుతంగా పాలించాలని కోరుకుంటున్నాం. – రిషి మామ, ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి -
UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా?
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారతీయ సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) ముందున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, తద్వారా ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు నామినేషన్ కోసం అవసరమైన 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఆయనకు ఇప్పటికే సమకూరిందని వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కరేబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటిన లండన్ తిరిగొచ్చారు. ఆయనకు కూడా 100 మంది ఎంపీల మద్దతు సమకూరిందని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. రిషి, జాన్సన్ ఇప్పటిదాకా తాము రేసులో ఉన్నట్టు వెల్లడించలేదు. ఎంపీల మద్దతుపై కూడా ఏమీ మాట్లాడలేదు. పెన్నీ మోర్డంట్ మాత్రమే పోటీలో ఉన్నట్టు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నానికల్లా 100 మంది ఎంపీల మద్దతు సాధించిన వారి మధ్య తదుపరి పోటీ ఉంటుంది. రిషికి పెరుగుతున్న మద్దతు రిషిని సమర్థిస్తున్న మంత్రులు, పార్టీ ఎంపీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు దేశ పౌరులకు విశ్వాసం కల్పించగల నేత ప్రస్తుతం రిషి మాత్రమేనని మాజీ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ అభిప్రాయపడ్డారు. మళ్లీ వెనకటి రోజులకు వెళ్లేమని బోరిస్నుద్దేశించి అన్నారు. అయితే మళ్లీ ప్రధాని కావాలని తహతహలాడుతున్న బోరిస్ పోటీ లేకుండా నెగ్గేలా వ్యూహాలు పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా రిషిని తప్పుకోవాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. -
భారత సంతతి విద్యార్థి హత్య.. రూమ్మేట్పైనే అనుమానం!
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతడితో పాటు రూమ్‌లో ఉంటున్న సహచరుడైన కొరియా విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పర్డ్యూ యూనివర్సిటీలో డేటాసైన్స్ విభాగంలో చదువుతున్న 20ఏళ్ల వరుణ్ మనీష్ చడ్డా అనే విద్యార్థి తీవ్ర గాయలతో రక్తపు మడుగులో పడి ఉండటం కలకలం రేపింది. అతడు వర్సిటీలోని మెక్‌కట్చెన్ హాల్లో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధంతో పొడవటంతో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి బాధితుడి రూమ్మేట్, దక్షిణ కొరియాకు చెందిన జి మిన్ షా (జిమ్మిషా)ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతడు సైబర్ సెక్యూరిటీ మేజర్, ఇంటర్నేషనల్ స్టూడెంట్. చడ్డా మృతి గురించి షానే అర్ధరాత్రి 12.45 సమయంలో 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం గమనార్హం. కాల్ వచ్చిన వెంటనే తొలుత జిమ్మిషాను అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ఈ హత్యపై విశ్వవిద్యాలయ అధ్యక్షుడు మిచ్ డేనియల్స్ విచారం వ్యక్తం చేశారు. చడ్డా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. విద్యార్థులు మొత్తం ఒక చోట సమావేశమై చడ్డాకు నివాళి అర్పించారు. చడ్డా హత్య జరిగిన రాత్రి విషయాలను స్నేహితులు గుర్తు చేసుకున్నారు. మరో 10 రోజుల్లో చాడ్డా 21వ జన్మదినం ఉందని అతడి స్నేహితులు తెలిపారు. ఆన్లైన్ కాల్లో అతడు అరుస్తున్నట్లు తమకు వినబడిందని చెప్పారు. ‘‘మంగళవారం రాత్రి చడ్డా ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ, మిత్రులతో మాట్లాడుతున్నాడు. అంతలో హఠాత్తుగా కాల్లో అతడి కేకలు వినిపించాయి. అయితే.. అక్కడేమి జరిగిందో తెలియలేదు. మర్నాడు నిద్రలేచే సరికి చడ్డా మరణవార్త తెలిసింది’’ అని స్నేహితడు అర్నబ్ సిన్హా పేర్కొన్నాడు. ఇదీ చదవండి: చైల్డ్ కేర్ సెంటర్‌పై తూటాల వర్షం.. 34 మంది మృతి -
రిషి మంచి ప్రధాని అవుతారు
లండన్: భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్‌కు మంచి ప్రధాని కాగలరని కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లలో 48 శాతం అభిప్రాయపడుతున్నట్టు జేఎల్ పార్టనర్స్ సంస్థ సర్వేలో తేలింది. రిషి అత్యధికుల్ని ఆకర్షిస్తున్నారని జేఎల్ పార్టనర్స్ సహ వ్యవస్థాపకుడు జేమ్స్ జాన్సన్ చెప్పారు. 39% మంది విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు మద్దతిచ్చారు. రిషికి గట్టి పోటీగా భావిస్తున్న వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ 33 శాతంతో మూడో స్థానంలో ఉండటం విశేషం! బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఆయన వారసుని కోసం కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక ప్రక్రియకు తెర లేవడం తెలిసిందే. ఇప్పటిదాకా రెండు రౌండ్లలో అత్యధిక ఎంపీల మద్దతుతో రిషి రేసులో దూసుకుపోతున్నారు. -
సీఐఏ తొలి సీటీఓగా మూల్‌చందానీ
వాషింగ్టన్: అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తొలి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా భారత సంతతికి చెందిన నంద్ మూల్‌చందానీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఐఏ డైరెక్టర్ విలియమ్ జె.బర్న్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఢిల్లీ స్కూల్లో చదువుకున్న చందానీ సమర్థుడైన ఐటీ నిపుణుడు. సిలికాన్ వ్యాలీలో 25 ఏళ్లపాటు పనిచేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లోనూ సేవలందించారు. ఆయన పరిజ్ఞానం, సేవలు తమకు బాగా ఉపయోగపడతాయని బర్న్ అన్నారు. సీఐఏలో స్థానం దక్కడం గర్వకారణంగా భావిస్తున్నానని మూల్‌చందానీ అన్నారు. -
కనికరించలేదు.. నాగేంద్రన్‌కు ఉరిశిక్ష అమలు
సింగపూర్ సిటీ: పదేళ్లుగా మరణ శిక్ష నుంచి తప్పించాలంటూ చేసుకున్న అభ్యర్థనలు, పిటిషన్లు వ్యర్థం అయ్యాయి. డగ్ర్స్ కేసులో పట్టుబడ్డ భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ ధర్మలింగంను ఎట్టకేలకు సింగపూర్‌లో ఉరి తీశారు. ఇవాళ(బుధవారం) ఉదయం ఉరిశిక్షను అమలు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. పదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ధర్మలింగంను.. మానసిక వికలాంగుడనే కారణంతో విడిచిపెట్టాలంటూ విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరి కోరిక తీర్చి.. నాగేంద్రన్న్ ఉరిని అతని కుటుంబ సభ్యులు సైతం ధృవీకరించారు. ఉరికి ముందు నాగేంద్రన్ చివరి కోరికను అధికారులు తీర్చినట్లు తెలుస్తోంది. చివరిసారిగా తన కుటుంబ సభ్యులను ఒకసారి కలుసుకోవాలని ఉందని చెప్పడంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన తర్వాత అతడికి మరణశిక్షను అమలు చేశారు. కేసు వివరాలు.. మలేసియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై దోషిగా తేలిన నాగేంద్రన్‌కు 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో గతేడాది నవంబరు 10న నాగేంద్రన్‌కు మరణశిక్షను అమలు చేసేందుకు అక్కడి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే.. విమర్శలు..నిరసనలు మానసిక వికలాంగుడైన(హైపర్ యాక్టివిటీ డిజార్డర్) నాగేంద్రన్‌కు మరణశిక్ష అమలు విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సింగపూర్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. యూరోపియన్ యూనియన్ సహా బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అతడి తల్లి తరపున న్యాయవాదులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నాగేంద్రన్ పిటిషన్‌ను గత బుధవారం కొట్టేసింది. ఇది కోర్టు ప్రక్రియలను దుర్వినియోగం చేయడానికి, నాగేంద్రన్‌కు విధించిన చట్టబద్ధమైన శిక్ష అమలులో అన్యాయంగా ఆలస్యం చేయడానికి తాజా ప్రయత్నం అంటూ సింగపూర్ అటార్నీ జనరల్ చాంబర్స్ అభిప్రాయపడింది. దీంతో న్యాయమూర్తులు ఆండ్రూ ఫాంగ్, జుడిత్ ప్రకాష్, బెలిండా ఆంగ్ చివరి నిమిషంలో అతడి దరఖాస్తును తోసిపుచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ‘‘కోర్టు చివరి మాట అంటే చివరి మాటే..’’ అని అన్నారు. అలాగే బుధవారం(ఏప్రిల్ 27) ఉదయం ఉరిశిక్షను అమలు చేయాల్సిందిగా న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. మలేషియాలోని ఇపో పట్టణంలో నాగేంద్రన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతని సోదరుడు నవీన్ కుమార్ మీడియాతో చెప్పాడు. చదవండి: హద్దు మీరితే.. ఏడాదికి 560 విపత్తులు, 2030 దాకా! -
ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!!
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్‌లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన అనుభవం దృష్ట్యా.. కరోనా టెస్టులు, ఐసోలేషన్‌లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ వీడియోలో వ్యాఖ్యానించాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్బుక్ ద్వారా వైరల్ అవుతోంది. మనోజ్ లాద్వా యూకేలో సెటిల్ అయిన వ్యక్తి. తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్ ‘హీథ్రో ఎయిర్పోర్ట్’ నుంచి విమానంలో వచ్చాడు. విమానం ఎక్కే ముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 30న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లయిట్లో ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరారు. అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్ సెంటర్‌కు షిఫ్ట్ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఈ అనుభవంపై ఫేస్బుక్ లైవ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అంతా మాయగా ఉంది. విమానంలో గట్టిగా పదిహేను మంది కంటే ఎక్కువమంది లేం. దిగగానే.. అదీ గంటల వ్యవధిలో పాజిటివ్ ఎలా నిర్ధారణ అవుతుంది? లండన్ ఎయిర్‌పోర్టులు రిపోర్టులు చూపించినా నమ్మకపోతే ఎలా? ఇండిపెండెంట్ పరీక్షలకు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడాయన. నాతో పాటు మరికొందరు ప్రయాణికులు గట్టిగా సిబ్బందిని నిలదీశాం.ఇక్కడి మార్గదర్శకాలు ఇష్టం లేకపోతే.. బయట డబ్బులు కట్టి అయినా క్వారంటైన్ సెంటర్లో ఉండాలంటూ బీఎంసీ అధికారులు(Brihanmumbai Municipal Corporation) బెదిరిస్తున్నారు’’ అంటూ మనోజ్ లాద్వా ఆరోపించారు. ఇదిలా ఉంటే లాద్వా వీడియో తీసిన టైంలో.. వెనకాల మరికొంతమంది ప్రయాణికులు సెంటర్ నిర్వాహకులతో గొడవ పడుతున్నట్లు వాయిస్ వినిపించింది. అయితే ఎయిపోర్ట్ సిబ్బంది మాత్రం తాము అంతా పక్కాగా రూల్స్ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు. చదవండి: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం?? ఎక్కడంటే.. -
ఆన్లైన్ వేదికగా వినతులు.. భారత సంతతి వ్యక్తికి ఆగిన ఉరిశిక్ష
సింగపూర్: సింగపూర్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలను తెస్తున్నాడనే అభియోగాలతో ఉరిశిక్ష పడిన భారతీయ మూలాలున్న మలేసియన్ నాగేంద్రన్ కె.ధర్మలింగం ఉరిశిక్ష అమలు ఎట్టకేలకు ఆగింది. మానసిక దివ్యాంగుడైన 33 ఏళ్ల నాగేంద్రన్‌కు విధించిన కఠినశిక్షను తగ్గించాలంటూ ఆన్లైన్ వేదికగా వేలాది మంది మానవహక్కుల కార్యకర్తలు, సంఘాల నుంచి వినతులు వెల్లువెత్తడంతో సింగపూర్ తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేసింది. దాంతో అక్కడి జైలులో నవంబర్ పదో తేదీన అమలుచేయాల్సిన ఉరిశిక్ష అమలు తాత్కాలికంగా ఆగింది. శిక్ష తగ్గింపు, రద్దుకు సంబంధించిన ఒక పిటిషన్‌ను మంగళవారం ఆన్లైన్లో విచారించాల్సి ఉన్నందున శిక్ష అమలును ప్రస్తుతం ఆపాలని సింగపూర్ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నాటి పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తే 10వ తేదీనే ఉరిశిక్ష అమలుచేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. -
కాబూల్‌లో భారతీయుని అపహరణ !
న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారతీయుని అపహరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాబూల్‌లో భారతీయ పౌరుడు బాన్‌శ్రీ లాల్ అరిందేను తుపాకీతో బెదిరించి కొందరు కిడ్నాప్ చేశారని వార్తలు వెలువడ్డాయి. అపహరణ విషయంపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ‘కాబూల్‌లోని స్థానిక అధికారులతో మంతనాలు జరుపుతున్నాం. భారతీయ పౌరుడి కిడ్నాప్ వ్యవహారంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ఢిల్లీలో గురువారం మీడియాతో చెప్పారు. లాల్ కుటుంబం హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణంలో నివాసముంటోంది. కాబూల్‌లో లాల్ గత రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నారు. -
‘నీ ఇంటిని 1 మీటరు జరుపు లేదంటే రూ.1.6కోట్లు కట్టు’
ఆక్లాండ్: మనిషి జీవితంలో ఉండే అతి ముఖ్యమై కల సొంత ఇంటి నిర్మాణం. చనిపోయేలోపు తమకంటూ ఓ ఇంటిని నిర్మించుకోవాలని ఆశపడతారు చాలా మంది. ఇక న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కూడా ఇదే విధంగా అనుకుని సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. అయితే అతడి కల నెరవేరుతుందని సంతోషించేలోపల ఓ వింత సమస్య అతడి ముందుకు వచ్చింది. దాంతో అతడు తలపట్టుకున్నాడు. ఇంతకు ఆ సమస్య ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. ఆక్లాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన దీపక్ లాల్ గతతేడాది పాపాకూర్లో సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. మూడు పడక గదులతో అత్యంత సౌకర్యవంతంగా నిర్మాణం చేయబోతున్న ఆ ఇంటిని చూసుకుని తెగ మురిసిపోతున్నాడు దీపక్ లాల్. సీ94 డెవలప్మెంట్ అనే కంపెనీ వేసిన దావాతో అతడి ఆనందం ఆవిరవ్వమడమే కాకా షాక్‌తో చలిజ్వరం పట్టుకున్నట్లు అయ్యింది. దావా ఏంటంటే.. సీ94 డెవలప్మెంట్ ఫిర్యాదు ఏంటంటే మిస్టర్ లాల్ తన ఇంటిని చట్టబద్ధంగా తనకు సంక్రమించిన స్థలంలో కాకుండా ఒక మీటర్ వేరే వారి స్థలంలో నిర్మిస్తున్నాడు. దాంతో సదరు సంస్థ దీపక్ లాల్ మీద దావా వేసింది. అతడు ఇంటిని తనకు చట్టబద్ధంగా సంక్రమించిన స్థలంలోకి జరపాలి.. లేదంటే 3,15,000డాలర్ల(సుమారు 1.6 కోట్ల రూపాయలు) జరిమానా చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు. దాంతో దీపక్ లాల్ ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఈ సందర్భంగా దీపక్ లాల్ మాట్లాడుతూ.. ‘‘ఈ సమస్య నా పాలిట ఓ పీడకలల తయారయ్యింది. దీని గురించి ఆలోచిస్తూ రాత్రుళ్లు నిద్రపోవడం మానేశాను. చివరకు ఇది ఎలా పరిష్కారం అవుతుందో అంతుపట్టడం లేదు’’ అని వాపోయాడు. ఇంటిని నిర్మించడానికి అంగీకరించిన డిజైనర్, హెచ్‌క్యూ డిజైన్స్ ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను దాఖలు చేశారని.. వాటిని ఆక్లాండ్ కౌన్సిల్ ఆమోదించింది అని తెలిపాడే లాల్. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత వారిదే అన్నాడు. ఇక ఈ సమస్యకు సంబంధించి ఒకరినొకరు నిందించకుంటున్నారు తప్ప సమస్యను పరిష్కరించే మార్గం చూడటం లేదు అన్నాడు దీపక్ లాల్. ‘‘ఇంటిని జరపడానికి నేను సిద్ధం. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఇప్పటికే ఈ కొత్త ఇంటి మీద తనఖా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి అద్దె కోసం వారానికి 1000 డాలర్లు చెల్లిస్తున్నాను. ఈ సమస్య పరిష్కారం కాకపోతే దీన్ని అమ్మలేను.. రోజులు గడుస్తున్న కొద్ది ఇది మరింత జటిలం అవుతుందని’’ వాపోయాడు లాల్. చదవండి: పరిచయం లేని ప్రపంచంలో ఆఫీసర్ స్థాయికి.. -
నదిలో గణిత మేధావి మృతదేహం
న్యూయార్క్: భారత మూలాలున్న గణిత మేధావి షువ్రో బిశ్వాస్ (31) అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన మృతదేహాన్ని హడ్సన్ నదిలో కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. హింస జరిగినట్లు తమకే ఆధారాలు లభించలేదని తెలిపారు. క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పని చేస్తున్న బిశ్వాస్ మానసిక సమస్యలతో బాధప డుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. వైద్యులకు చూపించేందుకు తాము ప్రయత్నించామని, అయితే బిశ్వాస్ ప్రవర్తనతో అది కష్టసాధ్యమైందని ఆయన సోదరుడు బిప్రోజిత్ తెలిపారు. బిశ్వాస్ చాలా మంచి వాడని, తెలివైనవాడని తెలిపారు. బిశ్వాస్ నివసిస్తున్న భవనంలోని పలువురు దీనిపై స్పందించారు. లిఫ్టులో కత్తితో గాయపరచుకొని రక్తం చిందించడం, అక్రమంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, భవనంలో బుల్లెట్లను పడేయడం వంటివి చేశాడని పోలీసులకు తెలిపారు. ఇక్కడ చదవండి: విషాదం నింపిన అమెరికా పర్యటన.. కొడుకు ముందే తండ్రి మృత్యువాత రక్తపు మడుగులో భార్యాభర్తలు.. బాల్కనీలో ఏడుస్తూ చిన్నారి -
బైడెన్ టీంలోకి మరో ఇండో అమెరికన్
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన టీంలో భారత సంతతి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే కమలా హారిస్, నీరా టాండన్ వంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్ తాజాగా భారత సంతతికి చెందిన వేదాంత్ పటేల్‌ని అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా నియమించారు. పటేల్ ప్రస్తుతం బైడెన్ ఇనాగ్యురల్ కమిటీ సీనియర్ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వైట్‌హౌస్ వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం పటేల్ బైడెన్ అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించారు. అంతేకాక రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇవేకాక బైడెన్ ప్రాధమిక ప్రచారంలో నెవడా, వెస్ట్రన్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక గతంలో, పటేల్ డెమోక్రటిక్ నేషనల్ కమిటీలో వెస్ట్రన్ రీజినల్ ప్రెస్ సెక్రటరీ, ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ మహిళ ప్రమీలా జయపాల్‌కు, కాంగ్రెస్ సభ్యుడు మైక్ హోండాకు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. (చదవండి: నిరాడంబరంగా బైడెన్ ప్రమాణం) ఇక నివేదిక ప్రకారం, పటేల్ భారతదేశంలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగారు. కాలిఫోర్నియా-రివర్సైడ్ విశ్వవిద్యాలయం, ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం పటేల్ తన కుటుంబంతో కలిసి వాషింగ్టన్ డీసీలో నివాసం ఉంటున్నారు. ఇక బైడెన్ శుక్రవాంర వైట్ హౌస్ కమ్యూనికేషన్, ప్రెస్ స్టాఫ్‌కు సంబంధించి 16 మంది పేర్లు ప్రకటించగా.. వారిలో వేదాంత్ పటేల్ కూడా ఉన్నారు. ఇక వైట్‌హౌస్ ప్రెస్ కమ్యునికేషన్ వింగ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వారిలో వేదాంత్ పటేల్ మూడవ వ్యక్తి. గతంలో ప్రియా సింగ్, రాజ్ షా వైట్ హౌస్ ప్రెస్ వింగ్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. -
నాసా: రాజా చారి అరుదైన ఘనత..!
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కల్నల్ రాజా చారి అరుదైన ఘనత సాధించారు. చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపాలనుకుంటున్న నాసా మూన్ మిషన్ ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు అతను ఎంపికయ్యారు. అమెరికా వైమానిక దళంలో రాజా జాన్ వురుపుత్తూర్ చారి కల్నల్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈ మిషన్ కోసం నాసా మొత్తం 18 మందిని ఎంపిక చేయగా.. వీరిలో 9మంది మహిళలే ఉండటం గమనార్హం. బుధవారం నాసా మూన్ మిషన్‌కు ఎంపికైన పద్దేనిమిది మంది పేర్లు వెల్లడించింది. 2024లో చంద్రుడి మీదకి మనుషులను పంపాలని నాసా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాజా చారికి రెండు వేల గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉందని నాసా ఏరోనాటిక్స్ తన ట్విట్టర్లో వెల్లడించింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాజా చారి శిక్షణ పొందారు. యూఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లో శిక్షణ పొందిన ఏకైక భారత సంతతి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ క్లాసుల కోసం నాసా అతన్ని 2017లో ఎంపిక చేసింది. తొలుత అవసరమైన ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ శిక్షణ కాలాన్ని అతను పూర్తి చేశాడని, ఇప్పుడు రాజాచారి మూన్ మిషన్‌కు అర్హత సాధించినట్లు నాసా వెల్లడించింది. ‘ఆర్టెమిస్ ప్రాజెక్ట్’కు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో ప్రకటించారు. ఈ సందర్భంగా కెన్నడీ ‘నా తోటి అమెరికన్లారా, మనల్ని చంద్రుడి మీదకు.. అంతకు మించి తీసుకువెళ్ళే భవిష్యత్ హీరోలను నేను మీకు పరిచయం చేస్తున్నాను’ అన్నారు. (చదవండి: జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం) ‘ఆర్టెమిస్’ బృందంలోని వ్యోమగాములు విభిన్న నేపథ్యాలు, నైపుణ్యం, అనుభవం నుంచి వచ్చారు. ఈ బృందంలోని చాలా మంది వ్యోమగాములు 30-40 ఏళ్ల లోపు ఉన్నవారే కావడం విశేషం. వీరిలో అతి పెద్ద వ్యక్తి వయసు 55 ఏళ్లు ఉండగా.. పిన్న వయసు వ్యక్తికి 32 ఏళ్లు ఉన్నాయి. -
కోవిడ్ వ్యాక్సిన్: హరి శుక్లా రికార్డు
లండన్: భారత సంతతి వ్యక్తి హరి శుక్లా అరుదైన ఘనత సాధించనున్నారు. ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొదటి వ్యక్తుల జాబితాలో చేరారు. ఈ రోజు ఆయన యూకేలోని ఓ ఆస్పత్రిలో ఫైజర్-బయో ఎన్ టెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ని తీసుకోబోతున్నారు. ఫైజర్-బయో ఎన్ టెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటీష్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలుత 80 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్స్‌కి, హోం కేర్ వర్కర్స్‌కి వ్యాక్సిన్ వేస్తారు. ఈ సందర్బంగా హరి శుక్లా మాట్లాడుతూ.. ‘ఇప్పటికైనా మహమ్మారి కట్టడికి ఓ ఆయుధం రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రపంచంలో కోవిడ్ వ్యాక్సిన్ పొందిన మొదటి వ్యక్తుల జాబితాలో చేరడం ఉద్వేగానికి గురి చేస్తోంది. నాకు కాల్ చేసి వ్యాక్సిన్ తీసుకునే వారి జాబితాలో నా పేరు ఉందని చెప్పినప్పటి నుంచి ఎంతో సంతోషిస్తున్నాను. ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. కోవిడ్ సంక్షోభం ముగింపుకు వ్యాక్సిన్ అభివృద్ధి అయ్యింది అనే విషయం తలుచుకుంటే ఎంతో ఊరటగా ఉంది’ అన్నారు హరి శుక్లా. (చదవండి: జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!) ఇక బ్రిటన్‌లో అత్యవసర వినియోగంలో భాగంగా మొదటి వారంలో 8 లక్షల డోసుల వ్యాక్సిన్లని అందుబాటులోని తీసుకురానున్నారు. కోవిడ్ వల్ల ఎక్కువ ప్రమాదంలో ఉన్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి, 80ఏళ్లు పైబడిన వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జన్సాన్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌పై పొరాటంలో యూకే నేడు అతి పెద్ద ముందడుగు వేయబోతుంది. దేశంలో మొదటి సారిగా కోవిడ్ వ్యాక్సిన్‌ని వేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు, ట్రయల్స్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జనాలను చూసి నేను గర్వ పడుతున్నాను’ అన్నారు. -
కోల్డ్ బ్లడెడ్ మర్డర్ : ఆచూకీ చెబితే ఎఫ్‌బీఐ రివార్డు
వాషింగ్టన్: అమెరికాలో ఒక భారతీయ వ్యక్తిని కిడ్నాప్ చేసిన హత్య చేసిన కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం అందించిన వారికి భారీ రివార్డును ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రకటించింది. ఈ కేసును ఎఫ్‌బీఐ సెంట్రల్ వర్జీనియా హింసాత్మక నేరాల టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నేరస్థుడి ఆచూకీని కనుక్కునేందుకు తాజా ప్రకటన చేసింది. ఈ హత్యకు సంబంధించిన ఏదైన సమాచారం ఇచ్చిన వారికి 15,000 డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. పరేష్‌కుమార్ పటేల్ (ఫైల్ ఫోటో) ఎఫ్‌బీఐ సమాచారం ప్రకారం సెప్టెంబర్16, 2012 న అమెరికాలో ఉంటున్న భారత జాతీయుడు పరేష్‌కుమార్ పటేల్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. వర్జీనియాలోని చెస్టర్ ఫీల్డ్ లో పనిచేస్తున్న పటేల్‌ను ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం ఎత్తుకెళ్లారు. నాలుగు రోజుల తరువాత తుపాకీ గుళ్ల గాయాలతో ఉన్న అతని మృతదేహాన్నివర్జీనియా రిచ్మండ్ నగరంలోని అంకారో బోట్ ల్యాండింగ్ వద్ద పోలీసులు గుర్తించారు. అప్పటినుంచి ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో చాలెంజింగ్ గా తీసుకున్న దర్యాప్తు సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. #FBIRichmond's Central VA Violent Crimes Task Force offers up to $15K #reward for info leading to arrest/conviction of person(s) responsible for the 2012 murder of Mr. Pareshkumar Patel. https://t.co/2rk9WgTRwq or 804-261-1044.https://t.co/qtJjIzl9hj @RichmondPolice @CCPDVa — FBI Richmond (@FBIRichmond) September 15, 2020 -
ముగ్గురు చిన్నారులను కాపాడి.. ప్రాణాలు వదిలాడు
వాషింగ్టన్: అమెరికాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న ముగ్గురూ పిల్లలను కాపాడే క్రమంలో భారత సంతతికి చెందిన 29 ఏళ్ల వ్యక్తి తన ప్రాణాలను కొల్పోయాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడగా మరో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాలిఫోర్నియా అధికారులు తెలిపారు. స్థానిక మీడియా ప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన ఇద్దరు ఎనిమిదేళ్ల బాలికలు, ఓ పదేళ్ల బాలుడు కలిసి నదిలో సరదాగా ఈతకు వెళ్లారు. (చదవండి: విషాదం: తండ్రి మరణంతో కూతుళ్లు కూడా..) వారు ఆడుకుంటుండగా ఒక్కసారిగా నది ప్రవాహం పెరగడంతో వారు నీటిలో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఒడ్డు మీద నిలుచున్న మజీద్ సింగ్ వారిని చూసి కాపాడేందుకు నదిలో దూకాడు. వారిని కాపాడే క్రమంలో మజీద్ నీటిలో మునిగిపోయాడు. ఈ సంఘటన జరిగిన దాదాపు 40 నిమిషాల అనంతరం మజీద్ మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నుంచి బయటపడిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరూ సురక్షితం ఉన్నారని, మరో ఎనిమిదేళ్ల చిన్నారి పరిస్థితి విషయంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి) -
భారతీయ దంపతుల హత్య; పాక్ వ్యక్తి అరెస్ట్
దుబాయ్: భారతీయ దంపతులను దుబాయ్‌లో హత్య చేసిన పాకిస్తాన్ వ్యక్తిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 24 గంటలు గడవక ముందే కేసును చేధించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని ‘గల్ప్ న్యూస్’ వెల్లడించింది. భారత్‌కు చెందిన హిరెన్ అధియా, భార్య విధి అధియా అరేబియన్ రాంచెస్‌లోని తమ విల్లాలో ఈ నెల 18న దారుణ హత్యకు గురయ్యారు. వారి ఇంట్లోకి చొరబడిన దుండగుడు డబ్బు, నగలు దోచుకునే క్రమంలో అడ్డువచ్చిన హిరెన్, విధి దంపతులను కత్తితో పొడిచి చంపాడు. హిరెన్‌ను కుమార్తెను కూడా గాయపరిచాడు. (దుబాయ్‌లో భారతీయ దంపతుల హత్య) పోలీసు అధికారి బ్రిగేడియర్ జమల్ ఆల్ జలఫ్ మాట్లాడుతూ.. హత్య గురించి మృతుల కుమార్తె సమాచారం ఇచ్చిందని తెలిపారు. దుండగుడి దాడిలో ఆమెకు కూడా గాయాలయ్యాయని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని వెల్లడించారు. నిందితుడు సంవత్సరం నుంచి విల్లా మెంటినెన్స్ బాధ్యతలు చూసుకుంటున్నాడని తెలిపారు. హంతకుడు వాడిన కత్తి కిలోమీటరు దూరంలో దొరికిందని, అతడు నేరం ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. (దుబాయ్‌కి విమాన సర్వీసులు పునరుద్ధరించండి) -
గూగుల్ కీలక పదవిలో మరో భారత సంతతి వ్యక్తి
న్యూయార్క్ : సెర్చి ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి కీలక పదవిలో నియమితులయ్యారు. గూగుల్ సెర్చ్ హెడ్‌గా భారత సంతతికి చెందిన ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. బెన్ గోమ్ స్ధానంలో ఈ పదవిని చేపట్టే రాఘవన్ నూతన బాధ్యతల్లో నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్‌కు రిపోర్ట్ చేస్తారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన ప్రభాకర్ బెర్క్లీ యూనివర్సిటీ నుంచి ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పొందారు. 2012లో గూగుల్‌లో చేరిన రాఘవన్ 2018లో గూగుల్ అడ్వర్టైజింగ్, కామర్స్ బిజినెస్ హెడ్‌గా ఎదిగారు. సెర్చి డిస్ప్లే పర్యవేక్షణ, వీడియా అడ్వర్టైజింగ్ అనలిటిక్స్, షాపింగ్, పేమెంట్స్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. రాఘవన్ అంతకుముందు గూగుల్ క్లౌడ్ సేవలు, గూగుల్ యాప్స్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇక ఐబీఎం, యాహూల్లోనూ ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ నెలకు 100 కోట్ల యాక్టివ్ యూజర్ల మైలురాయిని అధిగమించడంలో రాఘవన్ పాత్ర కీలకం. జీ సూట్లో స్మార్ట్ రిప్లై, స్మార్ట్ కంపోజ్, డ్రైవ్ క్విక్ యాక్సెస్ వంటి ఫీచర్లను ఆయన ప్రవేశపెట్టారు. కొత్త బాధ్యతల్లో రాఘవన్ ప్రభాకర్ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని.. అలాఘరిథంలు, ర్యాంకింగ్‌ల విషయంలో రెండు దశాబ్ధాలకు పైగా అనుభవం ఆయన సొంతమని, గూగుల్ కంటే ముందే గూగుల్ సెర్చ్‌తో రాఘవన్‌కు అనుబంధం ఉందని గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యుడిగా ఈ రంగంలో గొప్ప ఇంజనీరింగ్ మేథస్సుల్లో ఆయన ఒకరని ప్రస్తుతించారు. చదవండి : ‘నాన్న ఏడాది జీతం అందుకే ఖర్చయింది’ -
మనీలాండరింగ్: ఇద్దరు ఎన్నారైలకు శిక్ష
లండన్: 2.4 మిలియన్ పౌండ్ల(భారత కరెన్సీలో రూ. 22,38,67,680.00) భారీ హవాలా నేరానికి పాల్పడినందుకు గాను శుక్రవారం యూకే కోర్టు భారత సంతతి వ్యక్తులు ఇద్దరికి కలిపి 12 సంవత్సరాల 9 నెలల జైలు శిక్ష విధించింది. స్కాట్లాండ్ యార్డ్ ఎకనామిక్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు ఆధారంగా కోర్టు విజయ కుమార్ కృష్ణసామి (32), చంద్రశేఖర్ నలయన్ (44)కు శిక్ష విధించింది. నేరపూరిత ఆస్తులను దాచడం, బదిలీ చేయడం వంటి నేరాల కింద కోర్టు విజయ కుమార్ కృష్ణసామికి ఐదేళ్ళ తొమ్మిది నెలలు, చంద్రశేఖర్ నలయన్‌కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వీరిద్దరు ఇప్పటికే 2.4 మిలియన్ పౌండ్ల మనీలాండరింగ్‌కు పాల్పడటమే కాక మరో 1.6 మిలియన్ పౌండ్ల(భారత కరెన్సీలో రూ.14,92,45,120.00) మనీలాండరింగ్ ప్రయత్నంలో ఉన్నారని ఎకనామిక్ క్రైమ్ యూనిట్ పోలీసులు తెలిపారు. ఈ సందర్బంగా డిటెక్టివ్ కానిస్టేబుల్ మిలేనా బింగ్లీ, మాట్లాడుతూ.. ‘ఇది సంక్లిష్టమైన కేసు. బ్యాంకింగ్ రంగంలోని మా భాగస్వాములు, సైబర్ డిఫెన్స్ అలయన్స్(సీడీఏ) వారి సహకారంతో వీరిని పట్టుకోగలిగాము. అయితే ఇది 2018 నాటి కేసు. దక్షిణ లండన్‌లోని క్రోయిడాన్ క్రౌన్ కోర్టు బార్క్లేస్ బ్యాంక్ అధికారులు మొదటి సారి వీరి మీద ఫిర్యాదు చేశారు’ అని బింగ్లీ తెలిపారు. వేరువేరు ఐపీ అడ్రస్‌ల ద్వారా తమ బ్యాంక్‌లోని పలు బిజినెస్ అకౌంట్లను నిందితులిద్దరు యాక్సెస్ చేసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారని బింగ్లీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎకనామిక్ క్రైమ్ యూనిట్.. సీడీఏతో కలిసి ‘ఆపరేషన్ పాల్కాల్లా’ను ప్రారంభించింది అన్నారు. ఈ క్రమంలో అనుమానిత ఐపీ అడ్రెస్‌లను ట్రేస్ చేసి దర్యాప్తు ప్రారంభించి.. చివరకు నిందితులను పట్టుకున్నామని బింగ్లీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 24 కంపెనీలు వీరి చేతిలో మోసపోయాయి అన్నారు. నిందితులిద్దరు ఈ హవాలా సొమ్మును యూకే దాటించారని.. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేము అన్నారు బింగ్లీ.. -
స్టే హోమ్ అంటే వినలేదు... దాంతో..
సింగపూర్: కరోనా నియంత్రణ చర్యలు పాటించని భారతీయ పౌరుడికి సింగపూర్‌లోని ఓ కోర్టు ఆరు వారాల జైలు శిక్ష విధించింది. ‘స్టే హోమ్’ నోటీసులు ఉల్లంఘించి ఇతరులను ప్రాణాలకు రిస్కులో పెట్టినందుకు ఈ శిక్ష వేసింది. సింగపూర్‌లో సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఖురేష్ సింగ్ సంధూ మార్చి నెలలో ఇండోనేషియా వెళ్లి వచ్చాడు. దాంతో, మార్చి 17 నుంచి 31 వరకు ఇంటి వద్దే ఉండాలని స్థానిక యంత్రాంగం అతనికి నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులు బేఖాతరు చేసిన సంధూ యథావిధిగా విధులకు హాజరయ్యాడు. సహోద్యోగులతో మునుపటి మాదిరే రూమ్ షేర్ చేసుకున్నాడు. అలా మూడు రోజులపాటు డ్యూటీ చేశాడు. ఈక్రమంలో మార్చి 21న సంధూ పనిచేసే సెక్యురిటీ కంపెనీ సూపర్వైజర్కు అతనికి స్టే హోమ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. దాంతో ఇంటికి వెళ్లిపోయవాలని అతను సంధూకు హుకుం జారీ చేశాడు. అదేక్రమంలో ఇమిగ్రేషన్, చెక్‌పాయింట్ అధికారులు సంధూ నోటీసులు ఉల్లంఘించి, బయట తిరుగుతున్నాడని గ్రహించారు. అదే విషయాన్ని కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు అతనికి శిక్ష విధించింది. కాగా, సింగపూర్‌లో ఇప్పటివరకు 32, 876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో చాలామంది విదేశీయులే కావడం గమనార్హం.