వాషింగ్టన్: అమెరికాలో భారతీయ విద్యార్థులు,భారత సంతతికి చెందిన వారిపై ఇటీవల తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లోని హోటల్ బయట రోడ్డుపై జరిగిన వాగ్వాదంలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. ఈ నెల 2న జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారత సంతతికి చెందిన వివేక్ తనేజా(41) అనే వ్యక్తి అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తున్న ‘డైనమో టెక్నాలజీస్’ కో ఫౌండర్. వర్జీనియాలో వివేక్ నివాసముంటున్నారు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం జరిగింది.
ఇది కాస్తా కొట్టుకునేదాకా రావడంతో దుండగుడు వివేక్ తలపై దాడి చేశాడు. వివేక్‌ను విచక్షణా రహితంగా నేలకేసి కొట్టాడు. తలకు తీవ్రంగా గాయమవ్వడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్ ప్రాణాలు కోల్పోయారు.
DC Police just released this video of a person of interest in the case of a man assaulted outside Shoto Restaurant on 15th Street NW on Friday at 2am.
— Spencer Allan Brooks (@SpencerSays) February 9, 2024
41-year-old Vivek Taneja of Alexandria was seriously injured. He passed away Wednesday. pic.twitter.com/DgwLyQms8y
Comments
Please login to add a commentAdd a comment