దుబాయ్: భారతీయ దంపతులను దుబాయ్‌లో హత్య చేసిన పాకిస్తాన్ వ్యక్తిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 24 గంటలు గడవక ముందే కేసును చేధించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని ‘గల్ప్ న్యూస్’ వెల్లడించింది. భారత్‌కు చెందిన హిరెన్ అధియా, భార్య విధి అధియా అరేబియన్ రాంచెస్‌లోని తమ విల్లాలో ఈ నెల 18న దారుణ హత్యకు గురయ్యారు. వారి ఇంట్లోకి చొరబడిన దుండగుడు డబ్బు, నగలు దోచుకునే క్రమంలో అడ్డువచ్చిన హిరెన్, విధి దంపతులను కత్తితో పొడిచి చంపాడు. హిరెన్‌ను కుమార్తెను కూడా గాయపరిచాడు. (దుబాయ్‌లో భారతీయ దంపతుల హత్య)
పోలీసు అధికారి బ్రిగేడియర్ జమల్ ఆల్ జలఫ్ మాట్లాడుతూ.. హత్య గురించి మృతుల కుమార్తె సమాచారం ఇచ్చిందని తెలిపారు. దుండగుడి దాడిలో ఆమెకు కూడా గాయాలయ్యాయని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని వెల్లడించారు. నిందితుడు సంవత్సరం నుంచి విల్లా మెంటినెన్స్ బాధ్యతలు చూసుకుంటున్నాడని తెలిపారు. హంతకుడు వాడిన కత్తి కిలోమీటరు దూరంలో దొరికిందని, అతడు నేరం ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. (దుబాయ్‌కి విమాన సర్వీసులు పునరుద్ధరించండి)
భారతీయ దంపతులను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్
Published Wed, Jun 24 2020 6:31 PM | Last Updated on Wed, Jun 24 2020 7:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment