
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయనతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులకు పాల్పడిన దుండగుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇమ్రాన్‌ను హత్య చేసేందుకే తాను వచ్చానని, ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఇలా చేశానని పేర్కొన్నాడు.
‘ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు మాత్రమే వచ్చా.’ అని కెమెరా ముందు చెప్పాడు దుండగుడు. గుజ్రాన్‌వాలాకు బైక్‌పై వచ్చానని, తన బంధవు ఇంట్లో బండిని పార్క్ చేసి ర్యాలీకి వచ్చినట్లు వెల్లడించాడు. మరోవైపు.. ఇమ్రాన్ ర్యాలీలో ఇద్దరు షూటర్లు పాల్గొన్నట్లు సమాచారం. ఒకరు పిస్టల్‌తో రాగా.. మరొకరు ఆటోమెటిక్ రైఫిల్‌తో ఉన్నారని పలు మీడియాలు వెల్లడించాయి.
మరోవైపు.. కాల్పుల్లో కాలికి తీవ్రంగా గాయమైన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని నిలువరించిన పార్టీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. ఆయనను హత్య చేసేందుకు జరిగిన దాడిగా పార్టీ సీనియర్ నేత రవూఫ్ హసన్ ఆరోపంచారు.
ఇదీ చదవండి: Imran Khan Rally: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment