50 Year Old Afghan Man of Indian Origin Allegedly Kidnapped in Kabul Afghanistan - Sakshi
Sakshi News home page

కాబూల్‌లో భారతీయుని అపహరణ !

Published Fri, Sep 17 2021 7:42 AM | Last Updated on Fri, Sep 17 2021 12:32 PM

Afghanistan Indian Origin Man Bansri Lal Kidnapped At Kabul - Sakshi

కాబూల్‌లో కిడ్నాప్‌కు గురైన భారత సంతతి వ్యక్తి బన్‌ శ్రీలాల్‌

న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో భారతీయుని అపహరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాబూల్‌లో భారతీయ పౌరుడు బాన్‌శ్రీ లాల్‌ అరిందేను తుపాకీతో బెదిరించి కొందరు కిడ్నాప్‌ చేశారని వార్తలు వెలువడ్డాయి. అపహరణ విషయంపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. ‘కాబూల్‌లోని స్థానిక అధికారులతో మంతనాలు జరుపుతున్నాం. భారతీయ పౌరుడి కిడ్నాప్‌ వ్యవహారంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ఢిల్లీలో గురువారం మీడియాతో చెప్పారు. లాల్‌ కుటుంబం హరియాణాలోని ఫరీదాబాద్‌ పట్టణంలో నివాసముంటోంది. కాబూల్‌లో లాల్‌ గత రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement