
కాబుల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో ఘోర ప్రమాదం సంభించింది. ఓ టన్నెల్ నుంచి వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ నిప్పంటుకుని పేలిపోయింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ట్యాంకర్‌కు నిప్పెలా అంటుకుందనే విషయం తెలియరాలేదు. కాబుల్‌కు ఉత్తరాన 80 మైళ్ల దూరంలో ఈ టన్నెల్ ఉంది. 1960 నుంచి 1964 వరకు దీన్ని నిర్మించారు. ఉత్తర, దక్షిణానికి మధ్య వారధిగా ఉంటోంది.
చదవండి: విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి
Comments
Please login to add a commentAdd a comment