కాబుల్: తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్గానిస్థాన్‌లో సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు పెరిగిపోయాయి. తాజాగా అయ్బక్ నగరంలోని ఓ మదర్సాలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది చిన్నారులు సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక ఆసుపత్రి వైద్యుడు తెలిపారు.
దేశ రాజధాని కాబుల్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని అయ్బక్ నగరంలో పేలుడు జరిగినట్లు తెలిపారు డాక్టర్. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మృతుల్లో మొత్తం చిన్నారులు, సామాన్య ప్రజలే.’ అని ఏఎఫ్‌పీ న్యూస్‌తో వెల్లడించారు. మరోవైపు.. పేలుడు జరిగినట్లు అధికారులు ధ్రువీకరించినప్పటికీ మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి: పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్!
Comments
Please login to add a commentAdd a comment