fuel tanker
-
నైజీరియాలో పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 90 మందికి పైగా మృతి
నైజీరియా దేశంలో పెను విపత్తు చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 90 మందికి పైగా మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. ఉత్తర జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.కాగా కనో నుంచి బయల్దేరిన ఓ పెట్రోల్ ట్యాంకర్ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. హైవేపై ట్యాంకర్ వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది.దీంతో పెట్రోల్ అంతా రోడ్డుపై పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు ఇంధనం కోసం ట్యాంకర్ చుట్టూ గుమిగూడారు. వారు పెట్రోల్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది.ఈ ఘటనలో 94 మంది మృతిచెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరో 50 మంది వరకు గాయపడిన్టలు బుధవారం పోలీసు ప్రతినిధి లావాన్ షిసు ఆడమ్ వెల్లడించారు.. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్‌కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడటంతో మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు.వాస్తవానికి నైజీరియాలో సరుకు రవాణాకు రైల్వే వ్యవస్థ లేవు. రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం.. 2020లో మాత్రమే 1,531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 535 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,142 మంది గాయపడ్డారు. గత ఆదివారం నైజీరియాలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 48 మంది మృతి చెందారు. -
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి
అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇంధన ట్యాంకర్, ట్రక్కును ఢీకొన్న ఘటనలో 48 మంది మృతి చెందారు. నైగర్‌లోని అగాయ్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న పలువురితోపాటు పశువులు సజీవ దహనమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ పేలుడు కారణంగా రోడ్డుపై సమీపంలో ఉన్న ఇతర వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇదీ చదవండి.. అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు -
ఆయిల్ ట్యాంకర్ పేలి.. 40 మంది మృతి
మన్రోవియా: లైబీరియాలోని టయోటాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 83 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టయోటాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ట్యాంకర్ నుంచి కారిపోతున్న పెట్రోల్‌ను పట్టుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటల్లో చిక్కుకుని 40 మంది మృతి చెందారు. 83 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటానికి గల కారణాలు స్పష్టంగా తెలియదు. ఈ ప్రమాదంపై లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విషాదం చిత్రాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని ఆయన కార్యాలయం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
లండన్ బ్రిడ్జిపై పేలిన ఆయిల్ ట్యాంకర్.. వీడియో వైరల్..
లండన్‌లో ఓ బ్రిడ్జిపై ఆయిల్ ట్యాంకర్ పేలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటనలు అదుపుచేశారు. అయితే కారు టైరు పేలిపోయి అదుపుతప్పి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అనంతర దృశ్యాలను అటువైపుగా వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే అవి వైరల్‌గా మారాయి. Fire on the gold star bridge in groton Ct😳 pic.twitter.com/pxbAMKWWec — chrisstevens7 (@Moneymakerzzz91) April 21, 2023 Firefighters battle a blaze on the Goldstar Memorial Highway, l- 95 south #newlondon #groton pic.twitter.com/SQdDvmiitV — Greg Smith (@SmittyDay) April 21, 2023 Kayaker Matt Stone of Chester caught this footage from the water near the Gold Star Bridge boat launch @thedayct pic.twitter.com/EyGqSU5Cit — Elizabeth Regan (@eregan_ct) April 21, 2023 చదవండి: సొంత నగరంపైనే రష్యా బాంబింగ్ -
ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 19 మంది దుర్మరణం..
కాబుల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో ఘోర ప్రమాదం సంభించింది. ఓ టన్నెల్ నుంచి వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ నిప్పంటుకుని పేలిపోయింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది చనిపోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ట్యాంకర్‌కు నిప్పెలా అంటుకుందనే విషయం తెలియరాలేదు. కాబుల్‌కు ఉత్తరాన 80 మైళ్ల దూరంలో ఈ టన్నెల్ ఉంది. 1960 నుంచి 1964 వరకు దీన్ని నిర్మించారు. ఉత్తర, దక్షిణానికి మధ్య వారధిగా ఉంటోంది. చదవండి: విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి -
నడిరోడ్డుపై పేలిన ట్యాంకర్..33మంది మృతి
-
నడిరోడ్డుపై పేలిన ట్యాంకర్..33మంది మృతి
నైరోబీ: కెన్యా పెద్ద ప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్ ట్యాంకర్ పేలి పోయింది. ఈ ప్రమాదంలో 33మంది అక్కడికక్కడే చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన నాకురు-నైరోబీ రోడ్డులో రాత్రి 9.30గంటలకు సంభవించినట్లు తెలిపారు. వేగంగా వెళుతున్న ట్యాంకర్‌పై నియంత్రణ కోల్పోవడంతో కెరాయ్ ప్రాంతంలోని ఇతర వాహనాలపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటనలో పేలుడు సంభవించి అనూహ్యంగా పలువురు మృత్యువాత పడినట్లు చెప్పారు. ఈ వాహనంలో ప్రయాణీకులు కూడా ఉన్నారు. -
73 మంది సజీవదహనం
అఫ్గాన్‌లో రెండు బస్సులు, ఆయిల్ ట్యాంకర్ ఢీ ఘజ్ని: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్-కాందహార్ జాతీయ రహదారి ఆదివారం మరుభూమిని తలపించింది. ఘజ్ని రాష్ట్రంలో ఉదయం 7 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 73 మంది సజీవదహనమయ్యారు. వెనకెనుక వస్తోన్న రెండు బస్సుల్ని, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించింది. మహిళలు, పిల్లలు సహా పలువురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. హృదయ విదారక దృశ్యాలు చూపరుల్ని కన్నీళ్లు పెట్టించాయి. ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆఫ్గానిస్తాన్ చరిత్రలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇదొకటని భావిస్తున్నారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని, ఎక్కువ మంది తీవ్రంగా కాలిపోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయేల్ కవూసీ తెలిపారు. మృతులు ఇంకా పెరగవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాయాలతో బయటపడ్డవారికి కాందహార్, ఘజ్ని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అంతర్యుద్ధంతో ఘోరంగా దెబ్బతిన్న రోడ్డు.. 125 మంది ప్రయాణికులతో రెండు బస్సులు కాబూల్ నుంచి కాందహార్‌కు వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎదురుగా వస్తోన్న ఆయిల్ ట్యాంకర్ ఒక బస్సును ఢీకొనడంతో వెనక బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. 52 మంది సంఘటనా స్థలంలో విగతజీవులవగా, 21 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ విభాగ అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అంతర్యుద్ధం దెబ్బకు అఫ్గాన్‌లో రోడ్లు కూడా దారుణంగా పాడైపోయాయి. గతేడాది మేలో బడ్గిస రాష్ట్రంలో మినీ వేన్ బోల్తా పడి 18 మంది మరణించారు. 2013లో కాందహార్ దక్షిణ ప్రాంతంలో బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 45 మంది మృతిచెందారు. దీంతో అఫ్గాన్‌లో రోడ్ల అభివృద్ధికి గతేడాది నవంబర్‌లో రూ. 1675 కోట్ల సాయం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది.