నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి | 48 killed As Fuel Tanker Hits Truck Causing Explosion In Nigeria | Sakshi

నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి

Sep 9 2024 8:34 AM | Updated on Sep 9 2024 9:21 AM

48 killed As Fuel Tanker Hits Truck Causing Explosion In Nigeria

అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇంధన ట్యాంకర్‌, ట్రక్కును ఢీకొన్న ఘటనలో 48 మంది మృతి చెందారు. నైగర్‌లోని అగాయ్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్‌ ఢీకొంది. దీంతో భారీ పేలుడు సంభవించింది. 

ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న పలువురితోపాటు పశువులు సజీవ దహనమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ పేలుడు కారణంగా రోడ్డుపై సమీపంలో ఉన్న ఇతర వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. 

ఇదీ చదవండి.. అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement