Viral Video Fuel Tanker Truck Explodes On London Bridge - Sakshi
Sakshi News home page

Viral Video: లండన్‌ బ్రిడ్జిపై పేలిన ఆయిల్ ట్యాంకర్.. వీడియో వైరల్..

Published Sat, Apr 22 2023 12:45 PM | Last Updated on Sat, Apr 22 2023 1:04 PM

Viral Video Fuel Tanker Truck Explodes On London Bridge - Sakshi

లండన్‌లో ఓ బ్రిడ్జిపై ఆయిల్ ట్యాంకర్ పేలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటనలు అదుపుచేశారు.

అయితే కారు టైరు పేలిపోయి అదుపుతప్పి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అనంతర దృశ్యాలను అటువైపుగా వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే అవి వైరల్‌గా మారాయి.

చదవండి: సొంత నగరంపైనే రష్యా బాంబింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement