Oil Tanker
-
ఆయిల్ ట్యాంకర్లో బీర్ బాటిళ్లా?! ఎంతకు తెగించారు రా? వైరల్ వీడియో
బీహార్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం తెలుగులోకి వచ్చింది.దీంతో పోలీసులు వల పన్నడంతో డ్రైవర్ ,మద్యం వ్యాపారి ట్యాంకర్‌ను జాతీయ రహదారిపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం హిందుస్థాన్ పెట్రోలియం ట్యాంకర్లో సుమారు 200 బీరు డబ్బాలను తరలించేందుకు ప్రయత్నించారు స్మగర్లు. అయితే దీనికు ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందిండంతో స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గమించిన స్మగ్లర్లు ట్యాంకర్‌ను జాతీయ రహదారి వైపు మళ్లించడాన్ని గమనించిన అధికారులు రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో డ్రైవర్, మద్యం వ్యాపారి అక్కడినుంచి పలాయనం చిత్తగించారు. నాగాలాండ్‌లో రిజిస్టర్ అయిన ట్యాంకర్‌ను ముజఫర్‌పూర్‌లో స్వాధీనం చేసుకున్నామని అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. అలాగే పట్టుబడిన మద్యం అరుణాచల్ ప్రదేశ్‌లో తయారైందని వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా చేసిన స్థానిక వ్యాపారిని గుర్తించి, అతడిని అరెస్టు చేసేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.కాగా బీహార్‌లో మద్యం అమ్మకం నిషేధం అమల్లో ఉంది. దీంతో మద్యం, అక్రమ రవాణాకు, విక్రయాలకు వ్యాపారులు వినూత్న మార్గాలను ఆశ్రయిస్తున్నారు. కొన్నిసార్లు అంబులెన్స్‌లు, ట్రక్కులలో తరలించిన వైనాన్ని చూశాం. అంతేకాదే మద్యం బాటిళ్లను నిల్వ చేసేందుకు పెట్రోల్ ట్యాంకుల లోపల కంపార్ట్మెంట్లు నిర్మించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరోవైపు కల్తీ మద్యం బారిని పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ये बिहार है बाबू! मुजफ्फरपुर में तेल टैंकर से पेट्रोल की बजाय निकलने लगी अवैध शराब#Bihar pic.twitter.com/gE0GJP4afl— Mangal Yadav (@MangalyYadav) October 23, 2024 -
చమురు ట్యాంకర్‌కు మంటలు
ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడులకు గురైన ‘సోయూనియన్’ అనే 900 అడుగుల భారీ చమురు ట్యాంకర్ ఇది. ఆగస్ట్ 21వ తేదీన ట్యాంకర్‌కు అంటుకున్న మంటలు ఇప్పటికీ చల్లారలేదు. ఇందులోని 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు లీకైతే మునుపెన్నడూ లేనంతగా సముద్ర పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, సాధ్యమైనంత మేర ట్యాంకర్‌లోని చమురును తరలించే అత్యంత క్లిష్టమైన ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. గ్రీస్‌కు చెందిన ఈ నౌక యాజమాన్యం ఈ విషయంలో సౌదీ అరేబియా సాయం కోరింది. అప్పటి వరకు మరిన్ని దాడులు జరగకుండా గ్రీస్, ఫ్రాన్సు నౌకలు ‘సోయూనియన్’కు కాపలాగా ఉన్నాయి. -
Oman: చమురు నౌక మునక.. 13 మంది భారతీయులతో సహా 16 మంది గల్లంతు
ఒమన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యెమెన్ వైపు వెళుతున్న చమురు నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఒమన్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చమురు నౌక పేరు ప్రెస్టీజ్ ఫాల్కన్.ప్రమాదం జరిగిన సమయంలో దీనిలో 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైనవారిలో 13 మంది భారతీయ పౌరులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని సమాచారం. ఈ చమురు నౌకకు తూర్పు ఆఫ్రికా దేశమైన కొమొరోస్ జెండా ఉంది. ఈ చమురు నౌక ఒమన్ ప్రధాన పారిశ్రామిక డుక్మ్ పోర్ట్ సమీపంలో మునిగిపోయింది.ఈ ట్యాంకర్ షిప్ యెమెన్ వైపు వెళ్తుండగా దుక్మ్ పోర్ట్ సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మునిగిపోయిన చమురు నౌక 117 మీటర్ల పొడవు ఉంది. దీనిని 2017లో నిర్మించారని తెలుస్తోంది. కొమొరోస్ ఫ్లాగ్ ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ రాస్ మదారకాకు ఆగ్నేయంగా 25 నాటికన్ మైళ్ల దూరంలో మునిగిపోయిందని మారిటైమ్ సేఫ్టీ సెంటర్ ఒక ట్వీట్లో తెలిపింది. A Comoros flagged oil tanker capsized 25 NM southeast of Ras Madrakah. SAR Ops initiated with the relevant authorities. #MaritimeSecurityCentre— مركز الأمن البحري| MARITIME SECURITY CENTRE (@OMAN_MSC) July 15, 2024 -
బ్రిటిష్ నౌకపై హౌతీల దాడి
జెరూసలేం: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచి్చపోయారు. బ్రిటిష్ చమురు ట్యాంకర్‌తోపాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ కారీ్నపైకి క్షిపణులను ప్రయోగించారు. బ్రిటిష్ చమురు నౌక మంటల్లో చిక్కుకోగా, అందులోని 22 మంది భారతీయ సిబ్బందిని కాపాడేందుకు భారత నావికా దళం ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి హుటాహుటిన తరలి వెళ్లింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఏడెన్ సింధులో చోటుచేసుకుంది. బ్రిటిష్ చమురు నౌక ఎంవీ మర్లిన్ లువాండా లక్ష్యంగా హౌతీలు ప్రయోగించిన క్షిపణితో నౌకలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. విపత్తు సమాచారం అందుకున్న భారత నేవీకి చెందిన డె్రస్టాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి చేరుకుంది. నౌకలో మంటలను ఆర్పి, సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నౌకలోని సిబ్బందిలో 22 మంది భారతీయులతోపాటు ఒక బంగ్లాదేశీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని కలగలేదని సమాచారం. ఇలా ఉండగా, ఏడెన్ సింధు శాఖలో పయనించే చమురు నౌకలే లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగిన నేపథ్యంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీని మోహరించింది. ఈ నౌకపైకి శుక్రవారం హౌతీలు మొట్టమొదటిసారిగా క్షిపణిని ప్రయోగించారు. దీనిని మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా నేవీ ప్రకటించింది. -
ఎర్రసముద్రంలో అలజడి.. మరో రెండు నౌకలపై డ్రోన్ దాడి
ఎర్రసముద్రంలో మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్‌దాడి చేశారని భారత నౌకాదళం తెలిపింది. అయితే.. ఇండియన్ జెండా లేని నౌకపైనే దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. గాబన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకపై దాడి చేశారని వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పేర్కొంది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. అయితే.. భారత జెండా కలిగిన నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ పొరపాటున ఇంతకుముందు తెలిపింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత భారత నౌకాదళం తెలిపింది. ఆయిల్ ట్యాంకర్ ఎంవీ సాయిబాబాపై దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. మరోవైపు నార్వేజియన్ జెండా కలిగిన మరో ఆయిల్ ట్యాంకర్‌పై కూడా హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. అలాగే, అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ లబూన్ పై కూడా డ్రోన్ దాడులకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ డ్రోన్ల్‌ను యుద్ధనౌక కూల్చివేసిందని అమెరికా సెంట్కామ్ వెల్లడించింది. ఈ ఘటనల తర్వాత అక్టోబర్ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరినట్లు పేర్కొంది. ఓవైపు గుజరాత్ సమీపంలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ ఘటనతో అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్‌లో కేంద్రీకృతమైన ఇరాన్ మద్దతుగల హౌతీలు.. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతిస్పందనగా ఎర్ర సముద్రంలో దాడులకు పాల్పడుతున్నారు. బాబ్ అల్-మందాబ్ జలసంధి గుండా వెళుతున్న నౌకలపై దాడులతో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తున్నారు. ఇదీ చదవండి: డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే.. -
నెత్తురోడిన రహదారులు.. రెండు వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి
దేశంలో రహదారులు మృత్యు ద్వారాలను తలపించాయి.. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మెుత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరువత్తూర్ జిల్లా వానియంబాడి రహదారిపై శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోనూ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గురుగ్రామ్ సమీపంలోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా వేగంగా దూసుకొచ్చి కారును, మరో వ్యాన్‌ను బలంగా ఢకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు కారుకు సైతం అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్ డ్రైవర్ కూడా అక్కడికికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటన తర్వాత ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడని, అతడిని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ట్యాంకర్లో సీఎన్జీ సిలిండర్లు ఉండటంతో మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. చదవండి: టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి -
230 కిలోమీటర్ల వేగంతో రోల్స్ రాయిస్ బీభత్సం
చంఢీగడ్: హర్యానాలోని నూహ్‌లో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై రోల్స్ రాయిస్ కారు ఓ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ట్యాంకర్ యూటర్న్ తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని వెల్లడించారు. కారు, ట్యాంకర్ రెండు కూడా ఒకే దారిలో వస్తున్నాయి. ఈ క్రమంలో ట్యాంకర్ యూటర్న్ కోసం నిలిచి ఉంది. వెనకే ఉన్న రోల్స్ రాయిస్ దాదాపు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అదుపుతప్పి నిలిచి ఉన్న ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెనకే మరో కారులో వస్తున్న బాధిత కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు.. ఎందుకంటే..? -
ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ఆయిల్ ట్యాంకర్‌కు మంటలు
-
మోహిదీపట్నం ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా
-
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మాసబ్ ట్యాంక్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాసబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ రోడ్డు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. మాసబ్ ట్యాంక్, మోహిదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్, బంజారాహిల్స్ రోడ్ నెం1, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది.ఈ మార్గానికి అనుసంధానమైన దారుల్లోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి . విషయం తెలుసుకున్న ట్రాఫఙక్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తోశారు. ట్రాఫిక్ క్లియన్ చేసేందుకు పోలీసులు కష్టపడుతున్నారు. రోడ్డుపై ఆయిల్ ఉండటంతో వాహనదారులు జారిపడుతున్నారు. మాసబ్ ట్యాంక్ ఫైఓవర్ నుంచి ఆయిల్ కిందకి పడిపోతుంది. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కిందా పైన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
లండన్ బ్రిడ్జిపై పేలిన ఆయిల్ ట్యాంకర్.. వీడియో వైరల్..
లండన్‌లో ఓ బ్రిడ్జిపై ఆయిల్ ట్యాంకర్ పేలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటనలు అదుపుచేశారు. అయితే కారు టైరు పేలిపోయి అదుపుతప్పి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అనంతర దృశ్యాలను అటువైపుగా వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే అవి వైరల్‌గా మారాయి. Fire on the gold star bridge in groton Ct😳 pic.twitter.com/pxbAMKWWec — chrisstevens7 (@Moneymakerzzz91) April 21, 2023 Firefighters battle a blaze on the Goldstar Memorial Highway, l- 95 south #newlondon #groton pic.twitter.com/SQdDvmiitV — Greg Smith (@SmittyDay) April 21, 2023 Kayaker Matt Stone of Chester caught this footage from the water near the Gold Star Bridge boat launch @thedayct pic.twitter.com/EyGqSU5Cit — Elizabeth Regan (@eregan_ct) April 21, 2023 చదవండి: సొంత నగరంపైనే రష్యా బాంబింగ్ -
‘పుష్ప’ను ఫాలో అయ్యి.. పరారయ్యారు!
శృంగవరపుకోట/నర్సీపట్నం: ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తారు. ఈ ఐడియా ఏదో మనకు పనికొస్తుంది అనుకున్నారో ఏమో.. ఆ గంజాయి స్మగ్లర్లు అచ్చం అదే ఐడియాను అనుసరించారు. ఆయిల్ ట్యాంకర్లో గంజాయి రవాణా చేస్తూ విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసులకు దొరికిపోయారు. అరకు నుంచి ఎస్.కోట వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం ఆదివారం ఎస్.కోట ఎస్ఐ తారకేశ్వరరావుకు అందింది. దీంతో తన సిబ్బందితో కలిసి బొడ్డవర చెక్‌పోస్టు వద్ద కాపుకాశారు. ఉదయం 7.30 గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తొలుత తమ లారీలో ఎలాంటి గంజాయి లేదని డ్రైవర్, క్లీనర్లు బుకాయించారు. పోలీసులు ట్యాంకర్ పైకి ఎక్కి నాలుగు కంపార్ట్మెంట్లపై క్యాప్‌లకు ఉన్న నట్లు తీసేందుకు ప్రయత్నించగా వారు అక్కడ నుంచి ఉడాయించారు. ట్యాంకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి నాలుగు కంపార్ట్మెంట్ల క్యాప్‌లు తెరచి చూడగా.. ముందున్న కంపార్ట్మెంట్, వెనుక ఉన్న రెండు కంపార్ట్మెంట్లను ఖాళీగా వదిలేశారు. మధ్యలోని రెండో కంపార్ట్మెంట్లో లోడ్ చేసిన 780 కిలోల 149 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. నర్సీపట్నంలో రూ.3 లక్షల విలువైన గంజాయి స్వాధీనం లారీలో తరలిస్తున్న 1100 కిలోల గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి చింతపల్లి రోడ్డు నెల్లిమెట్ట వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన డ్రైవర్ కొద్ది దూరంలో లారీ ఆపి పారిపోయాడు. లారీని పోలీసులు తనిఖీ చేయగా సుమారు రూ.3 లక్షల విలువైన గంజాయి బయటపడింది. -
ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. 91 మంది మృతి
-
ఆయిల్ కోసం ఎగబడ్డ జనాలు.. ఒక్కసారిగా పేలుడు.. 91 మంది మృతి
సియర్రాలియోన్/ ఆఫ్రికా: ఆఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 91 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఆఫ్రికా సియర్రాలియోన్‌లో శనివారం చోటు చేసుకుంది. సియర్రాలియోన్ రాజధాని ఫ్రీటౌన్‌లో ఈ పేలుడు సంభవించింది. ఆ వివరాలు.. ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీకవతుండటంతో దాన్ని పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ వద్ద నిలిపి ఉంచారు. విషయం తెలిసిన స్థానికులు లీకవుతున్న చమురును పట్టుకునేందుకు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. (చదవండి: భూమి కుంగడంతోనే ప్రమాదం) ఇదే సమయంలో అటుగా వచ్చిన బస్సు.. ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు స్థానికులు, బస్సు ప్రయాణికులు మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 91 మంది మృతి చెందినట్లు అధికారుల ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చదవండి: రాత్రికి రాత్రే శ్మశానాలుగా మారిపోయాయి.. అసలేం జరిగింది? -
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నగరం నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
చమురు నౌకలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: శ్రీలంక తీరంలో ఎమ్టీ న్యూ డైమండ్ అనే నౌక ప్రమాదానికై గురైంది. కువైట్ నుంచి భారత తూర్పు తీరంలోని ఒడిశా పారాదీప్ తీరానికి ఆయిల్ ట్యాంకర్‌తో బయల్దేరిన పనామా పడవలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరొకరు గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 23 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రక్షణ చర్యల్లో సాయం అందించాల్సిందిగా కోరిన శ్రీలంక నావికా దళ అభ్యర్థన మేరకు భారత్‌కు చెందిన మూడు కోస్ట్‌గార్డు షిప్పులు అక్కడికి బయల్దేరాయి. శౌర్య, సారంగ్, సముద్రలను అక్కడికి పంపడంతో పాటుగా తక్షణ సహాయక చర్యల కోసం ఓ విమానాన్ని కూడా తరలించినట్లు ఇండియన్ కోస్ట్‌గార్డ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. కాగా చమురుతో బయల్దేరిన ఈ నౌక శనివారం పారాదీప్ తీరానికి చేరుకోవాల్సి ఉండగా.. ఇంతలో ప్రమాదం చోటుచేసుకుంది. #SavingLives #SAR #FireFighting assistance sought by Sri Lanka Navy from @IndiaCoastGuard for fire and explosion onboard Oil Tanker #MTNewDiamond 37 NM east off #Srilanka coast. #ICG ships and aircraft deployed for immediate assistance @DefenceMinIndia @MEAIndia pic.twitter.com/OsvgyZfKq0 — Indian Coast Guard (@IndiaCoastGuard) September 3, 2020 -
కనకదుర్గ వారధిపై లీక్ అయిన ఆయిల్
తాడేపల్లిరూరల్: కృష్ణానది కనకదుర్గవారధిపై ఓ ట్యాంకర్లోనుంచి డీజిల్ ఆయిల్ లీక్ అవ్వడంతో వారధిపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న డీజిల్ టాంకర్లోనుంచి ఆయిల్ లీక్ అయింది. సుమారు 500 మీటర్ల పొడవునా ఆయిల్ లీక్ అయిన అనంతరం గమనించిన ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని ఆపి లీక్ అవుతున్న ఆయిల్‌ను నిలుపుదల చేశాడు. ఆయిల్ లీక్ అవ్వడంతో భారీ వాహనాలు సైతం జారిపోయాయి. సమాచారం అందుకున్న తాడేపల్లి ట్రాఫిక్ సీఐ బ్రహ్మయ్య, తాడేపల్లి సీఐలు అంకమ్మరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి వెళ్లి, లీక్ అయి రోడ్డు మీద ఉన్న ఆయిల్పైన ఇసుక చల్లించి వాహనాలను వదిలారు. అయినప్పటికీ కార్లు, ద్విచక్రవాహనాలు జారుతూ ఉండడంతో తిరిగి మరలా ట్రాఫిక్ నిలిపివేసి మరోసారి ఇసుక చల్లించి దానిపైన సర్ఫ్ చల్లి విజయవాడ అగ్నిమాపక సిబ్బందిచేత నీళ్లు కొట్టించి శుభ్రం చేశారు. ఇలా శుభ్రం చేయడానికి గంటన్నర వ్యవధి పట్టడంతో కనకదుర్గవారధి 22వ కానా దగ్గర నుంచి కొలనుకొండ వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎట్టకేలకు రోడ్డు శుభ్రం చేసిన అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
భూమి కుంగడంతోనే ప్రమాదం
టంగుటూరు: మండల పరిధిలోని టి.నాయుడుపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుంచి 58 ట్యాంకర్లతో కడప వెళుతున్న గూడ్స్ రైలు 580 ఎగువ రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే పట్టాలు తప్పింది. మొత్తం ఏడు ట్యాంకర్లు పట్టాలు తప్పగా నాలుగు ట్యాంకర్లు బ్రిడ్జి కింద పడి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి దగ్ధమయ్యాయి. ఈ సంఘటన జరిగిన ప్రాంతం నుంచి ఐఓసీ లే అవుట్ పక్కనే ఉండటంతో భయాందోళన నెలకొంది. మంటలు క్రమం క్రమంగా పెద్దవి కావడంతో స్థానిక గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న ఐఓసీ రెస్క్యూ టీం, సౌత్ సెంట్రల్ రైల్వే రెస్క్యూ టీం, రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది.. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అడిషనల్ ఆర్ఎం రామరాజు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంజినీరింగ్ బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కమిటీ వేశామని, వారం రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం మూడవ రైల్వే నిర్మాణ పనుల వల్ల భూమి కుంగి రైలు పట్టాలు తప్పినట్లు భావిస్తున్నామన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. మిగిలిన 50 ట్యాంకర్లను టంగుటూరుకు చేర్చామన్నారు. గురువారం ఉదయం 300 మంది కార్మికులు మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు. సంఘటనా స్థలాన్ని రైల్వే అధికారులు, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, సింగరాయకొండ సీఐ శ్రీనివాసులు, ఎస్సై రమణయ్యలు పరిశీలించారు. -
ఆయిల్ ట్యాంక్ పగలడంతో..
చెన్నై : తమిళనాడులో ఓ ట్యాంకర్ ప్రమాదానికి గురవడంతో.. వేల లీటర్ల రిఫైండ్ ఆయిల్ రోడ్డుపాలయింది. చెన్నై నుండి సేలం జిల్లా అత్తూర్‌కు ఆయిల్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ కామరాజనగర్లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంక్ పగిలిపోయింది. దీంతో వేలలీటర్ల ఆయిల్ వృథాగా పోయింది. స్థానికులు గిన్నెలు, బిందెలతో ఆయిల్‌ను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. -
జిబ్రాల్టర్‌లో విడుదలైన నలుగురు భారతీయులు
లండన్: ఇరాన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్లో ఉండి అరెస్టయిన కెప్టెన్ సహా నలుగురు భారత సిబ్బందిపై పోలీసుల విచారణ ముగిసి వారు జిబ్రాల్టర్‌లో గురువారం విడుదలయ్యారు. స్పెయిన్‌కు దక్షిణాన, సముద్ర తీరంలో ఉండే బ్రిటిష్ ప్రాంతమే ఈ జిబ్రాల్టర్. పనామా జెండా కలిగిన ఈ ఆయిల్ ట్యాంకర్ జిబ్రాల్టర్ జలాల్లోని ఐరోపా పాయింట్ వద్ద ఉండగా, గత నెల 4వ తేదీన జిబ్రాల్టర్ అధికారులు వారిని అడ్డగించి ట్యాంకర్‌ను తమ అధీనంలోకి తీసుకుని అందులోని 28 మంది సిబ్బందిని అరెస్టు చేశారు. సిబ్బందిలో ఎక్కువ మంది భారతీయులే. సిరియాపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలున్నాయి. ఈ ఆయిల్ ట్యాంకర్ ద్వారా సిరియాకు ముడి చమురును తీసుకెళ్తున్నారనే అనుమానంతో జిబ్రాల్టర్ అధికారులు సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే అది సిరియాకు వెళ్తున్నది కాదని అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వం, ట్యాంకర్ సిబ్బంది చెబుతూనే ఉన్నారు. దీంతో తాజాగా నలుగురు భారతీయులపై పోలీసులు విచారణ ముగించి, వారిని జిబ్రాల్టర్‌లో విడుదల చేశారు. -
ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు
న్యూఢిల్లీ/లండన్: బ్రిటన్–ఇరాన్‌ల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరులో భారతీయులు చిక్కుకున్నారు. తమ చమురునౌకను బ్రిటన్ స్వాధీనం చేసుకోవడంతో ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిగుండా వెళుతున్న బ్రిటిష్ చమురు నౌక ‘స్టెనా ఇంపెరో’ను ఇరాన్ శుక్రవారం స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా, వీరిలో కెప్టెన్ సహా 18 మంది భారతీయులే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత విదేశాంగ శాఖ ఈ 18 మందిని విడిపించేందుకు ఇరాన్‌తో చర్చిస్తోంది. చెరలోని భారతీయ సిబ్బందిని త్వరలో స్వదేశానికి తీసుకొస్తామని విదేశాంగ కార్యదర్శి రవీశ్ తెలిపారు. ఈ విషయమై హోర్ముజ్‌గన్ ప్రావిన్సు నౌకాశ్రయాలు, మారిటైమ్ డైరెక్టర్ జనరల్ అల్హమొరాద్ మాట్లాడుతూ..‘బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టెనా ఇంపెరో’ నౌక ఇరాన్‌కు చెందిన చేపల బోటును ఢీకొట్టింది. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించింది. ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కెప్టెన్ సహా 18 మంది భారతీయులు కాగా, రష్యా, ఫిలిప్పీన్స్, లాత్వియా, ఇతర దేశాలకు చెందిన ఐదుగురు ఉన్నారు’ అని తెలిపారు. స్వీడన్‌కు చెందిన స్టెనా బల్క్ అనే కంపెనీ ఈ నౌకను బ్రిటన్ కేంద్రంగా నిర్వహిస్తోంది. ఈ విషయమై స్టెనా బల్క్ ప్రెసిడెంట్ ఎరిక్ హనెల్ మాట్లాడుతూ..‘మా నౌక హోర్ముజ్ జలసంధిలో ఉండగానే మరో చిన్నపాటి నౌక, హెలికాప్టర్ దాన్ని సమీపించాయి. అంతర్జాతీయ జలాల్లోకి ‘స్టెనా ఇంపెరో’ ప్రవేశించిన కొద్దిసేపటికే సౌదీఅరేబియాలోని జుబైల్ నగరంవైపు కాకుండా దిశను మార్చుకుని ఇరాన్‌వైపు వెళ్లింది’ అని చెప్పారు. ఈయూ ఆంక్షలను ఉల్లంఘించి సిరియాకు ముడిచమురు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో ఇరాన్‌కు చెందిన చమురు నౌకను బ్రిటిష్ మెరైన్లు జీబ్రాల్టర్ జలసంధి వద్ద ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. -
రన్‌వేపై జారి పడిన ఇంధన ట్యాంకు
పనాజి: గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలోభారీ ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి యుద్ధవిమానానికి సంబంధించిన ఆయిల్ ట్యాంకు రన్‌వే పై జారిపడింది. దీంతో ఇంధనం రన్‌వేపై పడి, మంటలంటుకున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఈ అనుకోని ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా రెండు గంటలపాటు కార్యకలాపాలను నిలిపి వేశారు. గోవా విమానాశ్రయంలో అన్ని రకాల సేవలను రెండు గంటల పాటు సస్పెండ్ చేశామని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు శనివారం మధ్యాహ్నం ట్విటర్ ద్వారా ప్రకటించారు. డబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నావీకి చెందిన మిగ్ 29 కె విమానంలోని డిటాచ్బుల్ ఫ్యూయల్ ట్యాంకు రన్‌వేపై జారిపడిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. భారతీయ నౌకా దళానికి చెందిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రన్ వేను శుభ్రపరిచి, మరమ్మతు పనులు చేపట్టారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు యథావిధిగా కార్యక్రమాలు తిరిగి మొదలవుతాయని తెలిపారు. యుద్ధ విమానం కూడా సురక్షితంగానే ఉన్నట్లు వారు తెలిపారు. Due to jettisoned fuel tank on runway during MIG sortie the operations are closed for two hrs at Goa airport. Pl bear with us. — Goa Airport (@aaigoaairport) June 8, 2019 -
పెట్రోల్ ట్యాంకర్ పేలి 58 మంది మృతి
నియామే: ఆఫ్రికా దేశం నైగర్ రాజధాని నియామేలో బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్ నుంచి స్థానికులు పెట్రోల్ సేకరిస్తుండగా అది పేలి 58 మంది మరణించారు. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని రైలు పట్టాలపై ఆదివారం రాత్రి ట్యాంకర్ బోల్తా పడి పెట్రోల్ కారుతుండగా, ఆ పెట్రోల్‌ను తెచ్చుకోడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ట్రక్కు పేలడంతో అక్కడ ఉన్నవాళ్లలో చాలా మంది మరణించారు. చుట్టుపక్కల ఇళ్లు కూడా ఈ మంటల కారణంగా ధ్వంసమయ్యాయి. 58 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. -
వరదలో కొట్టుకుపోయిన ఆయిల్ ట్యాంకర్
-
కొట్టుకుపోయిన ఆయిల్ ట్యాంకర్; మగ్గురు గల్లంతు
లక్నో: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపోర్లుతున్నాయి. దిగువ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రభావం అధికంగా కనబడుతోంది. వరదల్లో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ఆయిల్ ట్యాంకర్ వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీచేశారు. అయితే వీటిని సరిగా అంచనా వేయని ఓ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ బిజ్నూర్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లేందుకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మధ్యలో గాగ్రా నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఆ వాహనం అందులో పడి కొట్టుకుపోయింది. ఆయిల్ ట్యాంకర్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. దీనిని నది ఒడ్డున ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఉత్తరాఖండ్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. బిజ్నూర్, ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్టు అధికారులు తెలిపారు.