వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి(30) అక్కడికక్కడే మృతిచెందాడు.
ఘట్‌కేసర్(రంగారెడ్డి): వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి(30) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద గురువారం చోటుచేసుకుంది. వరంగల్ వైపు నుంచి నగరానికి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ అంకుశాపూర్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది.
వాహనం అతని తల పై నుంచి పోవడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.