ankushapur
-
శ్మశానంలో వర్షానికి నీటిలో తేలియాడిన మృతదేహం
టేకుమట్ల: ఒకే మృతదేహానికి రెండుసార్లు అంతిమ వీడ్కోలు పలికిన హృదయ విదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చలివాగు ఒడ్డుకు పూడ్చి అంతిమ సంస్కారాలు చేశారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలివాగు ఉప్పొంగడంతో పూడ్చిన శవం నీటిలో తేలియాడుతూ మండలంలోని వెలిశాల శివారులో గల చెట్ల కొమ్మలకు చిక్కుకోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని బైటికి తీసి అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు. (చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ) చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి -
ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
-
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఘట్కేసర్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ హెచ్పీసీఎల్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లా హన్మకొండలోని టీచర్స్ కాలనీకి చెందిన సత్యనారాయణ(58) అదిలాబాద్ జిల్లా అసిఫాబాబాద్ హౌసింగ్ బోర్డులో డీఈగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఓ కొడుకు ఉన్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి సత్యనారాయణ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఆయన భార్య మీర(51), కూతుళ్లు స్వాతి(33), నీలిమ(28), కొడుకు శివరామకృష్ణ(22) కుటంబ సభ్యులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
ఘట్కేసర్(రంగారెడ్డి): వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి(30) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద గురువారం చోటుచేసుకుంది. వరంగల్ వైపు నుంచి నగరానికి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ అంకుశాపూర్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. వాహనం అతని తల పై నుంచి పోవడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.