ఘట్‌కేసర్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ హెచ్‌పీసీఎల్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
వివరాలు..
వరంగల్ జిల్లా హన్మకొండలోని టీచర్స్ కాలనీకి చెందిన సత్యనారాయణ(58) అదిలాబాద్ జిల్లా అసిఫాబాబాద్ హౌసింగ్ బోర్డులో డీఈగా పని చేస్తున్నారు. ఈయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఓ కొడుకు ఉన్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి సత్యనారాయణ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఆయన భార్య మీర(51), కూతుళ్లు స్వాతి(33), నీలిమ(28), కొడుకు శివరామకృష్ణ(22) కుటంబ సభ్యులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
Published Sat, Jul 30 2016 7:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement