
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జీవితం మీద విరక్తి చెంది చెరువులోకి దూకగా, ముగ్గురు మృతిచెందిన సంఘటన మాగడి తాలూకా దమ్మనట్టె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెదిన సిద్ధమ్మ (55), ఈమె కుమార్తె సుమిత్ర (30), అల్లుడు హనుమంతరాజు (35), వీరి కుమార్తె కీర్తన (11)లు ఆత్మహత్య చేసుకోవాలని గ్రామం సమీపంలోని చెరువులో దూకారు. వీరిలో ముగ్గురు మృత్యువాత పడగా, ప్రాణాలతో ఉన్న కీర్తనను గ్రామస్తులు కాపాడి ఆస్పత్రికి తరలించారు.
వీరి కుటుంబానికే చెందిన ఒక బాలిక (10)కు విషయం ముందే తెలిసి పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లరికం వచ్చిన హనుమంతరాజు మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడేవాడని, దీంతో కుటుంబ కలహాలు పెరిగి ఆత్మహత్య బాటపట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. కీర్తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కుదూరు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment