
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): తాగిన మత్తులో గొడవ పడిన స్నేహితులిద్దరు ప్రమాణం చేయడానికి చెరువు వద్దకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాసన్ తాలూకా తేజూరు గ్రామానికి చెందిన ఆనంద, చంద్రు హాసన్‌లో ఒక బేకరిలో పని చేస్తున్నారు. ఖాళీ సమయంలో శుభకార్యాలకు స్వీట్లు చేసి ఇచ్చేవారు.
గురువారం బేకరిలో పని ముగించుకొని రింగ్‌రోడ్డులోని ఒక బార్‌లో మద్యం తాగారు. గతంలో ఒకరి నుంచి డబ్బు తీసుకుని మిఠాయిలు చేసివ్వలేదు. తాగిన మత్తులో ఈ విషయంపై గొడవ పడ్డారు. తప్పు చేయలేదని గంగను ముట్టి ప్రమాణం చేద్దామంటూ దగ్గరిలోని చెరువులోకి దిగారు. మత్తులో జారి నీటిలోకి పడి మునిగిపోవడంతో విగతజీవులయ్యారు. హాసన పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment