
కుమారస్వామి, పల్లవి (ఫైల్)
బెంగళూరు: ప్రేమించాలంటూ పోకిరీ వెంటపడి వేధిస్తుండడాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా మల్లాతహళ్లి గ్రామం నివాసి పల్లవి (22)ఆత్మహత్య చేసుకున్న యువతి.
కుమారస్వామి అనే యువకుడు గత కొంత కాలంగా పల్లవిని ప్రేమించమని వేధిస్తుండడంతో భయాందోళనకు గురైన పల్లవి ఉరి వేసుకుంది. తమ కుమార్తె మృతికి కుమారస్వామి వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: (భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్)