Doddaballapur
-
ప్రేమించమని వేధింపులు.. భయాందోళనతో..
బెంగళూరు: ప్రేమించాలంటూ పోకిరీ వెంటపడి వేధిస్తుండడాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా మల్లాతహళ్లి గ్రామం నివాసి పల్లవి (22)ఆత్మహత్య చేసుకున్న యువతి. కుమారస్వామి అనే యువకుడు గత కొంత కాలంగా పల్లవిని ప్రేమించమని వేధిస్తుండడంతో భయాందోళనకు గురైన పల్లవి ఉరి వేసుకుంది. తమ కుమార్తె మృతికి కుమారస్వామి వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్) -
జీవితం మీద విరక్తి.. చెరువులోకి దూకిన కుటుంబం
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జీవితం మీద విరక్తి చెంది చెరువులోకి దూకగా, ముగ్గురు మృతిచెందిన సంఘటన మాగడి తాలూకా దమ్మనట్టె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెదిన సిద్ధమ్మ (55), ఈమె కుమార్తె సుమిత్ర (30), అల్లుడు హనుమంతరాజు (35), వీరి కుమార్తె కీర్తన (11)లు ఆత్మహత్య చేసుకోవాలని గ్రామం సమీపంలోని చెరువులో దూకారు. వీరిలో ముగ్గురు మృత్యువాత పడగా, ప్రాణాలతో ఉన్న కీర్తనను గ్రామస్తులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. వీరి కుటుంబానికే చెందిన ఒక బాలిక (10)కు విషయం ముందే తెలిసి పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లరికం వచ్చిన హనుమంతరాజు మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడేవాడని, దీంతో కుటుంబ కలహాలు పెరిగి ఆత్మహత్య బాటపట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. కీర్తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కుదూరు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. చదవండి: (బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..) -
రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి
సాక్షి, దొడ్డబళ్లాపురం(బెంగళూరు): రెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్యాయత్నం చేసిన కామాంధున్ని మంగళూరు పోలీసులు అరెస్టు చేసారు. బిహార్‌కు చెందిన చందన్ (38) నిందితుడు. మంగళూరులోని హోయి బజార్లో బిహార్‌కు చెందిన సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో చందన్ ఓ బాలికపై అత్యాచారం చేసి అనంతరం నీళ్లులేని ట్యాంకులో పడేసి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన తల్లితండ్రులు కాలనీ అంతా వెదికి చివరగా రాత్రి 9 గంటల సమయంలో నీటి ట్యాంకులో చూడగా చిన్నారి స్పృహతప్పి పడి ఉంది. తక్షణం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సోమవారం విచారణ జరపగా చిన్నారిని చందన్ తీసికెళ్లాడని తెలిసింది. చందన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా నిజం ఒప్పుకున్నాడు. చదవండి: (విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..) -
లాక్డౌన్: తోటపని చేస్తున్న హీరోయిన్
దొడ్డబళ్లాపురం: లాక్డౌన్ కావడంతో సినీతారలు ఇళ్లకు, ఫాంహౌస్‌లకు పరిమితమయ్యారు. నటీమణి ఆశికా రంగనాథ్ కూడా ఫాంహౌస్‌లో కష్టపడుతోంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. కుటుంబసభ్యులతో కలిసి తోటలో పనిలో ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె చెబుతోంది. దర్శన్ తదితర పలువురు హీరోలు కూడా ఫాంహౌస్‌లో సేద్యం పనులు చేయడం తెలిసిందే. చదవండి: కోవిడ్ ఎఫెక్ట్: హీరోయిన్ పెళ్లి వాయిదా చదవండి: నావి దొంగిలించవద్దు: నటుడికి సమంత సూచన -
Milk Wasted: 2 వేల లీటర్లు నేల‘పాలు’
దొడ్డబళ్లాపురం: నాణ్యత లేదనే సాకుతో దొడ్డ పట్టణంలోని పాల శీతలీకరణ కేంద్రంలో 2 వేల లీటర్ల పాలను మురుగుకాలువలో పారబోశారు. బమూల్ సిబ్బంది చర్యను పాల రైతులు తీవ్రంగా ఖండించారు. దొడ్డ తాలూకాలో రైతుల నుండి తీసుకుంటున్న పాలలో నాణ్యత లోపించిందని సిబ్బంది చెప్పారు. ఎస్ఎన్ఎఫ్ 8.5 కంటే తక్కువైతే పాలపొడి తయారీకి పనికిరావన్నారు. పొదుగువాపు రోగం ఉన్న ఆవుల నుండి తీసిన పాలు, పాచి కట్టిన క్యాన్లలో తీసుకువచ్చే పాలు వేస్తుండడం వల్ల పాలు నాణ్యత లోపిస్తున్నాయన్నారు. నేలపాలు చేయడానికి బదులు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉచితంగా అందజేసినా బాగుండేదని రైతులు అన్నారు. -
చిన్నారిపై సవతి తండ్రి కర్కశం: దెబ్బలకు తాళలేక..
దొడ్డబళ్లాపురం: ఆరేళ్ల కుమారుడు అల్లరి చేస్తున్నాడని సవతి తండ్రి బెల్టుతో చితకబాదడంతో మృత్యువాతపడిన సంఘటన నెలమంగల తాలూకా బిన్నమంగలలో చోటుచేసుకుంది. బిన్నమంగల నివాసి నేత్ర కుమారుడు హర్షవర్ధనన్ (6) మృతిచెందిన బాలుడు. నేత్ర మొదటి భర్తకు కలిగిన కుమారుడు హర్షవర్ధన్ కాగా, ఈమె మొదటి భర్తను వదిలేసి రెండు నెలల కిందట కార్తీక్ (23) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే హర్షవర్ధన్ అల్లరి చేస్తున్నాడని కార్తీక్ తరచూ కొట్టేవాడు. ఆదివారం సాయంత్రం బాలున్ని ఇదే కారణంతో కార్తీక్ బెల్టు తీసుకుని చితకబాదాడు. దీంతో బాలుడు తీవ్ర రక్త గాయాలతో ఇంట్లోనే మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్‌ను అరెస్టు చేశారు. -
అనుమానించాడు.. హతమార్చాడు
దొడ్డబళ్లాపురం : భార్య శీలాన్ని శంకించిన భర్త అనుమానం పెనుభూతమై ఆమెను కొడవలితో నరికి హత్యచేసి పరారైన సంఘటన మాగడి తాలూకా హాలశెట్టిహళ్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నెలమంగల తాలూకా చిక్కనాయకనపాళ్య గ్రామానికి చెందిన మంజుల, రేవణ్ణ దంపతుల కుమార్తె పూర్ణిమ (24)హత్యకు గురైంది. పూర్ణిమను 2018 నవంబర్‌లో మాగడి తాలూకా హాలశెట్టిహళ్లికి చెందిన గంగాధరయ్య కుమారుడు నాగరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. పూర్ణిణమ బెంగళూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేది. నాగరాజు గ్రామంలోనే వ్యవసాయం చేసుకునేవాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న నాగరాజు నిత్యం ఆమెతో గొడవపడేవాడు. బుధవారం సాయంత్రం భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నాగరాజు ఆవేశం పట్టలేక కొడవలితో భార్యను నరికి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు. బయటకు వెళ్లిన నాగరాజు తండ్రి గంగాధరయ్య రాత్రి ఇంటికి వచ్చి చూడగా పూర్ణిమ రక్తం మగుడులో కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్సై వెంకటేశ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నాగరాజు కోసం గాలిస్తున్నారు. -
అప్పుడు భార్యను .. ఇప్పుడు బిడ్డలను..
దొడ్డబళ్లాపురం : కన్న తండ్రే బిడ్డలను చంపడానికి వచ్చిన సంఘటన దేవనహళ్లి తాలూకా యలియూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం భార్యను చంపేశాడు. ఇప్పుడు కూమారులను చంపడానికి ప్రయత్నించిన నిందితుడిని గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. శిడ్లఘట్ట తాలూకా సంతెకల్లహళ్లికి చెందిన శ్రీనాథ్(35) కన్నబిడ్డలను కడతేర్చడానికి ప్రయత్నించిన తండ్రి. 10 సంవత్సరాల క్రితం శ్రీనాథ్ ప్రభావతిని వివాహం చేసుకున్నాడు. నాటి నుంచి శ్రీనాథ్ భార్యను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేసేవాడు. రెండేళ్ల క్రితం భార్యను హత్య చేసి శ్రీనాథ్ జైలుపాలయ్యాడు. అప్పటికే వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఆ పిల్లలను ప్రభావతి తల్లితండ్రులు తీసికెళ్లి పోషిస్తున్నారు. రెండు రోజుల క్రితమే బెయిల్ పై విడుదలైన శ్రీనాథ్ మంగళవారం ఉదయం తప్పతాగి కత్తితీసుకుని తన ఇద్దరు పిల్లలను హత్య చేయడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న చెన్నరాయపట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి కూడా శ్రీనాథ్ పిల్లలను చంపేస్తానంటూ సైకోలా ప్రవర్తించాడు. అతి కష్టంమీద పోలీసులు శ్రీనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
తృటిలో జబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సును రైలు డీకొని చిన్నారుల మరణించిన ఘోర సంఘటన కళ్ల ముందు మెదులుతుండగానే.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో మరోసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది. అదృష్టవశాత్తూ ఈసారి పెద్ద ప్రమాదమే తప్పింది. కాపాలేని రైల్వే క్రాసింగ్ వద్ద జబల్పూర్ ఎక్స్‌ప్రెస్ జేసీబీని డీకొంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దున గల కర్ణాటకలోని దొడ్డబళాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవగా, రైలు ఇంజిన్ దెబ్బతింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.