
దొడ్డబళ్లాపురం: ఆరేళ్ల కుమారుడు అల్లరి చేస్తున్నాడని సవతి తండ్రి బెల్టుతో చితకబాదడంతో మృత్యువాతపడిన సంఘటన నెలమంగల తాలూకా బిన్నమంగలలో చోటుచేసుకుంది. బిన్నమంగల నివాసి నేత్ర కుమారుడు హర్షవర్ధనన్ (6) మృతిచెందిన బాలుడు. నేత్ర మొదటి భర్తకు కలిగిన కుమారుడు హర్షవర్ధన్ కాగా, ఈమె మొదటి భర్తను వదిలేసి రెండు నెలల కిందట కార్తీక్ (23) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే హర్షవర్ధన్ అల్లరి చేస్తున్నాడని కార్తీక్ తరచూ కొట్టేవాడు. ఆదివారం సాయంత్రం బాలున్ని ఇదే కారణంతో కార్తీక్ బెల్టు తీసుకుని చితకబాదాడు. దీంతో బాలుడు తీవ్ర రక్త గాయాలతో ఇంట్లోనే మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment