Punished
-
ఉద్యోగులందర్ని నిలబెట్టి పనిష్ చేసిన సీఈవో
-
పెళ్లికి పిలుస్తలేరు.. చావుకు చెప్తలేరు!
మానకొండూర్ రూరల్: ఊరిలో ఆ కులానివి దాదాపు 50 గడపలు. శుభకార్యమైనా.. అశుభ కార్యమైనా అందరూ కలసికట్టుగా హాజరవుతారు. అయితే పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినలేదని, వారి తీర్పును తిరస్కరించారని కులం నుంచి ఓ కుటుంబాన్ని బహిష్కరించారు. ఏడాదికాలంగా గ్రామంలో పెళ్లయినా, చావైనా వీరిని పిలవడంలేదు. బాధిత కుటుంబం కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాదాసు సంపత్ కుటుంబానికి ఊరిలో వారసత్వంగా వచ్చిన 1.03 ఎకరాల వ్యవసాయ భూమి అతని తండ్రి కొమురయ్య పేరున ఉంది. 2014లో సంపత్ తండ్రి కొమురయ్య మరణించాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అడప శ్రీనివాస్ ఆ భూమి విషయంలో సంపత్తో గొడవకు దిగాడు. స్థానిక కోర్టుకు వెళ్లడంతో తీర్పు సంపత్‌కు అనుకూలంగా వచ్చింది. దీంతో తమ భూమిని సాగు చేసేందుకు అతను వెళ్లాడు. అయితే.. అడప శ్రీనివాస్, సంపత్‌ను అడ్డుకుని.. దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో ఇరువురూ పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై ఇద్దరూ ఏడాది క్రితం గ్రామంలోని పంచాయితీ పెద్దలను ఆశ్రయించారు. వారు ఇరువర్గాలు రూ.50 వేలు డిపాజిట్ పెట్టాలని సూచించారు. సంపత్ తనవద్ద అంతమొత్తం లేవని, రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో తాము చెప్పినట్లు వినలేదని పంచాయితీ పెద్దలు సంపత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి వారి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలోని తమ కులస్తులు ఏడాదికాలంగా తమను ఎలాంటి కార్యాలకు పిలవకపోవడంతో మనోవేదనకు గురవుతున్నట్లు సంపత్ కుటుంబం వెల్లడించింది. కుల బహిష్కరణ చేసిన 11 మంది పంచాయితీ పెద్దలపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఆయన ఇటీవల సీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాడు. -
Viral Video: పిలవని పెళ్ళికి వెళ్లినందుకు.. పనిష్మెంట్ ఇచ్చారు ..!
-
చిన్నారిపై సవతి తండ్రి కర్కశం: దెబ్బలకు తాళలేక..
దొడ్డబళ్లాపురం: ఆరేళ్ల కుమారుడు అల్లరి చేస్తున్నాడని సవతి తండ్రి బెల్టుతో చితకబాదడంతో మృత్యువాతపడిన సంఘటన నెలమంగల తాలూకా బిన్నమంగలలో చోటుచేసుకుంది. బిన్నమంగల నివాసి నేత్ర కుమారుడు హర్షవర్ధనన్ (6) మృతిచెందిన బాలుడు. నేత్ర మొదటి భర్తకు కలిగిన కుమారుడు హర్షవర్ధన్ కాగా, ఈమె మొదటి భర్తను వదిలేసి రెండు నెలల కిందట కార్తీక్ (23) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే హర్షవర్ధన్ అల్లరి చేస్తున్నాడని కార్తీక్ తరచూ కొట్టేవాడు. ఆదివారం సాయంత్రం బాలున్ని ఇదే కారణంతో కార్తీక్ బెల్టు తీసుకుని చితకబాదాడు. దీంతో బాలుడు తీవ్ర రక్త గాయాలతో ఇంట్లోనే మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్‌ను అరెస్టు చేశారు. -
కోవిడ్ రూల్స్ బ్రేక్: కాళ్లు మొక్కిన దళితులు
చెన్నె: అణగారిన వర్గాలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. అణగారిన వర్గాలను మరింత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని దళితులతో కాళ్లు మొక్కించుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మే 12వ తేదీన తిరువన్నెనల్లూరు సమీపంలోని ఒట్టనందల్ గ్రామంలో దళిత కుటుంబాలు గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు. అయితే కరోనా నేపథ్యంలో అనుమతి లేకుండా ఉత్సవాలు జరిపారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీనిపై గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం కోర్టుకు వెళ్లారు. వారిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి పంపించేసింది. అయితే పంచాయతీ పెద్దలు మాత్రం తమ ముందుకు హాజరుకావాలని ఆదేశించారు. పంచాయతీ కోర్టు గ్రామ పెద్దలను కలిసి వారి కాళ్లపై పడాలని ఆదేశించింది. ఈ తీర్పుతో దళితులు తిరుమల్, సంతానం, అరుముగం పంచాయతీ సభ్యుల కాళ్లపై పడి క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనపై దళిత, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
లెక్క చేయలేదని చితక్కొట్టారు!
బుట్టాయగూడెం : లెక్క చేయలేదని ఓ విద్యార్థిని స్థానిక రాజీవ్ నగర్ కాలనీ ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టినట్టు సమాచారం. సేకరించిన వివరాల ప్రకారం.. బుట్టాయగూడెం రాజీవ్ నగర్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో ఓదూరి సాయి చరణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. గతంలో చరణ్ రాజమండ్రిలో ఇంగ్లిష్‌మీడియం పాఠశాలలో చదివేవాడు. ఈ ఏడాది తల్లిదండ్రులు అతడిని ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు. ఈనేపథ్యంలో బుధవారం లెక్కల మాస్టారు బోర్డుపై భాగాహారం చేస్తూ.. చరణ్‌ను చదవాలని చెప్పారు. తనకు తెలీదని, ఇంగ్లిష్‌లో చెప్పాలని చరణ్ సమాధానమిచ్చాడు. దీంతో ఉపాధ్యాయుడికి కోపం వచ్చి తీవ్రంగా కొట్టినట్టు తెలిసింది. చరణ్‌కు బలమైన దెబ్బతగిలినట్టు, కుటుంబ సభ్యులు సాయి చరణ్‌ను బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సలహా మేరకు జంగారెడ్డిగూడెం ఎముకల ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. విషయం రాత్రి 8గంటల వరకూ బయటకు రాలేదు. ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లిదండ్రులు రాజీ చేసుకున్నట్టు తెలిసింది. -
ఇంగ్లిష్‌లో మాట్లాడలేదని...!
గువాహటి: మాతృభాషలో మాట్లాడటమే ఈ చిన్నారుల నేరమైంది. ఆంగ్లంలో మాట్లాడాలన్న నిబంధనను ఉల్లంఘిస్తారా అంటూ ఏకంగా 13 మంది విద్యార్థులను తీవ్రంగా శిక్షించింది ఓ ప్రైవేటు పాఠశాల. ఈ ఘటన అసోం రాజధాని గువాహటిలో బుధవారం జరిగింది. గువాహటిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 13 మంది విద్యార్థులు మాతృభాష అస్సామీలో మాట్లాడినందుకు స్కూల్ యాజమాన్యం కన్నెర్రజేసింది. తమ స్కూల్లో ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలన్న నిబంధనను ఉల్లంఘించినందుకు ఆ విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా అడ్డుకుంది. దాదాపు 90 నిమిషాలపాటు నిలిపి ఉంచింది. కాథలిక్ ఆధ్వర్యంలోని స్కూల్లో జరిగిన ఈ ఘటనపై అసోం జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. మాతృభాషలో మాట్లాడినందుకు విద్యార్థులను శిక్షించిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రతిమ రంగ్‌పిపిని ఆదేశించినట్టు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎం అంగముత్తు తెలిపారు. అన్ని ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రాథమిక భాషగా అస్సామీని తప్పకుండా బోధించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. -
’ప్రిన్సిపాల్‌కు శిక్ష పడాల్సిందే’
-
వేములవాడలోఆటోదొంగకి దేహశుద్ది
-
అత్యాచార నిందితులను శిక్షించాలి: ఐద్వా
హైదరాబాద్: మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా) తెలంగాణ కమిటీ నేతలు కేఎస్ ఆశాలత, హైమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలో ఓ మహిళ అత్యాచారానికి గురికావడం దారుణమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇలా జరిగిందంటే మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత ఏవిధంగా ఉందో స్పష్టమవుతోందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి వెంటనే శిక్షించే విధంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.