అత్యాచార నిందితులను శిక్షించాలి: ఐద్వా | Punished accused of rape: AIDWA | Sakshi
Sakshi News home page

అత్యాచార నిందితులను శిక్షించాలి: ఐద్వా

Published Sat, Mar 7 2015 4:44 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Punished accused of rape: AIDWA

హైదరాబాద్: మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా) తెలంగాణ కమిటీ నేతలు కేఎస్ ఆశాలత, హైమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలో ఓ మహిళ అత్యాచారానికి గురికావడం దారుణమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇలా జరిగిందంటే మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత ఏవిధంగా ఉందో స్పష్టమవుతోందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి వెంటనే శిక్షించే విధంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement