AIDWA
-
Kiran Royal: ‘మరీ ఇంత అన్యాయమా?’
తిరుపతి, సాక్షి: కూటమి నేతలకు పోలీసులు తలొగ్గుతున్నారని, జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో.. తిరుపతి ఎస్పీని కలిసి స్పందన ద్వారా మరోసారి ఫిర్యాదు చేశారు.ఒక మహిళ తనకు జరిగిన అన్యాయంపై ప్రత్యక్షంగా.. ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చింది. అయినా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడికే అండగా ఎందుకు నిలబడుతున్నారు?. కూటమి నేతలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? ఇదెక్కడి న్యాయం? అని ఐద్వా మహిళలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తక్షణమే కిరణ్ రాయల్‌పై చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్ట్ చేయాలని ఐద్వా నాయకురాలుసాయిలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.పవన్‌కు అత్యంత సన్నిహితుడు, తిరుపతి జనసేన ఇంఛార్జి అయిన కిరణ్‌రాయల్.. తన నుంచి రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా, పైగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. అయితే ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. నాటకీయ పరిణామాల నడుమ జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కిరణ్‌రాయల్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: కిరణ్ రాయల్‌కు ముందే ఎలా తెలుసు? -
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది
-
రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేయాలి
అనంతపురం : ఐద్వా నాయకులురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మపై తక్షణం కేసు నమోదు చేసి అరెస్టు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. మంత్రిని ఆదివారం ఆయన స్వగృహంలో ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి ఇతర నాయకురాళ్లు, నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్‌గోపాల్ వర్మ ఇంగ్లీషులో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) అనే డిజిటల్ పోర్స్ సినిమా నిర్మించారన్నారు. దాని ట్రైలర్ యూటూబ్‌లో విడుదల చేశారన్నారు. ఆ సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్‌గోపాల్‌వర్మ ఐద్వా నాయకురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, వారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా వ్యహరించిన ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకురాళ్లు యమున, చంద్రిక, రామాంజినమ్మ, వైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు నూరుల్లా, బాలకృష్ణ, పి.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల కంటే గోరక్షణకే ప్రాధాన్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గోరక్షణకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఇస్తున్న ప్రాధాన్యాన్ని మహిళల రక్షణకు ఇవ్వడం లేదని ఐద్వా మండిపడింది. దేశంలో పెరుగుతున్న అసహనపూరిత వాతావరణం, మహిళలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల సాధనకు ఐద్వా ఆధ్వర్యంలో సేవ్ ఇండియా పేరుతో శుక్రవారం ఢిల్లీలో సదస్సు జరిగింది. వివిధ రాష్ట్రాల్లో దాడులకు గురైన బాధిత మహిళలు, వారి కుటుంబ సభ్యులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మాట్లాడుతూ.. గోవులను తరలిస్తున్నారన్న కారణంతో అమాయకుల ప్రాణాలు తీస్తున్న హిందూత్వ శక్తులు.. దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళలపై దాడులను, అత్యాచారాలను నిరోధించడానికి ఏర్పాటు చేసిన నిర్భయ నిధిని ఖర్చు చేయకుండా.. గోరక్షణకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేసి భారీగా నిధులు వెచ్చిస్తున్నారని ఆమె మండిపడ్డారు. హిందుత్వం ముసుగులో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. మహి ళల హక్కుల సాధనకు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇందులో భాగంగా ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేస్తామని ఐద్వా సభ్యురాలు పుణ్యవతి పేర్కొన్నారు. -
30 నుంచి మద్యంపై యుద్ధం
– ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మద్యంపై యుద్ధాన్ని ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ, జిల్లా కార్యదర్శి ఎన్.అలివేలు పేర్కొన్నారు. శనివారం కార్మిక, కర్షక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు జిల్లాలో 35 బార్లు, 203 వైన్ షాపులు, 2,000లకుపైగా బెల్టుషాపులు ఉన్నాయన్నారు. వీటిలో చాలా దుకాణాలు ప్రజల ఆవాసాలు, గుడులు, బడులకు వెయ్యి మీటర్లలోపే ఉన్నాయన్నారు. ఇది మద్యం పాలసీకి వ్యతిరేకమని, ప్రజలకు ఇబ్బంది కలిగించే షాపులను 30వ తేదీలోపు తొలగించాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో మద్యాన్ని నియంత్రిస్తానని, బెల్టుషాపులను పూర్తిగా ఎత్తివేస్తానని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత మరచిపోయారన్నారు. కర్నూలులో నిబంధనలు ప్రకారం ఎక్కడా మద్యం షాపులు లేవన్నారు. వీటిని వెంటనే రద్దు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా మహిళలు కేఎస్ పద్మ, సుజాత, ఉమా, అరుణ పాల్గొన్నారు. -
పరువు హత్యలపై చట్టం చేయాలి
రాష్ట్ర ఐద్వా నేతల డిమాండ్ అమలాపురం రూరల్ (అమలాపురం) : రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న పరువు హత్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టం చేయాలని ఐద్వా రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో పాల్గొన్న రాష్ట్ర మహిళా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండలంలోని భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తోన్న ఈ తరగతుల్లో ఆదివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చోటు చేసుకున్న పరువు హత్య కేసులను జిల్లాల వారీగా చర్చించారు. ఈ ప్రధాన సమస్యతో పాటు మహిళా సమస్యలను నిరసిస్తూ భట్లపాలెంలో ఐద్వా మహిళలు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. పరువు హత్యలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్ చేశారు. పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును ఆమోదించాలని కోరారు. ‘మహిళా సమస్యలు... పరిష్కార మార్గాలు’అంశంపై సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.స్వరూపరాణి ప్రసంగించారు. మహిళల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ఆస్తుల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర నాయకురాలు నండూరి రూపావాణి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని... అలాంటి మహిళలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ సమాజంలో మూఢ నమ్మకాలు...మద్యం అనర్ధాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మెజీషియన్ సీహెచ్ శ్రీరాములు, జన విజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ ఎ.కృష్ణశ్రీ, జిల్లా కార్యదర్శి వీఎస్ఎన్ రెడ్డి తదితరులు మహిళా చైతన్యం, విజ్ఞానం అంశాలపై వివిధ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. శిక్షణ తరగతులు సోమవారం కూడా ఇదే వేదికపై కొనసాగుతాయని ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి చెప్పారు. నాలుగో రోజు మంగళవారం ముగింపు కార్యక్రమాన్ని అంతర్వేదిలో నిర్వహిస్తామన్నారు. ఐద్వా నాయకురాళ్లు విజయమ్మ, మాధవి, అలివేలు, ఇందిర, సావిత్రి, తులసి, అరుణ, ఆదిలక్ష్మి, కుడుపూడి రాఘవమ్మ తరగతుల్లో ప్రసంగించారు. సీపీఐ డివిజన్ కార్యదర్శి మోర్త రాజశేఖర్, కార్మిక నాయకుడు పచ్చిమాల వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మద్య నిషేధం ఏదీ బాబు?
- ఐద్వా రాష్ట్ర మహాసభల్లో అధ్యక్షురాలు ప్రభావతి ప్రశ్న అమలాపురం రూరల్: ఎన్నికలకు ముందు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని..బెల్ట్ షాపులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ హామీలే మరిచారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.ప్రభావతి అన్నారు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఐద్వా శిక్షణ తరగతులకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతులను జ్యోతి ప్రజ్వలనచేసి ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని...మహిళలు మద్య నిషేధం కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రభావతి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఊరూ వాడా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ గ్రామాలను మద్యం మయం చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 1993–94 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. బాబు పాలనలో దానికి విరుద్ధంగా మద్యం అమ్మకాలను విచ్చల విడి చేసి ఖాజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ మద్యం వల్ల మహిళల బతుకులు అస్తవ్యస్తంగా మారాయని, భర్త సంపాదనలో అధిక శాతం మద్యానికే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల పరిశ్రమల్లో సరైన భద్రత లేకే మహిళలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా నాయకురాలు అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, జిల్లా ఉపాధ్యక్షురాలు కుడుపూడి రాఘవమ్మ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు కేవీవీ సత్యనారాయణ, మద్యం వ్యతిరేక కమిటీ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ, ఐద్వా లీగల్ కార్యదర్శి శిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
10 నుంచి ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు
గుత్తి: మధ్యప్రదేశ్ రాజధాని బోపాల్‌లో డిసెంబర్10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ఐద్వా ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు సునీత, రేణుక, శ్రీదేవి, నిర్మల పిలుపునిచ్చారు. పట్టణంలోని జడ్ వీరారెడ్డి కాలనీలో శనివారం ఐద్వా జెండాను ఆవిష్కరించారు. మహసభలకు సంబంధించిన జీపు జాతా డిసెంబర్ 5న గుత్తికి వస్తోందన్నారు. -
పేదలతో ప్రభుత్వం చెలగాటం
► ధరలను నియంత్రించడంలో విఫలం ► ధ్వజమెత్తిన ఐద్వా నాయకురాళ్లు ► కూరగాయల బండితో వినూత్న నిరసన అనంతపురం అర్బన్ : పేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజల జీవి తాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నా యకురాళ్లు ధ్వజమెత్తారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, కాయగూరలను నియంత్రించడంలో పూర్తి విఫలమైయ్యిందని మండిపడ్డారు. కడుపులు కట్టేసుకుని ఉప్పుకి పప్పుకి దూరమై బతికే పరిస్థితి కల్పించిందని దుమ్మెత్తిపోశారు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, కాయగూరల ధరలను నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో శనివారం నగరంలో వినూత్నంగా కూరగాయల బండితో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి మాట్లాడారు. నిత్యావసర వస్తువులు, కాయగూరల ధరలు భారీగా పెరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నడూ లేనంతగా కందిపప్పు, మినపపప్పు, టమాట, పచ్చిమిర్చి ఇలా అన్ని రకాల సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయని, దీంతో పేదలు తిండి కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ధరలను అదుపు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి చంద్రిక, నాయకురాళ్లు రామాంజినమ్మ, అరుణ, దిల్షాద్, విజయ, లక్ష్మిదేవి, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
రావెల సుశీల్‌ను అరెస్టు చేయాలి
ఐద్వా డిమాండ్ సాక్షి, విజయవాడ బ్యూరో : మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు రావెల సుశీల్ ఒక మహిళా టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన కేసు నుంచి తప్పించుకునేందుకు అధికారులను లోబరుచుకునే ప్రయత్నాలు చేయడాన్ని మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. బజారులో నడుస్తున్న మహిళను వాహనంలో వెంబడించడమే కాకుండా డ్రైవర్ సాయంతో ఆమెను కారులోకి బలవంతంగా లాగే ప్రయత్నం చేయడం దారుణమని పేర్కొన్నారు. పైగా వారిద్దరు తప్పతాగి ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారని తెలిపారు. సుశీల్‌ను, అతని కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని వివరించారు. అయినా మంత్రి కొడుకును తప్పించి కారు డ్రైవర్‌ను మాత్రమే అదుపులోకి తీసుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పైగా బాధితులను నిందితులుగా మార్చి భయపెట్టి, వారిపై ఒత్తిడి చేయడంతో పాటు కారు ధ్వంసం చేసినట్టు తిరిగి వారిపై మంత్రి అనుచరులు కౌంటర్ ఫిర్యాదు చేయడం దారుణమని పేర్కొన్నారు. మంత్రి తన అధికారాన్ని దుర్వినియోగపరిచి కొడుకును స్టేషన్ నుంచి తీసుకొచ్చి కేసులో అరెస్టు కాకుండా చూస్తున్నారని ఆరోపించారు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా టీచర్‌ను లైంగికంగా వేధించిన అతని కొడుకును పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఐద్వా నాయకులు ప్రభావతి, రమాదేవి డిమాండ్ చేశారు. -
ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న ధర్నా
విశాఖ: రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఉల్లి ఎగుమతులను వెంటనే నిలిపివేయాలని, నిత్యవసర సరుకుల ధరలను పేదప్రజలకు అందుబాటులోకి తేవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని లేకపోతే రేషన్ షాపుల ద్వారా సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా.. కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన త్రాసు పలువురిని ఆకర్షించింది. సంచి నిండా డబ్బులు తీసుకెళ్తే.. జేబు నిండా ఉల్లిపాయలు కూడా రావడం లేదనే ఉద్దేశంతో ఈ త్రాసును ఏర్పాటు చేశారు. -
ఏపీ సర్కార్ విదానాలపై ఐద్వా ఫైర్
-
అత్యాచార నిందితులను శిక్షించాలి: ఐద్వా
హైదరాబాద్: మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం (ఐద్వా) తెలంగాణ కమిటీ నేతలు కేఎస్ ఆశాలత, హైమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలో ఓ మహిళ అత్యాచారానికి గురికావడం దారుణమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇలా జరిగిందంటే మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత ఏవిధంగా ఉందో స్పష్టమవుతోందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి వెంటనే శిక్షించే విధంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.