రామ్‌గోపాల్ వర్మ
అనంతపురం : ఐద్వా నాయకులురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మపై తక్షణం కేసు నమోదు చేసి అరెస్టు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును ఐద్వా, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. మంత్రిని ఆదివారం ఆయన స్వగృహంలో ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి ఇతర నాయకురాళ్లు, నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్‌గోపాల్ వర్మ ఇంగ్లీషులో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్‌టీ) అనే డిజిటల్ పోర్స్ సినిమా నిర్మించారన్నారు. దాని ట్రైలర్ యూటూబ్‌లో విడుదల చేశారన్నారు. ఆ సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్‌గోపాల్‌వర్మ ఐద్వా నాయకురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, వారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా వ్యహరించిన ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకురాళ్లు యమున, చంద్రిక, రామాంజినమ్మ, వైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నూరుల్లా, బాలకృష్ణ, పి.రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment