God Sex and Truth
-
రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేయాలి
అనంతపురం : ఐద్వా నాయకులురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మపై తక్షణం కేసు నమోదు చేసి అరెస్టు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. మంత్రిని ఆదివారం ఆయన స్వగృహంలో ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి ఇతర నాయకురాళ్లు, నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్‌గోపాల్ వర్మ ఇంగ్లీషులో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) అనే డిజిటల్ పోర్స్ సినిమా నిర్మించారన్నారు. దాని ట్రైలర్ యూటూబ్‌లో విడుదల చేశారన్నారు. ఆ సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్‌గోపాల్‌వర్మ ఐద్వా నాయకురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, వారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా వ్యహరించిన ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకురాళ్లు యమున, చంద్రిక, రామాంజినమ్మ, వైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు నూరుల్లా, బాలకృష్ణ, పి.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్జీవీ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద అశ్లీల వెబ్ సిరీస్ ‘జీఎస్టీ’పై నమోదైన కేసులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) విచారణ వాయిదా పడింది. ఇప్పటికే ఓసారి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న ఆయన శుక్రవారం రెండోసారి హాజరుకావాల్సి ఉంది. తొలి రోజు విచారణలో ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించిన విషయం తెలిసిందే. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే వర్మను ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు సమాచారం అందించారు. ఈలోపు జీఎస్టీకి వర్మకు ఉన్న సంబంధాలను ఆరా తీసేందుకు ఈ వెబ్ సిరీస్‌కు పనిచేసిన మరికొందరిని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణలో తగిన ఆధారాలు లభిస్తే వర్మను అరెస్టు చేయాలా? లేక న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసి కోర్టు ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలా? అనే అంశంపై న్యాయనిపుణుల్ని సంప్రదిస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే వర్మను ప్రశ్నిస్తే మరిన్ని కీలకాంశాలు రాబట్టడంతో పాటుగా తదుపరి చర్యలు తీసుకోవానికి ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
వర్మపై మరో కేసు.. వారంలోగా అరెస్ట్ చేయకపోతే!
సాక్షి, ద్వారకానగర్ (విశాఖపట్నం) : వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ విశాఖలో మహిళా సంఘాలు కొనసాగించిన దీక్షపై పోలీసులు ఎట్టకేకలకు స్పందించారు. దర్శకుడు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మహిళా సంఘాలు తమ నిరాహార దీక్షను ముగించారు. అయితే వారం రోజుల్లోగా రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని మహిళలు తెలిపారు. కాగా, వర్మకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో మహిళా సంఘాలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ వర్మపై ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 504, 509 కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్మపై సెక్షన్ 306, 354 ఏ, 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళల దీక్షతో ఎట్టకేలకు పోలీసులు మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ‘గాడ్ సెక్స్ ట్రూత్’ పేరిట వర్మ వివాదాస్పద సినిమా తీయడంతో పాటు టీవీ చర్చలలో మాట్లాడుతూ మహిళా సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి వర్మను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏపీలోనూ వర్మపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వర్మను అరెస్టు చేయాల్సిందే!
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ) : సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ రెండోరోజు గురువారం కూడా మహిళా సంఘాలు తమ దీక్ష కొనసాగించాయి. వర్మకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో మహిళా సంఘాలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు వర్మపై ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 504, 509 కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్మపై సెక్షన్ 306, 354 ఏ, 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ డిమాండ్ చేస్తున్నాయి. ‘గాడ్ సెక్స్ ట్రూత్’ పేరిట వర్మ వివాదాస్పద సినిమా తీయడం.. ఈ సినిమాపై టీవీ చర్చల సందర్భంగా మహిళా సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసులలో ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వర్మను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ వర్మపై కేసులు నమోదుకావడం ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. రాంగోపాల్‌వర్మను తీవ్రంగా శిక్షించాలని, లైంగిక స్వేచ్ఛ మహిళలకు కావాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అతనిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. మహిళా సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మణి, లక్ష్మి, విమల, మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వర్మ వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళాలపై దాడులు, చిన్నారులపై హత్యలు, యువతులపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మహిళా నేతలు శ్రీదేవి వర్మ, షబీరా బేగం, శశికళ, పీవోడబ్ల్యూ నేతలు, పలు సంఘాల మహిళలు పాల్గొన్నారు. కాగా, వర్మపై ఐద్వా మహిళా సంఘం నాయకురాలు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీజోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఆ చానెల్‌పై క్రిమినల్ కేసులు వేస్తా: వర్మ
సాక్షి, ముంబై: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ న్యూస్ చానెల్‌పై కన్నెర్ర జేశారు. టీవీ9 చానెల్‌పై క్రిమినల్ అభియోగాలతో పలు కేసులు దాఖలు చేయనున్నట్టు ఆయన తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆ ప్రక్రియలో ఉన్నానని, తన లాయర్లు అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ట్వీట్లో తెలిపారు. కించపరిచే దురుద్దేశంతో టీవీ9 వాస్తవాలను వక్రీకరించి.. తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న విచారణ గురించి న్యూస్లీకులు ఇవ్వడం కూడా నేరమేనని, ఇందుకు టీవీ9ను చట్టప్రకారం ఎదుర్కొంటానని వర్మ పేర్కొన్నారు. టీవీ9 మూర్ఖపు కథనాలు ప్రసారం చేస్తోందని, ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్‌లో ఆ కథనాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నానని అంతకుముందు వర్మ ట్వీట్ చేశారు. టీవీ9 పేరును టీవీ9 సర్కస్ జోకర్స్‌గా మార్చాలంటూ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సదరు చానెల్‌పై వర్మ కేసులు దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల వివాదాస్పద ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ వెబ్సినిమా విషయంలో వర్మ హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అడల్ట్ చిత్రంపై కొన్ని టీవీ చానెళ్ల చర్చల సందర్భంగా వర్మ సామాజిక కర్త దేవి, ఐద్వా నేత మణిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మను సీసీఎస్ పోలీసులు మూడు గంటలపాటు విచారించారు. -
జీఎస్టీ కేసులో వర్మ ల్యాప్‌టాప్ సీజ్
-
సీసీఎస్‌లో ముగిసిన రామ్‌గోపాల్ వర్మ విచారణ
-
నాకు పోలీసు అధికారిగా నటించాలనుంది!
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాదాలను రేపిన గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) అనే వెబ్ సిరీస్ విషయంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు ముడుగంటలపాటు వర్మను పోలీసులు విచారించారు. 25 నుంచి 30 ప్రశ్నలు అడిగారు. ఆయన ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసుల ఎదుట తన విచారణపై అనంతరం వర్మ సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో స్పందించారు. ఈ విచారణ పట్ల తాను చాలా ఆనందంగా (అమేజింగ్ హ్యాపీ) ఉన్నట్టు ట్వీట్ చేశారు. సీసీఎస్ బృందం ప్రొఫెషనలిజం ఎంతగానో నచ్చిందని, థ్రిల్ అయ్యానని.. సీసీఎస్ పోలీసులు తనను విచారిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. పోలీసు అధికారి పాత్రలో నటించినట్టు తనకు అనిపిస్తోందని, ఈ మేరకు తన కోరికను దర్శకులందరూ పరిగణనలోకి తీసుకోవాలని మరో ఫొటోతో ట్వీట్ చేశారు. ఈ కామెంట్‌కు దర్శకుడు పూరీ జగన్నాథ్ వెంటనే స్పందించారు. స్క్రిప్ట్ రెడీగా ఉంది సర్.. మీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు వర్మ థాంక్స్ కూడా చెప్పారు. జీఎస్టీ వెబ్‌సిరీస్‌లో మహిళలను కించపరిచారని, సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు. వర్మపై దేవి చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
జీఎస్టీ కేసు.. వర్మ ల్యాప్‌టాప్ సీజ్!
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాదాస్పద గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) అనే వెబ్ సిరీస్ తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు శనివారం మూడుగంటపాలు విచారించారు. పోలీసుల విచారణ ముగిసిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. జీఎస్టీ వెబ్‌సిరీస్‌లో మహిళలను కించపరిచారని, సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు. వర్మపై దేవి చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. వర్మను 25 నుంచి 30 ప్రశ్నలు అడిగామని, అతని ల్యాప్‌ట్యాప్‌ను సీజ్ చేశామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మీడియాకు తెలిపారు. సామాజిక కార్యకర్త దేవిపై ఉద్దేశపూర్వకంగా ఏ వ్యాఖ్య చేయలేదని, టీవీ చర్చలో భాగంగా ఆవేశంలో, ఉద్వేగపూరితంగానే వ్యాఖ్యలు చేశానని వర్మ వివరణ ఇచ్చినట్టు తెలిపారు. వారం తర్వాత వచ్చే శుక్రవారం విచారణకు రావాలని వర్మను ఆదేశించినట్టు తెలిపారు. ‘వర్మపై నమోదైన కేసు ప్రకారమే విచారణ జరిపాం. టెక్నికల్, లీగల్ అంశాలపై వర్మని ప్రశ్నించాం. జీఎస్టీ అనే వీడియోని ఏ దేశంలో పోస్టు చేసి విడుదల చేశారో ప్రశ్నించాం. జీఎస్టీని పోలాండ్, యూకేలో తీశామని వర్మ చెప్పారు. వెబ్‌లో విడుదల చేసిన మియా మల్కోవా నగ్న ఫోటోలను ఎక్కడ తీశారో ప్రశ్నించాం. ఆ ఫోటోలు తను వేరే చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు కలిసి తీసుకున్నానని వర్మ తెలిపారు. ఆ ఫోటోలను, సినిమా వీడీయోకి సంబంధించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ కి పంపించాం’ అని ఆయన వివరించారు. వర్మ పాస్‌పోర్ట్ వెరీఫై చేస్తామని, అతను నిజంగానే ఇతర దేశాలకి వెళ్లి జీఎస్టీని తీశాడా లేదా ఇక్కడే ఉండి తీశాడా అన్నది విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఇంకా మిగతా టెక్నికల్ ఆధారాలకి సంబంధించి మూడు రోజుల సమయం కావాలని వర్మ కోరారని, ఈ విషయంలో లీగల్ సలహా తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన రామ్‌గోపాల్ వర్మ
-
వర్మకు సీసీఎస్ పోలీసుల 10 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వెబ్ సిరీస్ వివాదానికి సంబంధించి నమోదైన కేసు విచారణ కోసం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు శనివారం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీఎస్ పోలీసులు ఆయనకు 10 ప్రశ్నలు సంధించారు. జీఎస్టీ సినిమా ఎందుకు తీశారు. సినిమాకు పెట్టుబడి ఎక్కడిది, మహిళలను అశ్లీలంగా ఎందుకు చూపిస్తున్నారు?. ట్విటర్, ఫేస్బుక్లో పోస్టు చేసిన పోర్న్‌స్టార్ మియా మాల్కోవా ఫోటోలు ఎక్కడ నుంచి వచ్చాయి, ఆమెకు డబ్బులు ఎక్కడ నుంచి ఇచ్చారు. సినిమాకు వాడిన ఎక్విప్ మెంట్ ఎక్కడిది...అంటూ వర్మను విచారణలో ప్రశ్నించారు. సీఎస్ పోలీసులు గతంలో ఇచ్చిన నోటీసుకి వర్మ తాను ముంబైలో నాగార్జున సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా అంటూ అడ్వాకేట్ ద్వారా సమాచారం పంపిన విషయం తెలిసిందే. అయితే ఈసారి విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ తప్పదని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ విచారణకు వచ్చారు. కాగా అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జీఎస్టీ వెబ్ సిరీస్ వివాదాలకు కేంద్ర బిందువైంది. దీనికితోడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారం, చర్చల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ మహిళలను అగౌరవపరుస్తూ పలు వ్యాఖ్యలు చేయడంతో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు సంబంధించి బాగ్‌లింగంపల్లికి చెందిన సామాజికవేత్త, మహిళా ఉద్యమ నాయకురాలు పీఏ దేవి గత నెల 25న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అదే రోజు పోలీసులు ఐపీసీలోని 506తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, నిందితుడిగా రాంగోపాల్ వర్మ పేరు పొందుపరిచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించాల్సి ఉండటంతో విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు ముంబైలో ఉన్న రాంగోపాల్ వర్మకు గతంలో నోటీసులు పంపారు. వీటిలో పేర్కొన్న గడువు ప్రకారం వర్మ గత గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చి, దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే తనకు నోటీసులు అందాయని, విచారణకు హాజరుకాలేకపోతున్నానంటూ రాంగోపాల్ వర్మ తన లాయర్ ద్వారా వర్తమానం పంపారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో హాజరుకావడం సాధ్యం కాలేదంటూ వివరణ ఇచ్చారు. మరోసారి నోటీసులు ఇస్తే వచ్చే వారం విచారణకు వస్తానంటూ లాయర్ ద్వారా పేర్కొన్నారు. దీంతో రాంగోపాల్ వర్మకు సైబర్ క్రైమ్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. -
రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
-
రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చర్చా వేదికలో తనను రాంగోపాల్ వర్మ అవమానించారంటూ దేవి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమాను ఎవరైనా అడ్డుకుంటే కొడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత రాత్రి హైదరాబాద్ చేరుకున్న వర్మను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా రాంగోపాల్ వర్మ బూతు సినిమాలు ఇస్తూ సమజాన్ని చెడగొడుతున్నారని ఇటీవల ఓ టీవీ చర్చాక్రమంలో దేవి విమర్శించారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి వర్మ స్పందిస్తూ... దేవి చెత్తగా ఆలోచిస్తారని, సమాజంలోని అన్నివర్గాలకు తానే ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరిస్తారని అన్నారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో టీవీ చర్చల్లో వీరిద్దరూ పరస్పర విభేదించుకున్న విషయం తెలిసిందే. -
రాంగోపాల్ వర్మకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : వివాదాలకు కేంద్ర బిందువు, సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. గాడ్ సెక్స్ ట్రూత్(జీఎస్టీ)పై నమోదైన కేసులో తమ ముందు విచారణకు రావాలని వర్మకి సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఎదుట గురువారం వర్మ హాజరు కావాల్సివుంది. నోటీసు అందుకున్నా తాను విచారణకు హాజరు కాలేనని లాయర్ ద్వారా పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. ముంబైలో నాగార్జున సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, వచ్చే వారంలో మళ్లీ నోటీసు ఇస్తే వస్తానని వర్మ తెలిపినట్లు సమాచారం. రాంగోపాల్ వర్మకి పోలీసులు మళ్లీ నోటీసు ఇవ్వనున్నారు. మహిళలఫై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, మహిళలను పెట్టి న్యూడ్(అశ్లీల) సినిమాలు తీస్తానని అన్నందుకే నోటీసు ఇచ్చామని, దానిఫై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలియజేశారు. -
జీఎస్టీ-2లో నటిస్తా..!
సాక్షి, హైదరాబాద్ : జీఎస్టీ-2(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)లో నటించేందుకు తాను సిద్ధమని యాంకర్, నటి రష్మీ గౌతమ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తే కచ్చితంగా జీఎస్టీ-2లో నటిస్తానని తెలిపారు. బుధవారం ట్విట్టర్ ఫాలోవర్లతో ఆమె కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ‘జీఎస్టీ 2’లో నటిస్తారా?అని ప్రశ్నించారు. దీనికి ఆమె ‘నటిస్తా.. కానీ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాలి’ అని బదులిచ్చారు. అనంతరం మరో అభిమాని మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా? అని అడిగారు. దానికి ఆమె ‘అవును.. ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.