
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాదాలను రేపిన గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) అనే వెబ్ సిరీస్ విషయంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు ముడుగంటలపాటు వర్మను పోలీసులు విచారించారు. 25 నుంచి 30 ప్రశ్నలు అడిగారు. ఆయన ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సీసీఎస్ పోలీసుల ఎదుట తన విచారణపై అనంతరం వర్మ సోషల్ మీడియాలో తనదైన స్టైల్‌లో స్పందించారు. ఈ విచారణ పట్ల తాను చాలా ఆనందంగా (అమేజింగ్ హ్యాపీ) ఉన్నట్టు ట్వీట్ చేశారు. సీసీఎస్ బృందం ప్రొఫెషనలిజం ఎంతగానో నచ్చిందని, థ్రిల్ అయ్యానని.. సీసీఎస్ పోలీసులు తనను విచారిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. పోలీసు అధికారి పాత్రలో నటించినట్టు తనకు అనిపిస్తోందని, ఈ మేరకు తన కోరికను దర్శకులందరూ పరిగణనలోకి తీసుకోవాలని మరో ఫొటోతో ట్వీట్ చేశారు. ఈ కామెంట్‌కు దర్శకుడు పూరీ జగన్నాథ్ వెంటనే స్పందించారు. స్క్రిప్ట్ రెడీగా ఉంది సర్.. మీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు వర్మ థాంక్స్ కూడా చెప్పారు.
జీఎస్టీ వెబ్‌సిరీస్‌లో మహిళలను కించపరిచారని, సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు. వర్మపై దేవి చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment