
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్ మసాలా ఎంటర్‌టైనర్ ఇస్మార్ట్ శంకర్. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవటంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ టీంతో రామ్ గోపాల్ వర్మ కూడా జాయిన్ అయ్యారు.
పూరి టీంతో కలిసి పార్టీలో పాల్గొన్న వర్మ షాంపైన్ బాటిల్‌ను పొంగిస్తూ కనిపించారు. తన శిష్యుడి సక్సెస్‌ను సెలబ్రేట్ చేస్తూ సందడి చేశారు. పూరి కూడా గురువును కౌగిలించుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీరాములు థియేటర్‌లో ఇస్మార్ట్ శంకర్ షోకు దర్శకులు అజయ్ భూపతి, అగస్త్య మంజులతో వెళ్లారు వర్మ.
Comments
Please login to add a commentAdd a comment