ప‌వ‌ర్ స్టార్ నుంచి ‘గ‌డ్డి తింటావా?’ | Power Star: Gaddi Thintava Song Release On 5 pm July 19 | Sakshi

ప‌వ‌ర్ స్టార్ నుంచి తొలి సాంగ్‌

Jul 19 2020 10:10 AM | Updated on Jul 19 2020 2:17 PM

Power Star: Gaddi Thintava Song Release On 5 pm July 19 - Sakshi

సంచ‌ల‌నాల‌కు చిరునామా, వివాదాల‌కు కేరాఫ్.. ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న‌ తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’. ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా నుంచి "గ‌డ్డి తింటావా?" పాట‌ నేడు సాయంత్రం ఐదు గంట‌ల‌కు విడుద‌ల కానుంది. ఇక ఈ పాట‌లో హీరో త‌న గేదెలు, మొక్క‌ల‌ను ఉద్దేశిస్తూ పాడతాడ‌ని ఆర్జీవీ పేర్కొన్నారు. పనిలో పనిగా వర్మ ‘ప‌వ‌ర్ స్టార్’ సినిమాలో ఓ క్యారెక్టర్‌ అంటూ... అతడు ఎవరి పోలికతో అయినా ఉన్నాడా అంటూ  ట్వీట్‌ చేశారు.

సెటైరిక‌ల్ మూవీగా క‌నిపిస్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ జూలై 22న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. అయితే ఓ కండీష‌న్‌! 25 రూపాయ‌లు చెల్లించిన త‌ర్వాతే ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో ట్రైల‌ర్‌ను చూసే అవ‌కాశం ఉంటుంది. ఇలా ట్రైల‌ర్ చూసేందుకు డబ్బులు వ‌సూలు చేస్తోన్న తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం. జూలై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో సినిమా విడుద‌ల కానుంది. ఇక ఇప్ప‌టికే 'ప‌వ‌న్ క‌ళ్యాణ్' సినిమా నుంచి విడుద‌లైన ప‌లు చిత్రాలు సోష‌ల్ మీడియాను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. (బ్రేకింగ్‌ న్యూస్‌)

పూరీకి ఆర్జీవీ కంగ్రాట్స్‌..
డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇస్మార్ట్ శంక‌ర్ విడుద‌లై శ‌నివారం(జూలై 18)తో ఏడాది అవుతోంది. ఈ సంద‌ర్భంగా పూరీ ట్విట‌ర్‌లో త‌న ఆనందాన్ని పంచుకున్నారు. "స‌రిగ్గా ఏడాది క్రితం ఈరోజు ఒక పండుగ వాతావార‌ణం ఉండేది. ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ‌డానికి నిర్మాత చార్మీ ఎంత‌గానో శ్ర‌మించారు. అలాగే హీరోయిన్లు నిధి అగ‌ర్వాల్‌, న‌భాటేష్‌తో పాటు టీమ్ అంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు" అంటూ రాసుకొచ్చారు. దీనిపై వ‌ర్మ స్పందిస్తూ "మీకు, చార్మీకి శుభాకాంక్ష‌లు. మీ త‌ర్వాతి సినిమా కూడా మ‌రింత బ్లాక్‌బాస్ట‌ర్ అవాల‌ని కోరుకుంటున్నాను" అని తెలిపారు. (‘ఇస్మార్ట్‌’ విజయం మా ఆకలిని తీర్చింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement