ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చర్చా వేదికలో తనను రాంగోపాల్ వర్మ అవమానించారంటూ దేవి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమాను ఎవరైనా అడ్డుకుంటే కొడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం?
Published Fri, Feb 16 2018 10:02 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement