సాక్షి,గుంటూరు : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీపై అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. నిన్నటి (సోమవారం) విచారణలో కూడా వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పిన హైకోర్టు.. ఈరోజు(మంగళవారం) షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆర్జీవీపై నమోదైన అన్నీ కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నమోదైన కేసుల విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది.
ఇదీ చదవండి: ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో!
తప్పుడు చానళ్లపై కేసులు వేస్తా: ఆర్జీవీ
Comments
Please login to add a commentAdd a comment