లెక్క చేయలేదని చితక్కొట్టారు!
Published Wed, Aug 31 2016 11:19 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
బుట్టాయగూడెం : లెక్క చేయలేదని ఓ విద్యార్థిని స్థానిక రాజీవ్ నగర్ కాలనీ ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టినట్టు సమాచారం. సేకరించిన వివరాల ప్రకారం.. బుట్టాయగూడెం రాజీవ్ నగర్ కాలనీలోని ఎంపీపీ పాఠశాలలో ఓదూరి సాయి చరణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. గతంలో చరణ్ రాజమండ్రిలో ఇంగ్లిష్‌మీడియం పాఠశాలలో చదివేవాడు. ఈ ఏడాది తల్లిదండ్రులు అతడిని ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు. ఈనేపథ్యంలో బుధవారం లెక్కల మాస్టారు బోర్డుపై భాగాహారం చేస్తూ.. చరణ్‌ను చదవాలని చెప్పారు. తనకు తెలీదని, ఇంగ్లిష్‌లో చెప్పాలని చరణ్ సమాధానమిచ్చాడు. దీంతో ఉపాధ్యాయుడికి కోపం వచ్చి తీవ్రంగా కొట్టినట్టు తెలిసింది. చరణ్‌కు బలమైన దెబ్బతగిలినట్టు, కుటుంబ సభ్యులు సాయి చరణ్‌ను బుట్టాయగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సలహా మేరకు జంగారెడ్డిగూడెం ఎముకల ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. విషయం రాత్రి 8గంటల వరకూ బయటకు రాలేదు. ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లిదండ్రులు రాజీ చేసుకున్నట్టు తెలిసింది.
Advertisement
Advertisement