
నిందితుడు రాజు
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బిడ్డలతో సమానంగా చూసుకోవాల్సిన విద్యార్థులతో సృష్టికి విరుద్ధంగా లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. హైస్కూలు ఉపాధ్యాయుడు విద్యార్థులతో వికృతంగా ప్రవర్తించిన సంఘటన రాంనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాంనగర్‌లోని, రాంనగర్ హైస్కూల్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజు గత మూడు రోజులుగా ఏడవ తరగతి విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో సదరు విద్యార్థి స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థి తండ్రి బుధవారం కుమారుడిని బలవంతంగా పాఠశాలకు తీసుకురాగా ఏడుపు మొదలుపెట్టాడు.
ఏమైందని గట్టిగా నిలదీయగా అడ్మినిస్ట్రేటర్ రాజు గత మూడు రోజులుగా తన క్యాబిన్‌కు తనను పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుతులైన తల్లిదండ్రులు, బంధువులు రాజుపై దాడి చేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. 9వ తరగతికి విద్యార్థిపై కూడా అతను ఇదే విధంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment